Others

తెలుగులో బాలల చిత్రాల చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో తొలి టాకీ ‘్భక్తప్రహ్లాద’ (15.9.1931)తో మొదలైంది. అందులో కథానాయకుడు బాల భక్తుడైన ప్రహ్లాదుడిగా సురభి నాటక కంపెనీకి చెందిన మాస్టర్ కృష్ణారావు పోషించారు. 1942లో వచ్చిన ‘్భక్తప్రహ్లాద’లో జి.వరలక్ష్మి ప్రహ్లాదునిగా నటించారు.
ఇదే కథను 1958లో చెంచులక్ష్మిగా తీసినపుడు నటి పుష్పవల్లి కుమారుడు, ప్రముఖ హిందీ నటి రేఖ సోదరుడు అయిన మాస్టర్ బాబ్జి పోషించారు. 1967లో ఏవియంవారు తీసిన ‘్భక్తప్రహ్లాద’లో బేబి రోజారమణి ఆ పాత్రను పోషించారు. అయితే అటు చెంచులక్ష్మిలోనూ, ఇటు ప్రహ్లాదలోనూ కూడా ప్రహ్లాదునికి పి.సుశీల పాడగా ఆ గీతాలను ఎస్.రాజేశ్వరరావు స్వరపర్చటం విశేషం.
ఎస్.రాజేశ్వరరావు 1935లో వచ్చిన ‘కృష్ణలీలలు’ చిత్రంలో మాస్టర్ రాజేశ్వరరావు బాలకృష్ణుడి పాత్ర పోషించారు. అదే కథను 1959లో నిర్మించినపుడు బేబీ ఉమ, 1975లో ‘యశోదా కృష్ణ’గా వచ్చినపుడు బేబీ శ్రీదేవి బాలకృష్ణునిగా నటించారు.
అందరూ బాలలతో సి.పుల్లయ్య తీసిన ‘అనసూయ’ చిత్రంలో నటి, గాయని కృష్ణవేణి టైటిల్ రోల్‌ను ప్రముఖ గాయని ఆర్.బాలసరస్వతీదేవి నటిగా గంగ పాత్రను నిర్వహించారు.
బాలభక్తుడు మార్కండేయుడు. ఆ పాత్రను 1938లో జి.ఎన్.స్వామి, 1956లో మాస్టర్ బాబ్జి, భానుమతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రంలో మాస్టర్ హరి మార్కండేయునిగా నటించారు.
ప్రముఖ వీణా విద్వాంసుడు చిట్టిబాబు (లైలామజ్ను)లో చిన్న హీరోగా నటించారు.
కె.ఎస్.ప్రకాశరావు నిర్మించిన పూర్తి బాలల చిత్రం ‘బాలానందం’. అది మూడు చిన్న కథల (బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, రాజయోగం) సమాహారం. ఇందులో బాలానందం సభ్యులు ముఖ్యంగా కుందు, రేలంగి తనయుడు సత్యనారాయణ బాబు ప్రధాన పాత్రలు పోషించారు.
విజయవారి ‘పెళ్లిచేసి చూడు’లో బాల పాత్రలు సిసింద్రీ, చిచ్చుబుడ్డి అని సృష్టించి వాటి ద్వారా కథ నడిపించారు చక్రపాణి, ఎల్.వి.ప్రసాద్. వాటిని మాస్టర్ కుందు, బేబి గిరిజ నిర్వహించారు. చిన్న పిల్లలపై మూడు పాటలు చిత్రీకరించారు. ‘అమ్మా నొప్పులే’ అన్న పాటలో నటించిన బాల నటుడు కంద మోహన్ తరువాత ఐఎఎస్ ఆఫీసరై మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మల్లీశ్వరిలో రాణించిన బాల నటులు వెంకట రమణ, మల్లిక.
వినోదావారి ‘దేవదాసు’లో చిన్న దేవదాసుగా సుధాకర్, పార్వతిగా అనూరాధ ముద్దుముద్దుగా నటించారు. వారే తీసిన కన్యాశుల్కంలో వెంకటేశం వేషాన్ని కుందు పోషించాడు.
అనుభవమున్న నటుల కంటే మిన్నగా బాలనటుడు సుధాకర్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించిన చిత్రం బి.ఎ.సుబ్బారావు తీసిన ‘రాజూ-పేద’.
‘సంతానం’ చిత్రంలో బాలనటి బేబీ విజయలక్ష్మిపై చిత్రీకరించిన ‘నిదురపోరా తమ్ముడా’ గీతాన్ని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడటం విశేషం. అదే విజయలక్ష్మి, వర్మ బాల తారలుగా నటించిన చిత్రం అన్నపూర్ణ వారి దొంగరాముడు. సంతానంలో చిన్నప్పటి హీరోగా నటించిన కపిల నాగేశ్వరరావు తరువాత ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు.
శరత్ నవల ‘బిందుగారబ్బాయి’ ఆధారంగా తిలక్ తీసిన ‘ముద్దుబిడ్డ’లో బాలనటుడే హీరో. ఆ పాత్రను మాస్టర్ వెంకటేష్ చాలా సహజంగా పోషించాడు.
భలేరాముడులోనూ, మాయాబజార్‌లోనూ చిన్నప్పటి సావిత్రిగా నటించిన బాలనటి సరస్వతి (సుబ్బు) చక్కని హావభావాలు ప్రదర్శించింది.
పైన పేర్కొన్న బాలనటుడు మాస్టర్ బాబ్జి బాలనటుడిగా రాణించిన మరో మూడు చిత్రాలు చిరంజీవులు, సువర్ణసుందరి, మామకు తగ్గ అల్లుడు.
ఎన్.టి.రామారావు నిర్మించిన ‘పాండురంగ మహత్మ్యం’లో ‘హే కృష్ణా ముకుందా మురారీ’ అనే గీతంలో బాలకృష్ణునిగా తళుక్కున మెరిశారు బాలనటిగా విజయనిర్మల.
అన్నపూర్ణ సంస్థ నిర్మించిన (తోడికోడళ్ళు, మాంగల్యబలం) చిత్రాల్లో బాల పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వటమేగాక వారిపై పాటలు కూడా చిత్రీకరించారు (గాలిపటం, దసరా పాట, హాయిగా ఆలుమగలై కాలం గడపాలి).
తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్రవేసిన చిత్రం ‘లవకుశ’. 1934లోనూ, 1963లోనూ వచ్చిన రెండు చిత్రాలూ సి.పుల్లయ్య దర్శకత్వంలో తయారైనవే. 1934లో తెలుపు నలుపుల్లో వచ్చిన చిత్రంలో మాస్టర్ భీమారావు లవునిగాను, మాస్టర్ మల్లీశ్వరరావు కుశునిగాను నటించగా 1963 రంగుల చిత్రంలో ఆ పాత్రలను మాస్టర్ సుబ్రహ్మణ్యం, మాస్టర్ నాగరాజు సమర్థవంతంగా పోషించారు. నేటికీ వారిద్దరూ లవకుశలుగా సన్మాన సత్కారాలు అందుకుంటూనే వున్నారు.
1966లో వచ్చిన ‘లేతమనసులు’ చిత్రంలో బేబి కుట్టి పద్మిని ద్విపాత్రాభినయం చేసి ఆ చిత్ర విజయానికి సహకరించారు. వారిపై చిత్రీకరించిన గీతాలు ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే, కోడి ఒక కోనలో’ హిట్ అయ్యాయి.
బాలనేరస్థులకు కనువిప్పు కలిగించే విధంగా అక్కినేని-ఆదుర్తి సంయుక్తంగా నిర్మించిన ‘సుడిగుండాలు’ చిత్రంలో ప్రముఖ నటుడు కాంతారావు కుమారుడు రాజా హీరోగా నటించాడు.
బాలనటుడు ప్రభాకర్‌ను ప్రధాన పాత్రలో బాపూ-రమణ రూపొందించిన చిత్రం ‘బాలరాజు కథ’. వారే తీసిన బాలల చిత్రం ‘స్నేహం’.
ఏ.వి.యంవారి ‘రాము’ చిత్రం టైటిల్ రోల్‌లో మాస్టర్ రాజ్‌కుమార్ విషాదపరమైన అభినయాన్ని మూగవానిగా అద్భుతంగా ప్రదర్శించారు. ఏవియంసంస్థ కూడా బాల పాత్రలకు ప్రాధాన్యతనిచ్చింది. కమలాకర కామేశ్వరరావు బాలలతో తీసిన చిత్రం ‘బాల భారతం’. ‘మూగనోము’లో ప్రధాన బాల పాత్రను బేబి బ్రహ్మాజీ పోషించింది.
ఇక కథానాయికలుగా వెలుగొందిన జయసుధ (పండంటి కాపురం), శ్రీదేవి (బడిపంతులు, భార్యాభర్తలు), బాలనటులుగా రాణించినవారే. తులసి కూడా బాలనటిగా (శంకరాభరణం) ప్రశంసలందుకుంది.
నేటి కమెడియన్ అలీ, రోజారమణి తనయుడు తరుణ్, బేబి షామిలి బాల నటులుగా గుర్తింపు పొందినవారే.
అందరూ బాల తారలతో అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి నిర్మాత ఎం.ఎస్.రెడ్డి, దర్శకుడు గుణశేఖర్ పదికాలాలపాటు జ్ఞాపకముంచుకోదగ్గ మహత్తర పౌరాణిక చిత్రం ‘రామాయణం’ నిర్మించి చరిత్రలో తమకొక సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇదొక రికార్డుగా చెప్పవలసిందే. చిన్నపిల్లల పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చి స్వీయ దర్శకత్వంలో మహానటి సావిత్రి రూపొందించిన చిత్రం ‘చిన్నారి పాపలు’.
నంది అవార్డులు
1978వ సంవత్సరం నుంచీ ఉత్తమ బాల చిత్రానికి, బాలనటీనటులకు ఆయా చిత్ర దర్శకులకు నంది అవార్డులు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలెట్టింది. ఆ క్రమంలో అవార్డు పొందిన చిత్రాల్లో కొన్ని: గంగాభవానీ, కొక్కొరోకో, ఛలో ఢిల్లీ, భద్రం కొడుకో, రామాయణం, కుచ్చి కుచ్చి కూనమ్మ హీరో నందిని దీక్ష, శే్వత అవార్డు పొందిన బాల నటీనటులు. బేబి తులసి, శ్రావణ్‌కుమార్, మాస్టర్ సంతోష్, మాస్టర్ ఆదిత్య, ఉదయ్, ఆనంద వర్థన్, స్వాతి, కృష్ణప్రదీప్, బేబి నిత్య, సాయి సుధాకర్, జీబా, మహేంద్రన్, రామతేజ, మయూరి, డా.రామానాయుడు నిర్మించిన బాలల చిత్రం ‘హరివిల్లు’కు దర్శకత్వం వహించిన బి.నరసింగరావు నంది అవార్డు పొందారు.
ప్రభుత్వ ప్రోత్సాహాన్ని పురస్కరించుకొని బాలల చిత్రాలు అంతగా తెలుగులో రూపొందకపోయినా ‘అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం’ మన రాజధాని నగరం హైదరాబాద్‌లో జరగటం ఆనందదాయకం.

-ఎస్.వి.రామారావు