Others

శీల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలబస్ లేనిది, విద్యార్థులకు జీవితంలో కవచంగా ఉపయోగపడేది, తరగతి గది చేయవలసిన ముఖ్యవిధి. కేరెక్టర్ ఫార్మేషన్ (శీలాన్ని రూపొందించటం). ఇది తరగతి గది కల్చర్‌లో ఉపాధ్యాయుని జీవితంలో అల్లవలసింది. శీలాన్ని నిర్మించటం కష్టమైన పని. పద్మశాలి బట్టను మగ్గం మీద ఎలా నేస్తాడో శీలాన్ని కూడా అలాగే జాగ్రత్తగా నిర్మించాలి. ప్రతి విద్యార్థికి తనపై తనకు విశ్వాసాన్ని రూపొందించగలగాలి. ఇది తరగతి గది చేయాలి. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు చిన్నచిన్న కథలతో, ఉదాహరణలతో పెద్దపెద్ద మేధావుల తమ ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని, పవిత్ర ఆశయం ఏ విధంగా వారికి సత్ఫలితాలిచ్చాయో పరోక్షంగా చెప్పటం చేయాలి. ఇవే వారికి భవిష్యత్తుకు ఉపయోగపడినట్లు సందర్భాన్నిబట్టి సందర్భోచితంగా చెప్పాలి. బోధన ఇలా జరిగితే ఒక కొత్త తరానికి బీజం వేసిన వాళ్లం అవుతాం. ఉపాధ్యాయుడు తన సబ్జెక్ట్‌లో ఉన్న మహామనుషుల జీవితాలు చదవాలి. ఆ గొప్ప వ్యక్తులు ఏ విధంగా కృషి చేశారో సిలబస్‌లోని సబ్జెక్టులో ఇమిడ్చి చెప్పగలిగితే అవి తరగతి గదికి అలంకారంగా మారుతాయి. ఒక సోషల్ పాఠం చెబుతున్నప్పుడు అమెరికాలో ఉన్న ఆఫ్రికో అమెరికన్లు, అబ్రహాం లింకన్ లాంటి అమెరికన్ ప్రజాస్వామిక వాదులు ఏ విధంగా పోరాడి వారిని ఏ విధంగా విముక్తి చేశారో, గాంధీ ఏ విధమైన పద్ధతుల్లో తన లక్ష్యాన్ని కొనసాగిస్తూ సాధించాడో చెప్పగలగాలి. అదే ఉపాధ్యాయుడు సమాజానికి గొప్ప సేవ చేసిన వారవుతారు. విద్యార్థులు తమ కేరెక్టర్ జీవితమనుకొని, దౌర్భల్యమే మరణం అనుకొని, త్యాగమే ఆనందమనుకొని నిరంతరం జీవితంలో యాతన పడే సంతతిగా తయారవుతే తరగతి గదికి దీనికన్నా గొప్ప కానుక ఏదీ లేదు. ఇదే జీవితంలో తిరుగులేని నిజం. జీవితాన్ని గెలిచేందుకు ప్రతిఘటించి నిలవగలుగుతామనే భావన, ఆత్మవిశ్వాసాన్ని తరగతి గది కలిగించాలి. కేరెక్టర్ నిర్మాణంలో ఇది మొదటిది. తరగతి గది విద్యార్థులకిచ్చే మొదటి కనుక కేరెక్టర్ ఫార్మేషన్ చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి.

-డా.చుక్కా రామయ్య