Others

శివుని మహిమతెలిపేవి.. ఆరోగ్యాన్నిచ్చేవి రుద్రాక్షలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాలయ పర్వత ప్రాంతాలల్లో నేపాల్, అస్సాం, జావా, మలయా, నీలగిరి, ఆనెమల, పళని, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మైసూరు ప్రాంతములలో రుద్రాక్షలు విరివిగా వివిధ ముఖాలలో లభిస్తాయి.
ఇవి ఏకముఖ ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ, షణ్ముఖ, సప్తముఖ, అష్టముఖ, నవముఖ, దశముఖ, ఏకాదశముఖ, ద్వాదశ ముఖ, త్రయోదశ ముఖ, చతుర్దశ ముఖాలుగా లభిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే. ఈ వృక్షాలు ప్రాంతాన్నిబట్టి 5 మీటర్ల నుండి 25 మీటర్ల ఎత్తువరకు పెరిగి గంభీరంగా హుందాగా కనిపిస్తాయి. ఇవి డిసెంబర్, జనవరి నెలలలో తెల్లటి పూవులతో గుత్తులు గుత్తులుగా విరబూసి కమ్మని సువాసనలు వెదజల్లుతాయి. జూలై, ఆగస్టు నెలలో ఆకుపచ్చ రంగులో గుడ్డు వంటి ఆకారాన్ని పోలిన కాయలు కాస్తాయి. మఱ్ఱి విత్తనం మహావృక్షము దాగి ఉన్నట్లు రుద్రాక్షలో శివమహిమలెన్నో ఇమిడి ఉన్నాయి. రుద్రాక్ష మాల ధరిస్తే బుద్ధి వికాసం, వివేకం లభించి కీర్తిప్రతిష్ఠలు కలిగి ఇహపర సౌఖ్యములు లభిస్తాయి.
హిమాలయ ప్రాంతములో మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో ఉన్న రుద్రాక్ష చెట్లను ‘సౌరెటస్’ అంటారు. వరుణానది తీర ప్రాంతములోని రుద్రాక్ష వృక్షాలను ‘ఓబలోగ్’ అని పిలుస్తారు. ‘గౌరీశంకర్’ అనే రుద్రాక్షలు నేపాల్ ప్రాంతములో లభిస్తాయి. రెండు గింజలు కలిసి ఉన్న రుద్రాక్షలనే ‘గౌరీశంకర్’ రుద్రాక్షలుగా వ్యవహరిస్తారు. ‘్భద్రాక్ష’ అనే రుద్రాక్షలు కూడా నేపాల్‌లోనే దొరుకుతాయి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. మంత్ర, తంత్ర, యోగ, జపానికే కాకుండా రుద్రా వైద్య రంగంలో కూడా ఎంతో ప్రాశస్త్యమును సంతరించుకొన్నది. రుద్రాక్ష చెట్టు, వేరు, పండు, గుజ్జు విత్తనం మరియు పూలు మనకు ఎంతగానో ఉపయోగపడును. దీని కాయలు పుల్లని రుచి కలిగి తినాలనిపిస్తుంది. అస్సాంలో గిరిజనులు వీటిని రేగుపళ్ళలా తింటారు. దీని పండు వేడి చేస్తుంది. వాతాన్ని, శే్లష్మాన్ని దూరం చేసి రోగ క్రిములను నాశనం చేస్తుంది. గ్రహ దోషాలను తొలగించి, బుద్ధిని, వివేకాన్ని కలిగిస్తుంది. మెదడు హృదయానికి సంబంధించిన రోగాల్ని దూరం చేస్తుంది. రుద్రాక్ష పూలు మూర్చ, అపస్మారం తలతిప్పుటను దూరం చేస్తాయి. ముఖ్యంగా నేపాలు రుద్రాక్షలు హృద్రోహము, రక్తపోటు, బ్రెయిన్ హేమరేజ్ మరియు అనేక చర్మరోగాలను దూరం చేస్తాయి. రుద్రాక్ష ఎన్నికలో అనుభవజ్ఞులు సహాయం తీసుకోవడం మంచిది. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగుతుంది. నకిలీ రుద్రాక్ష నీటిపై తేలుతుంది.
రుద్రాక్ష స్పర్శవల్ల చిత్తవికారాలన్నీ తొలగిపోతాయి. దీనిని ధరించడంవలన ఎన్నో రోగాలు దూరమై శరీరం, మనస్సు తేలిక పడి పవిత్రంగా మారుతుంది.

-పెండెం శ్రీ్ధర్