Others

జ్ఞాన సముపార్జన కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుల మనుగడకు గాలి, నీరు, ఆహారం, వసతి ఎంత అవసరమో, చక్కటి భవిష్యత్‌కు విజ్ఞానం కూడా అంత అవసరమే. జ్ఞానానికి మూలం విద్య. పుస్తకాల ద్వారా మనం జ్ఞానం పెంచుకోగలం. పుస్తక పఠనం అనే అలవాటుతో అది సాధించవచ్చు. అలాంటి విలువైన పుస్తకాలు, పత్రికలు ఒకేచోట లభించే సౌకర్యం గ్రంథాలయాలు కల్పిస్తున్నాయి. లక్షల మెదళ్లకు పదునుపెట్టేవి అవే. ఎందరో ప్రముఖులు తమకు మంచిమార్గాన్ని చూపించినవి గ్రంథాలయాలేనని గర్వంగా చెప్పుకున్నారు. నిజానికి అది ఒక ఉద్యమంలా పనిచేసింది. గ్రంథాలయాల ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏటా నవంబర్ 14నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీటిని మాసోత్సవాలుగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాచీన భారతం విశ్వగురు అనిపించుకుందంటే పురాతనమైన, విశిష్టమైన ఎన్నో గ్రంథాలకు నెలవు కావడమే. మన విలువైన గ్రంథాలలో విజ్ఞానాంశాలను తెలుసుకోవడానికి తక్షశిల, నలంద వంటి ప్రఖ్యాత పురాతన విశ్వవిద్యాలయాలకు దేశ విదేశాల నుంచి ఎందరో విద్యాభ్యాసం కోసం వచ్చేవారు. అలా ఆకర్షించినవి అలనాటి అపురూపమైన గ్రంథాలే. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోల్‌కతాలో నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయం అంతటి ప్రాముఖ్యతను సాధించింది. దీనిని 1860లో స్థాపించారు. ఇక్కడ దాదాపు 24 లక్షలకు పైగా పుస్తకాలున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది. దక్షిణ భారతంలో మద్రాస్‌లోని ‘కనె్నమెర’ గ్రంథాలయం అత్యంత ప్రసిద్ధమైంది. గ్రంథాలయాలను ‘వౌన విద్యాలయాలు’గా సినారె చెప్పేవారు. తెలుగునేలపై గ్రంథాలయ విద్యను వాయ్ప్తి చేసినవారిలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, అయ్యంకి వెంకట రమణయ్య, వెలగా వెంకటప్పయ్య, కొమర్రాజు లక్ష్మణరాజు, మాడపాటి హనుమంతరావు, రావిచెట్టు రంగారావు, బూర్గుల రామకృష్ణరావు, సురవరం ప్రతాపరెడ్డి ముఖ్యులు. 1911లో రామమోహన గ్రంథాలయాన్ని అయ్యంకి వెంకట రమణయ్య స్థాపించి ఊరూరా గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. 1914లో వీటి రూపకల్పన, పుస్తకాల భద్రతపై మహాసభలు నిర్వహించారు. 1928లో సూర్యాపేటలో ఆంధ్ర మహా గ్రంథాలయ సభలకు దేశభక్త వామన్ నాయక్ అధ్యక్షత వహించారు. నవంబర్ 14న గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు. నిజానికి 1910లో బరోడా మహరాజు శివాజీరావు గైక్వాడ్ ఆదర్శవంతమైన గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టారు. 1901లో హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయం ఏర్పాటైంది. తెలంగాణ తొలి ఉద్యమానికి గ్రంథాలయ ఉద్యమమే ఊపిరిగా సురవరం చెప్పేవారు. వట్టికోట ఆళ్వారుస్వామివంటి వారు తలపై పుస్తకాలను పెట్టుకుని ఊరూరా తిరుగుతూ ప్రజలలో పుస్తక పఠనంపై చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు గ్రంథాలయాల నిర్వహణను ఒక శాస్త్రంగా పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉది. ఇప్పటి అవసరాలకు తగ్గట్లు డిజిటల్ లైబ్రరీల నిర్వహణ అవసరం. ఇంటర్నెట్ సౌలభ్యం కల్పించాలి. అప్పుడే గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తికి ఊపిరులూదినట్లు అవుతుంది.

-కె.రామ్మోహనరావు