Others

ఫ్రాన్స్ రైళ్లపై దృష్టి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ సహకారంతో మనదేశంలో తొలిసారిగా నిర్వహించనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. అహమ్మదాబాద్-ముంబైల మధ్య నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 1.10 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఇంతమొత్తం వెచ్చించాలా అన్నది ప్రశ్న. అంత ఖర్చుపెట్టి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మించే బదులు అంతకన్నా ఐదు రెట్లు తక్కువ ఖర్చుతో సెమీ హై స్పీడు రైలు సౌకర్యం కల్పించవచ్చని ఫ్రాన్స్ అంటోంది. ఇప్పటికే ఈ అంశాన్ని మనదేశంతో ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు ప్రతిపాదనలు పంపాయని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకుకు అడ్డంకిగా కాకపోయినా భవిష్యత్‌లో ఫ్రాన్స్ సెమి హైస్పీడ్ రైలు ప్రాజెక్టులపై చర్చ జరగవచ్చు. సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న జపాన్ వీటి నిర్వహణ విషయంలో శిక్షణ కూడా ఇవ్వనుంది. ఫ్రాన్స్ కూడా ఆ పాత్ర పోషించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఇప్పుడు మన రైల్వే వ్యవస్థలో ఉన్న ట్రాక్‌లు పనికిరావు. వాటికోసం ప్రత్యేకంగా, అత్యంత వ్యయంతో ప్రత్యేక ట్రాక్‌లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ఫ్రాన్స్ సూచిస్తున్న హైస్పీడ్ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు అవసరం లేదు. భారత్‌లో ఇప్పుడు వినియోగంలో ఉన్న రైల్వే మార్గాలను కాస్త ఆధునీకరిస్తే సరిపోతుంది. అందుకే తమ ప్రాజెక్టు అత్యంత తక్కువ వ్యయంతో కూడుకున్నవని ఫ్రాన్స్ చెబుతోంది. సెమీ హైస్పీడ్ రైళ్లంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించగలవన్నమాట. మనదేశంలో తొలి బుల్లెట్ రైలు వేగం గంటకు 350 కిలోమీటర్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ముంబై-అహమ్మదాబాద్ నగరాల మధ్య దూరం దాదాపు 508 కి.మి. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తొలిసారిగా బుల్లెట్ రైలును నడపాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష. బుల్లెట్ రైలు పట్టాలెక్కితే భారతీయ రైల్వేలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. సకాలంలో బుల్లెట్ రైలు పట్టాలెక్కాలని అందరూ అభిలషిస్తున్నారు. హైస్పీడ్, సెమి హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులు చేపట్టడానికి ఫ్రాన్స్ ప్రతిపాదనలతో భారత్‌తో సంప్రదిస్తోంది. గడచిన సెప్టెంబర్‌లో ఈ మేరకు ప్రాథమిక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చు.

-రవళి