AADIVAVRAM - Others

మోకాళ్ల నొప్పులకు జీరా వాటర్ ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: కేరళ వాళ్లు జీరా వాటర్, వాము వాటర్ ఇలాంటివి తాగుతారు కదా! దానివల్ల ప్రయోజనం ఏమిటి? మోకాళ్ల నొప్పులు తగ్గటానికి ఇది ఉపయోగపడ్తుందా?
-తన్మయి, విశాఖపట్టణం
జ: సింగినాదం జీలకర్ర అంటారు. ఏమీ లేదు, ఉత్తుత్తి ఆర్భాటమే అనటానికి ఈ సామెతని ఎక్కువ వాడతారు. ఇక్కడ ఏమీ లేనిది, ఉత్తుత్తి ఆర్భాటం చేసేది జీలకర్ర కాదు, సింగినాదమే! సింగినాదం అంటే కొమ్ము బూర. ఎనుబోతు కొమ్ముల్ని లోపల తొలిచి ఊదితే బుర్రని శబ్దం వస్తుంది. శృంగి అంటే కొమ్ము. కొమ్ముని ఊదుతారు కాబట్టి అది కొమ్ముబూర అయ్యింది. కాలువల మీద, నదుల మీద సరుకుల్ని గూడు పడవల్లో వేసుకుని ఒడ్డున ఆగి, ఈ బూర ఊదేవాళ్లు. జీలకర్ర వగైరా సరుకులతో పడవ వచ్చిందని దీనికి గుర్తు. సింగినాదం జీలకర్ర సామెత కథ ఇది. జీరా, జీరకం, జీలకర్ర అని దీన్ని పిలుస్తారు. ఇది ఈజిప్షియన్లు ఆహార పదార్థంలో ఒక సుగంధ ద్రవ్యంగా వాడుకోవటం మొదలుపెట్టి 5వేల ఏళ్ల పైచిలుకు మాటే! గ్రీకులు, రోమన్లు కూడా ఉపయోగించారు. శరీరానికి రంగునిస్తుందని దీన్ని వాడినట్టు చరిత్ర. బైబిల్ పాత నిబంధన గ్రంథాల్లో జీలకర్ర గురించిన విశేషాలున్నాయి. అది దేవుడిచ్చిన వరాల్లో ఒకటిగా చెప్పబడింది. ఇరాన్ దీని జన్మభూమి కావచ్చునంటారు. పార్స్ అనే ఇరానీ ప్రాంతాన్ని బట్టి ఈ మొక్క పార్స్’లీ కుటుంబానికి చెందినదిగా చెప్తారు.
భారతీయులు, మెక్సికన్లు, వియత్నామీయులు జీలకర్రని ప్రధాన ఆహార ద్రవ్యాల్లో కలుపుకునే అలవాటును ప్రాచీన కాలం నుండీ కొనసాగిస్తున్నారు. ప్రేమ బంధాన్ని పెంపుచేసే శక్తి దీనికుందని వాత్సల్యానుబంధాలకు సంకేతంగా ప్రాచీన జాతుల వారంతా భావించారు. ఈనాటికీ జర్మనీ వాళ్లు పెళ్లికూతురు గౌను జేబులో జీలకర్ర మూటని పెట్టి పంపిస్తారు. సైనికులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు వారి భార్యలు వీర తిలకం దిద్ది పంపినట్టే అక్కడ జీలకర్ర రొట్టెలు చేసి మూట గట్టి ఇచ్చి పంపిస్తారట. తెలుగు వాళ్లు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టి, అదే శుభ ముహూర్తంగా భావిస్తారు.
సుగంధ ద్రవ్యాల్లో జీలకర్ర ఎక్కువ శక్తివంతమయ్యింది. తక్కువ మోతాదులోనే గుణాన్నిచ్చేది. అల్లం వెల్లుల్లి, మిరపకారాలతో పోల్చినప్పుడు నిరపాయకరమైనది కాబట్టి జీలకర్రని సద్వినియోగపరచుకోవటంలో మనం యుక్తిని ఉపయోగించగలగాలి. జీలకర్రని కొన్నాక ఆ మొత్తాన్నీ బాండీలో వేసి దోరగా వేయించి భద్రపరచుకోండి. దాని లోపలుండే చెమ్మ పోయి పురుగు పట్టకుండా నిలవుంటుంది. తేలికగా వొంటబడ్తుంది. సుగంధం (అరోమా) బయటకొస్తుంది.
జీలకర్రని దోరగా వేయించి వాడుకుంటే దానిలోని దోషాలు పోతాయి. తాలింపులోకి చిటికెడంత వేసినంత మాత్రాన జీలకర్ర వలన కలిగే గుణాలన్నీ మనకు దక్కుతాయనుకోవటం అపోహ. జీలకర్రని ఔషధంగా తగు మోతాదులో తీసుకుంటే దాని ఫలితాలు కనిపిస్తాయి. జీలకర్రలో అనేక రకాలున్నాయి. తెల్ల జీలకర్రని మనం ఆహార పదార్థాల్లోకి వాడుతున్నాం. నల్ల జీలకర్రని ఔషధాల తయారీకి వాడతారు. తెల్ల జీలకర్రతో కూడా మనం ఔషధ ప్రయోజనాలు పొందవచ్చు.
శరీరంలో జఠరాగ్ని దాని విధుల్ని అది సక్రమంగా నిర్వహించేలా చేయటం జీలకర్ర ప్రధాన విధి. జీలకర్ర పేరు చెప్పగానే ఆరోగ్యవంతమైన జీర్ణాశయ వ్యవస్థ మనకు గుర్తకు రావాలి. జీర్ణాశయం చెడితే సమస్త రోగాలకు తలుపులు తెరిచినట్టే కాబట్టి, ప్రయత్న పూర్వకంగా అగ్ని బలాన్ని కాపాడుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అంటే జీలకర్రని తగుపాళ్లలో ఆరోగ్యవంతులూ, అనారోగ్యవంతులూ కూడా నిత్యం వాడుకుంటూ ఉండాలని దీని భావం.
పైపైన దంచిన జీలకర్ర పొడిని పెద్ద గ్లాసు నీళ్లలో ఒక చెంచా మోతాదులో కలిపి బాగా పొంగులొచ్చే విధంగా మరిగించి రోజూ ఆ నీటిని మామూలు నీటికి బదులుగా తాగుతూ వుంటే శరీరంలో నిర్మాణ క్రియలు వేగవంతం అవుతాయి.
ఉదయానే్న రెండు మూడు గ్లాసుల నీళ్లు తాగే అలవాటున్న వారు మామూలు నీళ్లకు బదులుగా, ఈ జీరా నీళ్లని తాగితే ఎక్కువ మేలు చేస్తాయి. జీరా నీళ్లలో కొద్దిగా పెరుగు వేసి, పలుచని మజ్జిగ చేసుకుని తాగితే అమీబియాసిస్ వ్యాధిలో ఔషధంలా పని చేస్తాయి. ఈ జీలకర్ర మజ్జిగ నీళ్లు ప్రోబయటిక్ గుణాలను అంటే సహజమైన సూక్ష్మజీవి నాశక గుణాల్ని కలిగి ఉంటాయి. దీని వలన జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది. జీర్ణకోశ వ్యాధుల్లో ముఖ్యంగా, అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, టైఫాయిడ్, కలరా లాంటి వ్యాధుల్లో జీలకర్ర మజ్జిగ తప్పనిసరిగా తాగాలి. మజ్జిగనీ జీలకర్రతో తాగితేనే దాని సుగుణాలు మనకి పూర్తి స్థాయిలో దక్కుతాయి.
జీరా వాటర్‌గానీ, జీరా బట్టర్‌మిల్క్ గానీ, ఎసిడిటీ, గ్యాస్‌ల్ని తగ్గిస్తాయి. నోటికి రుచిని పుట్టించి, ఆహారం తిన్నాక భుక్తాయాసం కలక్కుండా చేస్తుంది. వాంతి వికారాలు ఆగుతాయి. రోజువారీ ఆహారంలో మనం తీసుకునే విష దోషాల్ని హరించే గుణం దీనికుంది.
కాలేయం, ప్రేగులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారందరికీ ఇది మేలు చేస్తుంది. డయాలసిస్ మీద ఉన్న వారికి ఇది ఉపయోగపడ్తుంది. మూత్రం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. షుగరు వ్యాధి లేనివారు జీరా మజ్జిగ నీళ్లలో కొద్దిగా పంచదార వేసుకుని తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది.
నెలసరి సరిగా రాని స్ర్తిలు జీరా నీళ్లు తాగటాన్ని అలవాటు చేసుకుంటే ఋతుక్రమం సక్రమంగా వస్తుంది. నిత్యం నీరసం, కాళ్లూ చేతులూ పీకటం, నమిలేస్తున్నట్టు అనిపించటం ఇవన్నీ తగ్గుతాయి. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఈ ప్రయోగాన్ని కొన్నాళ్లపాటు చేస్తే కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. నీళ్ల విరేచనాలు ఆగటానికి కూడా ఇది మంచి ఔషధం.
జీరా నీళ్లను అతిగా తాగకూడదు. ఎక్కువ నీళ్లలో తక్కువ పొడి వేసి ఎక్కువ మరిగించాలి. వడగట్టనవసరం లేదు. వేడి శరీర తత్వం ఉన్నవాళ్లు దీనితో సమానంగా ధనియాల పొడి కలిపి తీసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. ఎంత జీలకర్ర కలిపితే ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉంటుందో చూసుకుంటూ పరిమిత మోతాదులో జీరా నీళ్లు తీసుకుంటే మనం ఆయుః ప్రమాణం పెంచుకోవటానికి ప్రయత్నించటమే అవుతుంది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com