AADIVAVRAM - Others

కళ్లు తెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్షియాలో రబియా సుప్రసిద్ధురాలయిన సూఫీ మార్మికురాలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞాని. ఆమెను అందరూ ఎంతో గౌరవించేవాళ్లు.
ఆమె ఒక రోజు దారంట వెళుతూ అక్కడ వున్న మరొక సూఫీ అయిన హనన్‌ని చూసింది. అతను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. పరవశంతో పులకించిపోతున్నాడు. అతని కళ్ల నించి జలజలా నీళ్లు కారుతున్నాయి. చేతులు ఆకాశానికి చూపి ప్రార్థిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. తపించిపోతున్నాడు. ‘దేవుడా! తలుపులు తెరువు. నన్ను లోపలకి రానివ్వు’ అంటున్నాడు.
అతన్ని రబియా ప్రతిరోజూ చూస్తోంది. ఎప్పుడూ అదే స్థితిలో కనిపించేవాడు. రోజూ అయిదుసార్లు ప్రార్థన చేసేవాడు. ప్రతి ప్రార్థనలో అతని పరిస్థితి అలాగే వుండేది. అదంతా ఆషామాషీగా కాకుండా నిజాయితీగా నిర్వహించేవాడు. హృదయపూర్వకంగా చేసేవాడు. కేవలం అది ఆచారంగా, ప్రతి పూటా నిర్వహించే తతంగంలా కాకుండా, గొప్ప దైవభక్తితో చేసేవాడు.
అతన్లో ఎన్నో మంచి లక్షణా లున్నాయి. రబియా ప్రతిరోజూ అతని పరిస్థితి గమనించేది. అతని ప్రార్థన విన్న ప్రతిసారీ ఆమె చిరునవ్వు చిందించేది. ఒకోమారు నవ్వుకునేది. తన దారంట తాను వెళ్లేది.
ఎప్పట్లా ఒకరోజు రబియా దారంట వెళుతూ అతని ప్రార్థన విన్నది. ఏమనుకుందో ఏమో! అతని దగ్గరికి వెళ్లింది. అతను కళ్లు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. అతన్ని కుదిపింది. అతన్తో ‘నువ్విలా ఎంతకాలం ప్రార్థిస్తావు? ఎందుకింత తపిస్తావు? నేను ఒక విషయం చెబుతున్నా నువ్వు ‘దేవుడా! తలుపు తెరువు నన్ను లోపలికి రానివ్వు’ అంటూ ఎన్నాళ్లగానో ఎనే్నళ్లగానో ప్రార్థిస్తున్నావు. తలుపులు తెరిచే ఉన్నాయి. నువ్వు ఆయన్ని మళ్లీ మళ్లీ తలుపులు తెరవమని అడగాల్సిన పనే్లదు. ఎప్పుడూ తలుపులు తెరుస్తావని నిలదీయాల్సిన పనిలేదు. తెలివితక్కువగా ప్రవర్తించకు. చేసింది చాలు. యింతవరకూ చేసిన రోదనలు చాలు. తలుపు తెరిచే ఉన్నాయి. నువ్వు మొదట చేయాల్సిన పని కళ్లు తెరువు. నీకు కనిపిస్తుంది.’ అంది.
రబియా మాటలు అపూర్వమైనవి అర్థవంతమైనవి.
జీసెస్ ‘తట్టు, తలుపు తెరుచుకుంటుంది’ అన్నాడు.
రబియా ‘కళ్లు తెరిచి చూడు. తలుపులు తెరచుకునే ఉన్నాయి.’ అంది.

- సౌభాగ్య, 9848157909