Others

వద్దు వద్దు అనుకొంటూనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నే ను కాసేపు విశ్రమిస్తున్నా సరే ఆ హరిణాన్ని నా గుండెలపై ఆడుకోనిచ్చేవాడిని. నా పక్కనే నిద్రపోయేది. నేను జోల పాట పాడితేనే కనులు మూసుకొని పడుకునేది.నేను మాత్రం ఒకవేళ పూర్తిగా నిద్రపోతే ఆ హరిణానికి ఎవరైనా కీడు తలపెడుతారేమోనని ఆదమరిచి నిద్రపోయేవాడినే కాదు. దీర్ఘ తపస్సులోకి వెళ్లిపోతే ఈ లేడిని ఏ మృగమైనా తినివేయడానికి వస్తుందేమో నని దీర్ఘకాలం తపస్సులో ఉండడానికి ఇష్టపడేవాడిని కూడా కాదు నాలో ఇంత మార్పు వచ్చినట్టు నాకే తెలియకుండా జరిగిపోయంది. నేను ఇంతలా ఈ హరిణంపై ప్రేమను పెంచుకున్నాను.. ఇంత మమకారం పెంచుకున్న నాకు ఓరోజు ఉదయమే నేను నా ప్రాణంగా పెంచుకుంటున్నహరిణం చిట్టిపొట్టి అంగలు వేసుకొంటూ ఉండేది ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అప్పటిదాకా చెంగుచెంగున ఎగిరి గంతులు వేసే హరిణం కనబడకుండా పోయింది. అది కనిపించక పోయేసరికి నా మసు ఎంతో వ్యాకులం చెందింది. నాలో ఆవేదన, మథన ఎక్కువయ్యాయ. నేను నా కుటీరం చుట్టు పక్కల అంతా వెతికాను. దారి తెలియకుండా అడవిలోకి వెళ్లిపోయిందేమో అనుకొని చుట్టుపక్కల అంతా ఆ రోజంతా వెతుకుతునే ఉన్నాను.
నేను ఎంత వెదికినా నా హరిణం కనిపించకుండాపోయింది. ఇక నామనస్సు నిత్యనైమిత్తికాలమీద మరలలేదు. ఎంతసేపు హరిణం చేసిన చేష్ఠలనే గుర్తుతెచ్చుకుంటూ ఉండేవాణ్ణి. అయినా ఆ హరిణం చిన్న చిన్న అంగలు వేసుకుంటూ నేను కళ్లుమూసుకొని ధ్యానం చేసుకొంటూ ఉన్నా నా శరీరం అంతా నాకుతూ ఉండేది. నన్ను విడిచి ఒక్కక్షణమైనా విడిచి ఉండేది కాదుకదా, ఈ ఆశ్రమంలో అపుడే మొలిచిన పచ్చిన మొనలను తింటూ ననే్న చూస్తుండేది ఇలా ప్రతి నిముషం నేను హరిణాన్ని గురించి ఆలోచిస్తూ యోగభ్రష్టుణ్ణి అయిపోయాను. అన్ని పనులు మానేసి కేవలం హరిణ జపంలోనే కాలం గడిపాను.
ఇక నేను ఆ హరిణాన్ని చూడకుండానే చనిపోతానేమో అనుకొన్నాను. ఈ భూమి ఎంత పుణ్యం చేసుకొందో ఆ జింకపిల్ల పాదస్పర్శ పొందింది అనుకొనేవాణ్ణి నే ను చాలా దిగాలుపడిపోయి ఆశ్రమం నుంచి కదలకుండా పడుకొండిపోయాను. నా చిత్తం అంతాదానిగురించే. ఈ చిన్ని హరిణాన్ని ఏ సింహం అయినా తినేసిందేమో అన్న శంకతో నేను కుమిలిపోయాను.
ఉన్నట్టుండి ఒకరోజు హరిణం మళ్లీ నావైపు పరుగెత్తుకు వచ్చింది. దాన్ని చూసి చూడగానే నాలో ఎక్కడ లేని జవసత్వాలు వచ్చేసాయి. దాన్ని దగ్గర తీసుకొని ఇన్నాళ్లు ఎక్కడకు పోయావని అడుగుతూ ఉండిపోయాను. దాని శరీరమంతా నెమురుతూ ఉండిపోయాను. అట్లా చాలాసేపు దాన్ని పరిష్వంగంలో నన్ను నేను మరిచిపోయాను. ఆ జింకకు పచ్చికను పెట్టాను. ఆ జింకపిల్లను ఎత్తుకుని అడవి అంతా తిరిగి మంచి పండ్లు తెచ్చి తినిపించాను. ఇంకెప్పుడూ నన్నువిడిచిపోవద్దని ఎంతో బతిమిలాడి చెప్పాను.
ఆ జింక కూడా నేను చెప్పింది విన్నట్లు నాకు అనిపించింది. ఆ జింక కూడా నన్నువదిలి వెళ్లిపోయినందుకు ఎంతో బాధపడిందని నాకుఅనిపించింది. అలా ఇక ఆశ్రమంలో నాకొడుకుతో నేను జీవిస్తున్నట్టుగా ఆ జింకపిల్లతోడిదే జీవితం అనుకొని కాలాన్ని వృథా చేసుకొన్నాను. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. నాకు అంత్యదశ వచ్చేసింది. కాని నేను మాత్రం ఈ జింకపిల్లపై అనురాగాన్ని కాస్తయినా దూరం చేసుకోలేదు.మహారాజుగా ఉండి కొడుకులను కని, వారిని పెంచి పెద్దచేసి వారికి నా రాజ్యాన్నిచ్చి ఈ అనుబంధాలేవీ వద్దుఅనుకొని ఆశ్రమవాటికకు వచ్చిన నేను ఆ జింకపిల్లపై అనురాగాన్ని పెంచుకుని ఆ జీవిత చరమాంకంలో ఆ జింకపైనే ప్రాణాలు నిలుపుకున్నాను.

- డాక్టర్ రాయసం లక్ష్మి