Others

మానవుడే మహనీయుడు...’’(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిలో ఆత్మవిశ్వాసం, ఉత్తేజము, ఉద్రేకము తెప్పించకలిగేది నిజమైన కళ. పాట కావ చ్చు మరేదైనా కళ కావచ్చు. ఏదైనా మనిషి పాతాళానికి వెళ్ళకుండా నిలబెట్టగలిగేది నిజమైన ప్రక్రియ. ఆ కోవకు చెందినదే బాలభారతం సినిమాలోని ‘మానవుడే మహనీయుడు’ పాట. నాకు చాలా ఇష్టమైన పాట.
1972లో విడుదలైన ఈ సినిమా పాట ఆరుద్రగారిచే రచించబడి, రసాలూరు సాలూరి రాజేశ్వరరావుగారిచే స్వరరచన చేయబడి, ఘంటసాల వెంకటేశ్వరరావుగారిచే గానం చేయబడింది. మిగతా జీవరాసులన్నింటిలోను మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. మరియు విలువైనది. అన్ని జీవరాసులకన్నా మనిషి శక్తిపరుడు, యుక్తిపరుడు. మంచిగా లోకకల్యాణం గురించి ఆలోచించగలిగితే మనిషి ఆలోచనలకు అడ్డులేదు. అలా ఆలోచన చేయగలిగిన వాడు దైవ సమానుడు. దివి నుండి భువికి గంగను దించిన భగీరథుడు, చిరకాలం తారగా వెలసిన ధృవుడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరబ్రహ్మ విశ్వామిత్రుడు- ఇలా ఎంతమందో అందరూ మానవులే. ఉపగ్రహాలు, గ్రహాలు, తారలు ఆ తరువాత వేరే పాల పుంతలకు ప్రాణంతో వెళ్లి రాగలిగే మనిషి ఇంత శక్తివంతుడే. ఇంద్రలోకం, చంద్రలోకం వెళ్లి రాగలిగే నరుడు నారాయణుడే. ఇలా ఉంటుంది ఆ పాట సారాంశం. నీరుత్సాహంతో, ఏవో బాధలతో, ఆవేదనతో జీవితం మీద విరక్తి కలిగి పాల్పడే యువతకి ఈ పాట కనువిప్పు కాగలదు. తలుచుకుంటే ఏ పనినైనా చేయగలిగే శక్తి ఉన్న మానవుడే నిజమైన మానవుడు.

-బి.వి.కోటేశ్వరరావు, హైదరాబాద్