Others

గోపీచంద్ సరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మెహరీన్ హవా నడుస్తోంది. కృష్ణగాడి వీరప్రేమగాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ ఇలా ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధిస్తుండడంతో మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మెహరీన్ నటించిన ‘జవాన్’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు మరొక మాస్ హీరో సినిమాలో కూడా ఆమె అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ తాజాగా రూపొందిస్తున్న ఈ సినిమాకు చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సరసన పలువురిని పరిశీలించిన దర్శక నిర్మాతలు వరుస విజయాలతో దూసుకుపోతున్న మెహరీన్ అయితే బాగుంటుందని, సినిమాకు కూడా కలిసి వస్తుందని ఆమెను ఎంపిక చేశారని, ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి మరెన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.