Others

నడిపించేది నానే్న..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటుపోట్లతో అనుక్షణం కదలాడే సముద్రం కూడా నాన్న ముందు దిగదుడుపే, అందుకేనేమో జన్మనిచ్చిందిమొదలు జన్మంతా కంటికి రెప్పలా కాపుకాచే ‘నాన్న’ కన్నబిడ్డలకు కరకుగానే అగుపిస్తాడు. ఆ కరకుదనం వెనుకున్న అమృత హృదయాన్ని చూసేవాళ్లెంతమంది? నాన్నను నాన్నలా గుర్తించేవారెందరు..?

బిడ్డల పెంపకంలో, పెళ్లి విషయంలో తండ్రి తీసుకునే బాధ్యత, తండ్రి చేసే పనులు, ఆయన పడే తపన చాలావరకు లోకానికి అగుపడదు. బిడ్డ పుట్టినప్పటినుండి ఆ బిడ్డ జీవితంలో స్థిరపడే వరకు జరిగే ప్రతి చర్య, నడిచే ప్రతి అడుగు అన్నింట్లో అగుపించీ అగుపించకుండా ఉండే అదృశ్య హస్తం నాన్న. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల తండ్రి బంధానికి, బాధ్యతకు మధ్య నలిగిపోతూ ఉంటాడని చెప్పవచ్చు. అయినా కూడా అదేంటోగాని మన కంటికి (కొడుకు /కూతురు) నాన్న ‘కరకు మనిషి’గానే కనిపిస్తాడు.
తుళ్ళిపడే చిట్టి అడుగుల చిన్నారి పాపయినా, ఎగిసిపడే నవ యవ్వన యువతైనా, తండ్రికి బుడి బుడి నడకల బంగారు తల్లిలాగే అగుపిస్తుందేమో. అందుకే ఆ అడుగులు బడివైపు వేసినా, కాలేజీ వైపు వేసినా, ఉద్యోగం వైపు వేసినా పెండ్లి మండపం వైపు నడిచినా, ఆ అడుగులు ఎక్కడ తుళ్లిపడతాయేమోనని అనుక్షణం కాపలా ఉంటాడు నాన్న. బుడిబుడి అడుగుల పసిపాపకు వడివడిగా నడవచ్చనే ధైర్యం నాన్న. పడిపోతానన్న భయమే లేని పసిపాపల మనోబలం నాన్న.
కూతురును బాగా చదివించాలనే తపన ఉన్నా చుట్టూ వున్న సమాజ ఒత్తిడి, కూతురుకు గొప్ప చదువు చెప్పిస్తే అంతకన్నా గొప్ప అల్లున్ని తేవాలి అనే భయం, కూతురు వెళ్ళిపోయేది, ఏనాటికైనా కొడుకే దిక్కని తరతరాలుగా మన నరనరాన జీర్ణించుకుపోయిన ఛాందసభావం, కూతురు చదువుకోసం, కట్నం కోసం రెండు విధాల ఖర్చు చేస్తే కొడుక్కేమివ్వలేనేమో అనే భయం- అన్నీ కలిసి నాన్న మస్తిష్కంలో కథాకళి ఆడుతుంటే విప్లవాత్మక నిర్ణయాలు నాటితరం నాన్న తీసుకోలేకపోయినా నేటి తరం నాన్న కొంతమేర ధైర్యంగానే బిడ్డలకు అండగా నిలుస్తున్నాడు. అత్తారింటికి వెళ్ళే పిల్ల అంటూ ఆడపిల్ల పుట్టినప్పటినుండే వస్తువులు, నగలు చేయించే అమ్మ వెనుకున్న మనోబలం ‘నాన్న’. కర్ణవేదన, ముక్కుపుడక, చీర కట్టించడం అంటూ సాగిపోయే వేడుకల్లో ముందుండి నిలిచేది అమ్మే అయినా వెనుకనుండి నడిపేది నాన్న కదా, పెండ్లీడుకొచ్చిన బిడ్డలకు వరుడ్ని వెతకడం పేద, మధ్యతరగతి తండ్రులకు కత్తిమీద సాములాంటిదే.
కన్నబిడ్డకు సంబంధం నచ్చింది. బిడ్డ చివరి కోరిక (ఎంతయినా పెండ్లి అయినంక ఆడపిల్లే కదా) తీర్చాలనే తపనతో ఆ తండ్రి ఎన్నో విషయాల్లో రాజీ అవుతాడు. తాను మోయలేని భారం అని తెలిసినా తల వంచుతాడు. పది రూపాయల పెన్నుకు కూడా బిల్లు తీసుకునే ఈ కాలంలో లక్షలు, కోట్లలో చెల్లించినా సరే కట్నానికి లెక్కా పత్రాలుండవు. బతుకంతా కష్టపడి కోరికలను చంపుకుని సంపాదించిన సొమ్మును బిడ్డమీద మమకారంతో కట్నంగా ఇచ్చే కన్నతండ్రికి రశీదు కాదు కదా కనీసం గర్వంగా ఫోటో దిగే భాగ్యం కూడా ఉండదు. వకీలైనా, పోలీసైనా, పొలిటీషన్ అయినా అక్కడ అందరిదీ ఒక్కటే హోదా- ఆడపిల్ల తండ్రి. పిల్లికి చెలాగటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు పెండ్లికొడుక్కి ఇచ్చే కట్న కానుకలు ఒక ఎతె్తైతే పెండ్లి చేయడం మరో ఎత్తు. ఇంతకుపూర్వం ఆడపిల్ల తండ్రికి పెళ్లి తన ఇంట్లో తనకు నచ్చిన విధంగా చేసే స్వేచ్ఛైనా ఉండేది, ఆధునికులం అయ్యాం కదా, ఆ స్వేచ్ఛ కూడా లేకుండాపోయింది. కన్నబిడ్డ అత్తారింటికి వెళ్లి ‘ఆడపిల్ల’గా మారినా తండ్రి భుజంమీది బాధ్యతల బరువు వేలాడుతూనే వుంటుంది. మొదటి పండుగ, మొదటి కాన్పు, బారల (నామకరణం), సారె పెట్టుపోతలు అంటూ బాధ్యతల సమాహారంగా సాగుతూనే వుంటుంది. మెట్టినింట్లో అరిగిన ‘మట్టె’లకు కూడా ఆడపిల్ల పుట్టినింటివైపే చూస్తుంది. బంధాలను తెంచుకోవద్దని, కలిపి ఉంచాలనే గొప్ప ఆలోచనతోనే పెట్టి ఉంటారు మన పూర్వీకులు, అయితేనేం ప్రేమతో కూడిన ఆ బరువును మోసేది ‘నానే్న’కదా. తాళిబొట్టు తెచ్చి, కాలికి మెట్టెలు చేయించి, పూలు సారెలతో ఘనంగా అత్తారింటికి పంపిన కన్నతండ్రే జరగరానిది జరిగితే గుండె రాయిని చేసుకొని వాటిని చెరిపేయాల్సి రావడం హృదయవిదారకం, ఆటుపోట్లతో అనుక్షణం కదలాడే సముద్రం కూడా నాన్న ముందు దిగదుడుపే, అందుకేనేమో జన్మనిచ్చిందిమొదలు జన్మంతా కంటికి రెప్పలా కాపుకాచే ‘నాన్న’ కన్నబిడ్డలకు కరకుగానే అగుపిస్తాడు. ఆ కరకుదనం వెనుకున్న అమృత హృదయాన్ని చూసేవాళ్లెంతమంది? నాన్నను నాన్నలా గుర్తించేవారెందరు..?

పెళ్లికూతురు మెడలో వేసుకునే బంగారు నగలు, పెండ్లిలో కట్టుకునే బట్టలు మొదలు అత్తింటికి తనతో తెచ్చుకునే ప్రతి వస్తువుమీదా పెత్తనాన్ని చూపే అత్తలు, ఆడబిడ్డలు లేదా మరొకరు అడుగడుగునా గండాలు / సుడిగుండాలు సృష్టిస్తుంటే పెండ్లిచూపులు మొదలు ఆడపిల్ల పెండ్లయి అత్తవారింటికి వెళ్ళేవరకు ఆ తండ్రికి కంటిమీద కునుకు ఎడారిలో ఒయాసిస్సే అవుతుంది. ఒకవైపు ముద్దుల తల్లి పెండ్లవుతుందనే సంతోషం, మరోవైపు తలకు మించిన భారం, ఎటుపోయి ఎటు వెళ్తుందో అనే భయం ఆ తండ్రి కళ్లలో నిద్రను దోచేస్తుంది. తన బాధను భయాన్ని ఎవరితోనూ చివరికి భార్యతో కూడా పంచుకోలేని నిస్సహాయ స్థితి, అనవసరంగా వారి సంతోషాలనెందుకు దూరం చేయాలనే ఆలోచన అంతా కలిసి ఆ తండ్రి మనసు మొద్దుబారిపోతుంది.

-చందుపట్ల రమణకుమార్‌రెడ్డి