Others

ఢిల్లీ నుంచి రాయబారి ‘పలాయనం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని పొగమంచు ‘విష కాలుష్యం’ దెబ్బకి తాను తట్టుకోలేకపోతున్నానంటూ థాయిలాండ్ రాయబారి- శ్రీ చుటిమ్తార్ గోపసాగ్డీ పత్రికలవారి ముందు వాపోతూ ఉండగానే - ఆసియన్ దేశాల దౌత్య ప్రతినిధులు ఏవేవో సాకుల కోసం ఎదురుచూస్తున్నారంటూ ఆయన వెల్లడి చేస్తూ వుండంగానే- కోస్టారికా రాయబారిణి శ్రీమతి మారీలక్రుజాల్వారేజ్ ఢిల్లీ కార్యాలయం నుంచి మకాం దక్షిణాది బంగళూరుకు మార్చేసింది. ‘‘నేను ఇంకా ఢిల్లీలోనే వుంటే ఈ కాలుష్యం విషవాయుభరిత మంచుపొగ నా ఊపిరితిత్తులను కబళించడం ఖాయం- పైసలొస్తున్నాయి కదాని పొగ గొట్టాలని పెంచుకుంటూ పోతే త్వరలోనే ఈ భూమండలమే ఊపిరాడక చస్తుంది అన్నది ఆమె. నేను యోగ చేస్తాను, ప్రక్కవాడి సిగరెట్టు పొగ కూడా పీల్చను- కాని, ఇప్పుడు ఇక్కడ విస్తరిస్తున్న స్మాగ్‌వల్ల నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నా ముక్కుల్లోంచి నల్లని మసి రంగు ద్రవం మాత్రమే వెలువడుతోంది. ఉండలేను బాబోయ్’’ అంటూ ఆమె బంగలూరుకి బస మార్చుకున్నది. ఆమె బస మారగలదు కాని స్థానికులు ఎక్కెడికి పోతారు? పొగ త్రాగరు కాని ఊపిరి పీల్చకుండా ఎలా వుంటారు? పైగా ఇండస్ట్రియల్ పొగ కాదు ఇపుడు పంజాబ్, హరియానా, రాజస్థాన్‌లనుంచి ‘అగ్రికల్చరల్’ పొగ రాజధానిమీద కసి తీర్చుకుంటున్నట్లున్నది.. అయ్యో!

-వీరాజీ