Others

ఫోన్ వచ్చిందా? చెట్టెక్కు భారుూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వాళ్లే.. మొబైల్ మ్రోగింది అంటే అదట్టుకుని బయటకు పరుగులు తీస్తు వుంటారు... ‘సిగ్నల్స్ బాబూ సిగ్నల్స్’ అంటారు! అలాగా, బీహార్‌లో పాట్నా నగరానికి నైరుతిగా ఖైమూర్ కొండలమీద వున్నా అధౌరా మండలంలో ఒక నూట ఎనిమిది గ్రామాలున్నాయి. నలభై ఎనిమిదివేల మంది గాలీ వెల్తురూ ‘హ్యాపీ’గా మేస్తూ వున్నారు. కాని ఆ గ్రామాల్లోకి కొండెక్కి రోడ్లమీదకి మోటార్ శకటాలు వెళ్ళలేవు- పోతే పోనీ, మోబైల్స్ వున్నైగా- మోడీగారి కడుపుచల్లగా అనుకున్నారు కానీ ఎవరికైనా ఫోను వచ్చిందో- వాళ్ళు పరుగు పరుగున పోయి బయట వున్న చెట్టు ఏదో ఒకటి- హడావుడిగా హలో హలో అంటూ ఎక్కేస్తారు- సిగ్నల్స్ రావు. ఉన్నది ఒక్కటే సెల్ టవర్ అదీ బిఎస్‌ఎన్‌ఎల్‌ది.
రాంపుర, చయనుపురా, చందుపురాలనే చక్కని పేరులన్న గ్రామాలున్నాయి గాని ‘నాం బడా దర్శన్ తోడా’ అనగా ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లు ఆధునిక యుగంలో నాలుగో అవసరం అనిపించుకున్న సెల్‌ఫోన్ వుండీ లేనట్లే అయ్యింది. ఎలెక్ట్రిక్ స్తంభాలు వేయనివ్వరు అక్కడి ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌వారు- ఎందుకంటే, ఆ దారి అంతా ఖైమూర్ వన్య మృగ సంరక్షణాలయం భూమీ గుండా పోతోంది. స్తంభాలు పాతితే జంతువులూ- వాటికే వీపు (దురదకి) రద్దుకుంటూ వుండిపోవూ? ఓసారి మంత్రిగారొచ్చారు. సెల్ రాదా? ఇలా ఇవ్వండి ఆ మొబైల్, నేను ఆ స్ట్ఫా బాస్‌ని దులిపేస్తాను అన్నాడు మంత్రిగారు- చెట్కెక్కెండి సారు.. అన్నారు. ఏంది భాయ్ తిక్కగానెక్కిందా? అన్నాడు మినిస్టర్‌జి. ఆయన టెట్టెక్కలేడు మరి! నిచ్చెన తెచ్చి వేసి ఎక్కించారు. మొబైల్ పలికింది. అవతల సిబ్బంది కష్టాలు మొర గట్టిగా ఎత్తుకున్నారు. ‘‘హోంశాఖామంత్రికి చెపుతాలెండి అన్నాడు. సారూ చెప్పడు కానీ, పోల్స్ వేయ వీల్లేదు.. సౌరశక్తితో (సోలార్) నడిచే అనగా పనిచేసే సెల్ టవర్‌లు మంజూర్ చేయించాడు ఆంతరంగిక వ్యవహారాల శాఖామాత్యుడు.. అవి కదలాలి.. ఎప్పటికి? అంటారా? సోది అడగండి?