Others

స్వేచ్ఛకు సంకెళ్లు వేయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దర్శకుడు తను చూసిన సన్నివేశాలు లేదా చరిత్ర ఆధారంగా కొన్ని సినిమాలు తీస్తారు. అందులో కొన్ని జోడించడం లేదా పాత్రలను కాస్త మార్చి చూపడం జరుగుతూ ఉంటుంది. కాని దర్శకులు చరిత్రను ఆధారంగా తీసుకుని సినిమా తీస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి లేదంటే కొన్ని వర్గాల నుండి తీవ్ర ఇబ్బందులు గురి కావల్సి వస్తుంది. అందులో భాగమే ఇటీవల పద్మావతి సినిమా. అందులో ఏమి తప్పులు ఉన్నాయో తెలియదు. కాని ఒక మహిళ అని గుర్తించకుండా సూర్పనక్కకు ముక్కు కోసినట్లు నీ ముక్కు కోస్తాం అని దీపికపదుకునేని దూషించటం సరికాదు. స్ర్తిని దేవతలా పూజించే ఈ పవిత్ర భారతదేశంలో ఇలా మహిళను అగౌర పరిచేలా మాట్లాడటం శుభ పరిణామం కాదు. దానికి ఒక మహిళ సినిమాలలో పొట్టి దుస్తులు వేసుకొని ఉండటం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. అది ఆమె పనిలో భాగమే కాని కావాలని నడి రోడ్డులో తిరగడం లేదు కదా? ఏది ఏమైనా అభ్యంతరాలు ఉండే న్యాయస్థానాలు ఆశ్రయించాలి. కాని ఇలా మహిళను తులనాడటం సరైనది కాదు.

- విజ్జు