Others

ఎటు తిప్పినా పరమార్థమదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గీతా’అను పదాన్ని తిరగద్రిప్పి చదివిన ‘తాగీ’ అవుతుంది. అంటే త్యాగివి కమ్మని గీత మానవునికి బోధిస్తోంది. శోకరాహిత్యమే గీతారహస్యం. సంజయడు ప్రచారం చేసిన గీతాగ్రంథం ‘్ధ’ కారంతో ప్రారంభమై ‘మ’కారంతో అంతమైంది. ధ- మ అను రెండక్షరముల మధ్యనే గీతాప్రకాశం ఉన్నది. మూర్త్భీవించిన ధర్మమే గీత. గీతను చెప్పినవాడు, వినిన వాడు వ్రాసిన వాడు కృష్ణుడే జీవుల గమ్యం కర్తవ్యం గీతాభ్యాసమే.మానవుల నుదుటి రాతను మార్చి జీవునకు కర్మాతీత, జన్మాతీత కైవల్యపదవిని చేకూర్చే అఖండ శక్తిగలది గీతొక్కటే.
యుద్ధము చేయనని కూలబడిన నరునికి నారాయణుడు ఉదాత్త కృత్యములకు తగిన సాత్త్వి లక్షణములనూ, క్షత్రియ ధర్మములనూ జీవున్మరణ వివరములనూ తెలిపి అర్జునుని సాత్విక వీరునిగా సంపన్నునిగా నొనర్చిన సద్గురు శ్రీకృష్ణ పరమాత్మ.
‘నహి జ్ఞాన నసదృశం - పవిత్రమిహ విద్యనే’ అంటూ జ్ఞానముతో సమమైన పవిత్రమైన వస్తువు వేరొకటి లేదు. నిష్కామ కర్మలాచరిస్తూ సమస్తకర్మలన్నీ జ్ఞానమందు పరిసమాప్తి పొందుతాయని సందేశమిస్తుంది గీత.
అర్జునునికి విశ్వరూప సందర్శనము కావిస్తూ సర్వమూ నేనే, సర్వమూ నా వలనే సృజియింపబడి పెంచబడి తుదకు నాలోనే లీనవౌతాయని అని వాక్రుచ్చాడు భగవంతుడు. ‘యోగస్థః కురు కర్మాణి’ అంటూ దైవమునందు నిలుకట కలవారై ఉంటూ కర్మలు ఆచరించమన్నారు. శ్రద్దావాన్ లభతే జ్ఞానం అని, కామక్రోథభయాదులను వర్జించి ఇంద్రియ మనో నిగ్రహాలను అభ్యాసంతో సాధించి మని ఉద్భోదించారు గీతాచార్యుడు. జ్ఞానంతో తెలుసుకోలేనివారు భక్తిమార్గంలో సులభంగా ప్రయాణించి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవచ్చు. గీతను ఆశ్రయించిన వారికి లేమి ఉండదు. సర్వసౌభాగ్యవంతులౌతారు. కృష్ణం వందే జగద్గురుం.

- పి.వి. సీతారామమూర్తి