Others

పాపపుణ్య విచారాలేవీ అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అయ్యో నేను చనిపోతే ఈ చిట్టి తండ్రిని ఎవరు చూస్తారు’’అని ఎంతో బాధపడుతూ నా చివరి శ్వాసను వదిలాను. భగవంతుడికి ఎవరి పట్లా అనురాగం కాని ద్వేషం కాని వుండవు కదా. పరమాత్మకు సర్వం సమానమే కనుక. ఎవరేది కోరుకుంటే వారికి దానే్న ఇస్తాడు కనుక నాకు మరుజన్మలో జింక శరీరాన్ని ఇచ్చాడు.
నేను జింకగా పుట్టాను. కాని ఏ పూర్వ జన్మ పుణ్యపరిపాకం వల్లనో నా పూర్వజన్మ స్మృతి పోలేదు. నేనుచేసిన వృథా కాలయాపన అంతా నాకు ఆ జింకజన్మలో గుర్తుండిపోయింది. దానివల్ల నేను ఎంతో చింతించాను. ‘‘అయ్యో రాత భూములేలానని రాసి ఉంటే బుద్ధి గడ్డితినడానికి వెళ్లిందే’’అని ఎంతోవిచారించాను. కాని ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాని నేను జింకగా వున్నప్పటికీ కూడా ఎప్పుడూ దేనిపైనా వ్యామోహం చెందలేదు. ఎప్పుడెప్పుడూ ఈ జింక శరీరాన్ని వదిలివేస్తానా అని చూశాను. కాస్త ప్రాయం వచ్చిందాకా నా ఆ జన్మలోని తల్లి జింక దగ్గరే ఉండిపోయాను. మెల్లగా నడక నేర్చుకొంటూ పూర్వజన్మలో నేను కాలం గడిపిన పులస్త్య పులహాశ్రమానికి వెళ్లాను. అక్కడ ఉన్న నదీమ తల్లి దగ్గరే కాలం గడిపేవాణ్ణి. అక్కడ తపస్సు చేసుకొనే మహర్షుల ఆశ్రమాలకు వెళ్లి దూరంగా నుంచే వారిని చూస్తుండేవాణ్ణి. ఒంటరిగా అక్కడ ఇక్కడ తిరుగుతూ శరీరం ఉన్నంత వరకూ జీవన వ్యాపారం నడవాలి కనుక పచ్చికను తింటూ కాల యాపన చేశాను. కాని నా మనసును మాత్రం ఆ శ్రీహరి పైనే నిలిపాను.
అలా ఆ జింక జీవితాన్ని గడిపి ఒకరోజు పుణ్యనది అయిన గండకీ నదిలోనే నా జింక శరీరాన్ని వదిలేశాను.
తిరిగి ఈ జన్మలో నేను అంగీరసుడను బ్రాహ్మణునికి పుట్టాను. కాని ఈ జన్మలోను నేను నా పూర్వజన్మ స్మృతిని మరిచిపోలేదు. నా పినతల్లికి నేను అంటే అంత ఇష్టం లేదు. నా తమ్ముళ్లు కూడా నేను అంటే అంత ఇష్టపడేవాళ్లు కాదు. అందుకే వారు నాకు ఎన్నో పనులు చెప్పేవారు. కాని నేను ఈ శరీరాన్ని విడిచి శ్రీహరి పాదపద్మాలను చేరాలన్న కోరిక తో ఉన్నవాణ్ణి. నాకు శ్రీహరి పై ధ్యాస తప్ప ఇతరాలపై మనసు లేనివాణ్ణి , నాకు ఎవరిపైనా వైర భావం కాని ప్రేమ భావం కాని లేదు. అందువల్లే వీరు చెప్పిన పని నంతా చేసేవాణ్ణి , వీరికి బదులుచెప్పేవాణ్ణి కాదు. వీరు నన్ను ఆ భిల్లుల మహారాజు కోసం బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్లారు. ఆ బలిపైన కూడా నాకు ఏ భావన లేదు. కనుక నేను నిమిత్తమాత్రుడిగా ఉంటూ వీరు చెప్పిన పని నంతా చేశాను. వీరు నన్ను బలిపీఠం పై వంగి నిల్చోమన్నారు. నేను అలాగే చేశాను. కాని కాళికాదేవికి ఇష్టం లేదేమో పనికట్టుకుని హింసించడం కూడా మంచి పని కాదు కనుక సజ్జనులను కాపాడడం ఆ భగవంతుని కర్తవ్యం కనుక ఆ కాళికాదేవి పూనకం పూనినట్లు వీరిపై దుమికింది. వీరు పారిపోయారు.
నేను కూడా అక్కడి నుంచి వచ్చేసి అలా తిరుగుతూ తిరుగుతూ నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇదిగో ఇపుడే వీరు నన్నుబోయిగా ఉండమని పిలిచారు. దానివల్ల నేను మీకు బోయినయ్యాను . అని తన వృత్తాంతమంతా భరతుడు రహూగణునికి చెప్పాడు. రహూగణుడు ఆశ్చర్యానందాలకు లోనై నోట మాట రాక క్షణమాత్రం భరతుణ్ణే చూస్తూ కూర్చున్నాడు. కనుల నిండా నీరు నింపుకుని తననే చూస్తున్న రహూగణుని వైపు భరతుడు కూడా ఏ వికారం లేకుండా చూశాడు.

- డాక్టర్. రాయసం లక్ష్మి