Others

పరమాత్మ కోసం చతుర్ముఖుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మలోకం
చతుర్ముఖ బ్రహ్మ ఆనందంగా శారద వీణారవాన్ని వింటున్నాడు. శారదాదేవి తన్మయత్వంతో వీణ వాయిస్తోంది. అక్కడున్న సరోవరంలో హంసలు ఆనందంతో వాయిద్వ ధ్వనికి అనుగుణంగా నడుస్తున్నాయి. నెమళ్లు ఆనందంతో క్రేంకారాలను కూడా శారదావీణాధ్వనికి అనుగుణం చేస్తున్నాయి.
‘‘నమో నారాయణాయ’’అంటూ నారదుడువచ్చాడు. వీణావాదనతో పులకిస్తున్న బ్రహ్మలోకం తటాలున నారాయణాయ అని ఉచ్చరించింది. శారదా వీణ అనుకోకుండానే నారాయణ శబ్దాన్ని రవళింప చేసింది. చతుర్ముఖ బ్రహ్మ నారదుని చిరునవ్వుతో ఆహ్వానించి ఆసనం స్వీకరించమని చెప్పారు. బహుకాల దర్శనం ... భూలోక వాసుల విశేషాలేమిటో వివరించమని సరస్వతీదేవి అడిగింది. ‘‘నేను ఈ మహితిని వాయిస్తూ నారాయణ మంత్రాన్ని అనుక్షణమూ వల్లెవేస్తున్నా కూడా భూలోక వాసుల ఆనందాన్ని వర్ణించలేకపోతున్నాను. వారు చేసుకొంటున్న పుణ్యాన్ని ఇంత అని చెప్పలేకపోతున్నాను ఇది ముమ్మాటికి నిజం.’’ ‘‘ నా నోరు చాలదు. అసలు నా నోరు కాదు ఆ సహస్రాక్షుడికే ఆ పరమాత్మ చేసే చేష్టలు చూడడానికి కన్నులు సరిపోవడం లేదని అంటున్నాడు’’అని నారదుడు అన్నాడు. ‘‘ఇదేమి చిత్రం. సాధారణమే కదా భూలోకంలో అధర్మం పెచ్చుపెరిగినపుడు మహావిష్ణువు తన్ను తాను సృజియించుకోవడం.. తాను తలచిన కార్యాన్ని పూర్తి చేయడం... ఇందులో విశేషమేమున్నది’’అన్నాడు నలువ.
‘‘ఇంతకుముందు వచ్చిన అవతారాలన్నీ ఒక ఎత్తు. ఇక మీద రాబోయే కాలంలో వచ్చే అవతారాలు మరొక ఎత్తు కాని ఈ కృష్ణావతారం అన్నింటి కన్నా మేలైనది. కేవలం మేలు ఉత్తమము అని చెబితే మాటలు చాలడం లేదు. రాబోయే రోజుల్లో శుకబ్రహ్మ భాగవత సుధ మిషతో ఈ శ్రీకృష్ణుని రమ్యమైన కథలను ప్రచారం చేస్తాడు. రాబోయే రోజులన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి కలికాలంలో స్మరిస్తూనే ఉంటారు. కాని ఇపుడు ఆ బృందావనంలో ఆ గోపకులు అనుభవిస్తున్న ఆనందం వారు మూట కట్టుకుంటున్న పుణ్యరాశులు ఇంత , ఇన్ని అని లెక్కకట్టగలేనన్ని ఉన్నాయి’’అన్నాడు నారదుడు.
‘‘అయితే ఆ పరమాత్మ అసలే లీలామానుషవేషధారి అయ్యాడుకదా. ఆయన చేసేవన్నీ లీలావినోదాలే అయ్యి ఉంటాయి. వాటిని ఎలాగైనా చూసి తీరవలసిందే ’’అంది సరస్వతి .
‘ఇక ఆలస్యం మెందులకు పదండి బృందావనానికి ’అన్నాడు నారదుడు. నారదుని కలసి సరస్వతీ బ్రహ్మ దంపతులు బృందావనానికి విచ్చేసారు. వారు ముందుగానే కృష్ణునికి తెలియకుండా మనం ఆయన చేసే వినోదాల్ని తిలకించాలనుకొన్నారు. కనుక వీరి రాక ఆ బృందావన వాసులకు తెలీదు. వారు ఎప్పటి లాగే ఉన్నారు.పశువులను మేపుకుంటూ ఉన్న గోపబాలురంతా ఒక్కసారిగా శ్రీకృష్ణుని చుట్టు ముట్టారు. ‘‘కృష్ణా.. కృష్ణా ఇక్కడ చూశావా ఈ పచ్చని గడ్డి.. ఈ చల్లని ఉదకాలు... ఈ చెట్లు ఇచ్చే పండ్లు ఎంత బాగున్నాయో కదా. మనం రేపు పొద్దునే్న వచ్చి అందరం కలసి ఇక్కడే సరదాగా ఆడుకుంటూ చల్ది తిందామా’’అని అడిగారు. ‘దానిదేమి భాగ్యం. రోజు కూడా చల్ది తింటునే ఉన్నాము కదా. మరి రేపటి విశేషమేమిటో..’ అని అన్నీ తెలిసినా తెలియని వానివలె అడిగాడు కృష్ణయ్య..
***

- చరణ శ్రీ