Others

మొదటి జీతం అందుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగంలో చేరిన తరువాత మొదటి జీతం అందుకున్నవారిలో మీరు ఒకరైతే అభినందనలు. మొట్టమొదటి జీతం అందుకోవటం అంటే కుటుంబ సభ్యుల్లోనే కాదు మీకు కూడా గొప్ప అనుభూతే. మీ ఫోన్‌లో జీతం క్రెడిట్ అయినట్లు వచ్చిన మెస్సేజ్‌ను ఎంతో ఉత్కంఠంగా చూస్తాం. తీవ్ర భావోద్వేగానికి గురవుతాం. ఈ జీతంతో ఏమేమి చేయాలి అని భవిష్యత్ ప్రణాళికలు వేసేస్తాం. కాని మీరు మొట్టమొదట చేయాల్సిన పని ఖర్చుపై నిషేధం విధించుకోండి. ఇది భవిష్యత్తులో ఆర్థిక క్రమశిక్షణకు తోడ్పడుతోంది. ఎంతోకొంత సేవ్ చేసుకునే ఆలోచన వచ్చి ఆనందంగా ఉంటారు. ఖర్చు, ఆదా, పెట్టుబడులు గురించి మొదటి జీతం తీసుకున్నపుడే ఆలోచించండి. అపుడే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అలవడుతోంది. మీ భవిష్యత్తు కోసం 25 ఏళ్లకు చెల్లించే పొదుపు పథకాల్లో చేరండి. లేదా పెట్టుబడులు పెట్టండి. దీనివల్ల పదవీ విరమణ తరువాత మంచి ఆదాయాన్ని పొందుతారు. జీతం వస్తుంది కదా అని అధిక ఆర్థిక బరువు బాధ్యతలను తలకెత్తుకోవద్దు. స్నేహితులు, బంధువులు వద్ద ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకోవద్దు.