Others

ఆత్మఘోష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ ఏమీ లేదు! రాకండి
చుక్కల రాత్రులు చందమామలు లేవండి
ఎంచక్కా జీవించి సుఖపడండి
ముంచుకు వచ్చే క్రోధావేశాలను అరికట్టండి

ఉరిత్రాడుకు వేలాడితే ఏముంది సౌఖ్యం
గుప్పెడు బూడిదవ్వడంకాదు ముఖ్యం
ఇవ్వండి చదువుల తల్లికి ప్రాముఖ్యం
మృత్యుదేవతతో చేయకండి సఖ్యం

ఒకసారి తప్పితే చదివి గెలవవచ్చు
ఒకసారి దారి తప్పితే తెలుసుకోవచ్చు
ఒకతూరి రాకపోతే మరల చదువవచ్చు
ఒక పరి ఓడితే మరలా విజయం రావచ్చు.

ఎన్నో దారులు మూసుకుపోతూనే వుంటాయి
మరెన్నో దారులు తెరుచుకుంటూనే రమ్మంటాయి
చచ్చి సాధించానని మీరనుకుంటున్నారు
చచ్చినట్లు బ్రతికితేనే ఎంత బాగుణ్ణని నేనేడుస్తున్నా

ఓర్చుకోండి ఎంత కష్టాన్నైనా
తీర్చుకోండి అద్భుత జీవితాన్ని
అవకాశం వస్తే బ్రతికి సాధిస్తా
చచ్చేవారిని చావవద్దని నినదిస్తా

అర్థం చేసుకోండి ఈ ఆత్మఘోష
వ్యర్థం చేసుకోకండి జీవన పీయూష
బ్రతకడంలోనే ఉండాలి యువత ధ్యాస
నిండు జీవితం గడపాలి అదే మన ఆస

-బి.హెచ్.వి.రమాదేవి