Others

‘సిగలోకి విరులిచ్చి చెలినొసట...’(. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1965లో విడుదలైన సుమంగళి చిత్రంలోని ‘సిగలోకి విరులిచ్చి చెలినొసట తిలకమిడి సిగ పూలు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా’ పాట దివికేగిన ఐదుగురు దిగ్గజాల అద్భుత రస సమ్మేళనం. అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ, ఘంటసాల, మహాదేవన్‌ల కలయికలో వచ్చిన ఈ పాట ఏ కోణంలో చూసినా అద్భుతమే. సందర్భమే విచిత్రంగా వుంటుంది. పెళ్ళైన రోజే ఓ ప్రమాదం జరిగి సంసారానికి పనికిరాని నాయకుడు, తన భార్య జీవితం మోడుకాకూడదని తపిస్తూ పాడే పాట, ఆత్రేయ పదాలు అతి సామాన్య జనాలకు కూడా రసగుళికలయ్యాయి. తియ్యనైన జీవితాన చేదు విషం తాగేవా అంటాడు నాయకుడు. ఆ భార్య త్యాగాన్ని చేదు విషంతో సరిపోల్చడం ఆత్రేయకే చెల్లింది. ‘మనసు మూసి, మమతలు రోసి మనుగడ మసి చేస్తావా’ అన్న పదాలలో మనసు మూసెయ్యడం అన్నది కొత్త ప్రయోగం. మనసు కవి పేరు సార్థకం అయింది. కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం, కోరినది చేతికిరాక ఆరకున్నది ఒక తాపంలో అంత్యప్రాసలే అద్భుతం. ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా, వయసులో వున్న భార్య జీవితం మోడైపోతుందన్న బాధ, తనవల్ల ఆమె బతుకు బుగ్గిపాలౌతుందన్న వ్యధ ఈ పాటలో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. తోడూ నీడగా ఒకరుండి ఏకాకిగా బతుకుతున్న ఆమెకు మరో బతుకు ఇవ్వాలన్న ఆర్తితో, ఆవేదనతో హీరో చేసిన ప్రయత్నం సందర్భంగా వచ్చిన ఈ గీతంలో ఆత్రేయ కలం, ఘంటసాల గళం, మహదేవన్ స్వరం కలిసి ఆ విష్కరించిన అనుభూతికి అక్కినేని నటన వనె్నచేకూర్చింది.
-తాడి అప్పలస్వామి, పార్వతీపురం