Others

బిజినెస్‌లోకి సన్నీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగార తార సన్నీలియోన్ స్పీడు చూస్తుంటే ఒక లెవల్లో ఉందిప్పుడు. ఓ వైపు సినిమాలు, మరో వైపు వ్యాపారాలు సన్నీకి నాలుగు చేతులా ఆదాయమే. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమెలానో ఈ హాట్ భామకు తెలిసినంతగా మరొకరికి తెలీదేమో! భర్త డేనియల్ వెబర్‌తో కలిసి టాప్ క్లాస్ బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతోంది. భర్త అంతే చక్కటి సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే సన్నీ పలు వ్యాపారాలపై కనే్నసింది. సన్నీలియోన్ పేరునే బ్రాండ్‌గా మార్చుకుంటూ కాస్మోటిక్స్‌లో, దుస్తుల్లో దూసుకెళుతోంది. ఇక తొందర్లోనే మొబైల్ బ్రాండ్‌ని ప్రారంభించబోతోంది. సన్నీలియోన్ పేరుతో ఈ బ్రాండ్ మార్కెట్లోకి వస్తుందిట. తన కంపెనీతో టై-అప్ పెట్టుకుని సన్నీలియోన్ ఇండియాలో సొంత బ్రాండ్‌ని విస్తరిస్తుందట. ప్రముఖ పోర్టల్‌తోనూ ఇప్పటికే ఆన్‌లైన్ సేల్‌కోసం ఒప్పందాలు సాగిస్తోంది. యూత్‌కి అందుబాటులో ఉండేలా సరసమైన ధరల్ని నిర్ణయించాల్సి ఉందని సన్నీ చెబుతోంది. అయితే ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ మాత్రమే సాగుతోంది. మునుముందు చాలా కసరత్తు చేశాక ప్రారంభిస్తుందట.