Others

క్యాంటీన్ల మధ్య పోరాటం షురూ!( వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు కర్ణాటక- ‘మాండ్యా’లో రమ్యా క్యాంటీన్ అని ఒకటి లేచింది- దుమ్ము లేపేస్తోంది. ‘అమ్మ’ ‘నమ్మ’ క్యాంటీన్లను మించిపోతోంది. ఒకరకంగా రేపటి ఎన్నికల్లో క్యాంటీన్ యుద్ధం తథ్యం అన్నది ఇది చూశాకా- జనవాక్యం. తార రమ్య సినిమా స్టారే కాదు కాంగ్రెస్ పార్టీ ‘స్పోక్స్‌పర్సన్’ కూడా. కాకపోతే- ఈ క్యాంటీన్ నాది కాదు మొర్రో అంటున్నదామె. ఎందుకంటే, ఇందిరా గవర్నమెంటు క్యాంటీన్లు లంచ్ 10 రూపాయలకి, టిఫిన్ 5కి కోటిమందికి పైగా సప్లై చేస్తున్నాయ్- కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యగారే రానున్న ఎన్నికలలో మోదిగారి టైపు ఛాయ్‌వాలా పోటీకి టీ దుకాణాలతో గాక కొంచెం మార్పు కోసం క్యాంటీన్‌ల పోరుకు రంగం సిద్ధం చేశాడు. ‘‘మొన్న మార్చిలోనే ‘నమ్మ’ క్యాంటీన్లు ఒకేసారి 198 బంగళూరులో మొదలుపెట్టించాడు- అచ్చం అమ్మ క్యాంటీన్ల నమూనాలో. ఈ టిఫిన్ దుకాణాల్లో లంచ్ 10 రూపాయలు, టిఫిన్లు 5 రూపాయలకి పెట్టి కాం.పా అభిమానుల్ని పోగెయ్యడం మొదలెట్టింది. ఇదేదో బాగుందే అనుకున్నారు ఇతర పొలిటికల్ పార్టీల వాళ్ళు కూడా. అయితే నమ్మ (మన) క్యాంటీన్లు అంటే జయమ్మ పేరిట వెలసిన అల్పాహార దుకాణాలు అనే భ్రమ కలుగుతుందేమోనని- ఇందిరా క్యాంటీన్‌లు అని పేరు మార్చారు- మోడీ చాయా? రాగా పాలా? అన్న ‘ఎలెక్షన్ వార్’ జ్ఞాపకం ఉందిగా. ఇపుడు కర్ణాటకలో మాండ్యాలోని రమ్య క్యాంటీన్ స్టైల్లో అప్పాజీ క్యాంటీన్లు జిల్లాకొకటి వెలుస్తున్నాయి ఐదూ - మూడూ అంటూ. అంటే, నాష్టా రూ.3, బిస్బిల్లహులి రూ.5 అని అర్థం. ఇది జనతాదళ్ సెక్యులర్ షో. అప్పాజీ అంటే దేవెగౌడా మహాశయుడు. భాజపా టీ స్టాల్స్ పెడితే లాభం లేదు. డిన్నర్ స్టాల్స్ పెట్టాలి అంటున్నారు ఔత్సాహిక కార్యకర్తలు. ఆడాళ్లకే కేటాయించాలి వాటిని అంటున్నారు ఇవాంక అభిమానులు.

గోడమీద హిందూస్తాన్ రాస్తే నేరమే!

పాకిస్తాన్ రేడియో వార్తల్లో మన ఇండియాని హిందూస్తాన్ అనే రెఫర్ చేస్తుంది కాని ఖైబర్ ఫక్తూనియాలోని హరీపూర్‌కి చెందిన నారా అమ్జాయి అనే వూళ్ళో ఓ కుర్రాడు తన ఇంటి గోడమీద హిందూస్తాన్ జిందాబాద్ అని పెద్ద అక్షరాల్లో రాసుకున్నాడు. అతను పెరిషన్ భాషలో నినాదం రాశాడు. పెరిషియా భాషలో ఒకప్పుడు మొత్తం దక్షిణ ఆసియా అంతటిని హిందూస్తాన్ అనేవాళ్లట. కాని స్వతంత్రం వచ్చాక ఇండియాని మాత్రమే అక్కడ హిందూస్తాన్ అని పిలుస్తున్నారు. కానీ స్థానికులు ఈ గోడ వీడియోలు తీసి పోలీసులకి పంపించారు. దానితో పోలీసులు ఆ కుర్రవాణ్ణి పట్టుకుపోయి మూసేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్ 500 సెక్షన్ క్రింద దేశద్రోహం కేసు పెట్టారు. ఆ యువకుని పేరు సాజ్జాద్‌ఖాన్. మన దేశాన్ని ఒక ఊపు ఊపిన ఇక్బాల్ రాసిన పాట సారే జహాసె అచ్చా హిందూస్తాన్ హామారా విన్నాడు కాబోలు. పాటని మనకి వదలి తను పాకిస్తాన్‌కి వెళ్లిపోయాడు ఇక్బాల్ మియా.. అయినా మనం ఆ పాటని మక్కువగా పాడుతాం. అది వేరే సంగతి!

కొండముచ్చులతో ముచ్చట్లు, ముద్దులు!

హుబ్లీ జిల్లాలోని అల్లాపూర్ శివారు అడవి ప్రాంతంలో ఏణ్నార్థం వయస్సున్న బాలుడు కొండముచ్చుతో నేస్తం గట్టాడు. కోతి బట్టి తెచ్చి పుట్టము గట్టి చేరి కొండ ముచ్చులేల్ల కొలిచినయట్లు- అన్నాడు వేమనగారు. కాని ఈ పసివాడు అడవి మనిషి కాదు మామ్మూలు మనిషి (మన బాలుడు). వాడి ఆరో నెల నుంచి కొండముచ్చులతో ముద్దుముచ్చట్లు - దోబూచి మొదలెట్టాడు. వాణ్ణి ప్రొద్దుటే ఓ పది నల్లమూతి కోతులు సుప్రభాతం పాడి బయటకి లాక్కుపోయి- వాడు పెట్టిన చిరుతిండి బుద్ధిగా తింటూ వాడు ముద్దెట్టినా తోకపట్టిలాగినా నోరిప్పి పళ్లు ఇకిలించి ప్రొటెస్ట్ కూడా చెయ్యవు. అస్సలు కరవవండీ అవీ వాడి ఫ్రెండ్సు.. అంటుంది వాళ్ళమ్మ. అమ్మా నాన్నలతోనే ఉంటాడు వాడు- ఫ్రెండ్సు మాత్రం మర్కట దండు- రేపు స్కూల్లో వేస్తే వీడిని- ఈ కోతి బృందం ఇస్కూలు గోడలమీదే కాపలా కాస్తాయేమో? జై హనుమాన్!

-వీరాజీ