Others

సృష్టికర్తల కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి ఉంటేనే దేశంలో ఆహారం ప్రాధాన్యత తెలుస్తుంది. ఒక ప్రసిద్ధ నవలాకారుడు ప్రేమ్‌చంద్ ‘‘వాపస్’’ అన్న నవలలో స్వర్గం నుంచి వాపస్ వస్తున్నానని రాశాడు.
‘‘స్వర్గంలో అప్సరసలున్నారు.. కామం లేదు’’
కావలసినన్ని వంటల రాసులున్నాయి. కానీ ఆకలి లేదు’’..
అట్లాంటి స్వర్గంలో ఉండేదానికన్నా ఆకలితో అలమటించే ప్రపంచంలో ఉంటేనే కదా ధాన్యపు రాసులకు విలువ దొరుకుతుంది!
అదే మాదిరిగా తరగతి గదికి ప్రాధాన్యత ఇచ్చేది ఆవిష్కరణలే. మనిషి అవసరాల్ని బట్టి 21వ శతాబ్దంలో ఎన్ని ఆవిష్కరణలు వస్తున్నాయో చూస్తున్నాం కదా! ఈ ఆవిష్కరణలు ఇంత వేగంగా రావటానికి తరగతి గదే కారణం కదా! ఈనాడు తరగతి గదిలో నేర్చుకుంటున్న పిల్లలైనా బోధించే ఉపాధ్యాయుడైనా పరీక్ష మార్కుల కోసం కాదు, పిల్లల్లో దాగి ఉన్న ఆవిష్కరణలను సమాజ అవసరాలు తీర్చటానికి తరగతి గది నిలుస్తుంది. కొత్త ఆవిష్కరణలు ప్రవాహంగా బైటకు వస్తున్నాయి. తరగతి లక్ష్యం సేవారంగంలో నిండిపోయింది. మని, అవసరాలను కేంద్రంగా చేసుకుని కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉంది. జ్ఞానం ఇప్పుడు కొత్త సృష్టి కోసమే. లెర్నింగ్ అంటే టీచింగ్ అన్నవి క్రియేట్ థింకింగ్ చుట్టూ అల్లుకుని పోతున్నాయి. ఈనాటి తరగతి గది లక్ష్యం సృష్టికర్తలను సృష్టించడం.
తరగతి గది చిరాయువు..
తరగతి గదిలో విద్యార్థి ఊహించిన కలలు నిజజీవితంలో ముప్పై ఏళ్ల తరువాత అవి యదార్థమై ఆ విద్యార్థి ప్రజలతో మన్ననలను పొందుతుంటే ఉపాధ్యాయుని కళ్ల నుంచి కారే అశ్రువులనే ఆనందభాష్పాలంటాం. సన్మానించబడే విద్యార్థికన్నా ఎక్కడో మూలలో కూర్చుని బిక్కుబిక్కుమనే ఉపాధ్యాయుడు ఆ వార్త విని సన్మానితునికన్నా తానే సన్మానించబడుతున్నట్లు ఆనందిస్తాడు. తరగతి గది కట్టిన భవనాలు సంవత్సరంలోనే కనుమరుగవ్వచ్చు. అవి కేవలం విద్యార్థికి పాస్, ఫెయిల్‌లాంటివి. ఉపాధ్యాయునికది తన చదువుపై సమాజం ముద్ర పడిందనుకుంటాడు. కానీ ముప్పై సంవత్సరాల తరుత అదే విద్యార్థి ఆ పాఠం వాస్తవ రూపాన్ని చూపిస్తాడు. దాని ఫలితాలు సామాన్యునికి కనపడితే ప్రజలు ప్రభుత్వాలను అభినందిస్తారు. కానీ విద్యార్థి ఉపాధ్యాయుడు మాత్రం తరగతి గదిని అభినందిస్తూ ఉంటారు. తరగతి గది ఫలితం ఐదు పది సంవత్సరాలకే కనపడదు. కొన్నిసార్లు అందుకు ముప్పై నలబయి సంవత్సరాల గడువు కూడా పడుతుంది. విద్యార్థిని అందరూ అభినందిస్తూంటే అతని మనసులో మాత్రం గురువును తలచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూంటాడు. అందుకే తరగతి గదిని ఎవరూ మరచిపోలేరు. అది చిరాయువు. అందువల్లే కొఠారి అంటాడు... ‘‘జాతి రూపురేఖలు, భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది.’’

-డా.చుక్కా రామయ్య