Others

సరళ సుబోధకం శ్రీచక్రము-మానవశరీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: డా.గుడిపాడి వి.ఆర్,ఆర్.ప్రసాద్
వెల: రూ.280/- లు.
ప్రతులు దొరుకుచోటు
డా.గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
7-8-51, ఫ్లాట్ నెం.18 నాగార్జున సాగర్ రోడ్,
హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాదు - 500 079
ఫోన్.నెం.9490947590, 9849560014
*
స ర్వం శక్తిమయం. శక్తిలేనది ఏదీలేదు. ఆ శక్తినే అమ్మగా సంభావిస్తాం. సృష్టిస్థితిలయాదులకు కారణం అమ్మనే. మానవజీవితం క్షణభంగురం. కాని శరీరంతోనే ఎన్నో పుణ్యకార్యాలను సాధించవచ్చు. శరీరంతోనే ఎంతోజ్ఞానార్జన చేయవచ్చు. ఈ చర్మచక్షువులతోనే అఖిలాండేశ్వరినీ దర్శించవచ్చు. భావనామయంగా ఉన్న అమ్మను స్వస్వరూపంగా మనం చూడవచ్చు. అమ్మను ఆరాధించినవారికి సర్వమూ సాధ్యమే.
మానవశరీరం స్థూల,సూక్ష్మ, కారణశరీరాలుగా ఉంటుంది. సామాన్యులకు స్థూలశరీరమే ముఖ్యం. మహానుభావులకు సూక్ష్మశరీరమే ముఖ్యం. కాని ఈశరీరంతోనే అమ్మను దర్శించాలనుకొనేవారికి ఈ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలతో అలరారే ఆనందమయకోశాలున్న శరీరం అత్యవసరం. ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి శరీరంపై ఆపేక్ష అక్కర్లేదు కాని శరీరం ఆరోగ్యవంతంగా ఉండితీరాలి. కనుక ఈ ఆరోగ్యాన్నిచ్చేది అమ్మనే. ఆ అమ్మను నవావరణాలతో శ్రీచక్రస్వరూపిణియై సర్వజీవులల్లో చైతన్యరూపిణియై విలసిల్లుతుంటుంది అమ్మ. ఆ అమ్మ దర్శనం దుర్లభమైనా, మనస్సును అదుపుచేసి,గుణాలను అమ్మపరం చేసి ఏకాగ్రచిత్తంతో బిందుస్థానానికి చేరగానే అద్వితీయమైన సచ్చిదానంరూపమైన స్వస్వరూపానుభవం కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. ఈ దర్శనం చేసుకోగానే ‘‘మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం’’అన్నట్లు ఆ పరాశక్తి అనుగ్రహవీక్షణాలు లభ్యమైతే మూగవాడు వాచాలుడు అయినట్లు గానే మూఢుడు కూడా సర్వశాస్త్ర పండితుడు అవుతాడు. రోగాలపుట్ట అయినా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందుతాడు. అని నిశ్చయచింతనతో చెప్పిన డా.గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ తాను అమ్మ దర్శనం పొంది, అమ్మ అనుగ్రహాన్ని పొంది దానికి లౌకికార్థంలో కూడా క్యాన్సర్ అనే మహామ్మారిని అమ్మ అనుగ్రహం చేత దూరం చేసుకొని అమ్మ అపారప్రేమను పొందిన తన్మయత్వంతో ఆ తన్మయత్వాన్ని, ఆ అనుగ్రహాన్ని సర్వ జీవులు పొందాలని, వారంతా అమ్మదయకు ప్రాతులు కావాలన్న ఇచ్ఛతో ‘‘శ్రీచక్రము- మానవ శరీరము’’ ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాన్ని వివిధ పట్టికలు, వివిధ యంత్రాలు, వివిధ రకాల బొమ్మలతో సహా అమ్మ విభవాన్ని వివరిస్తూ సుమారుగా 400 పుటలను రచించారు. ఇంత రచించి ఇది అంతా అమ్మ అనుగ్రహం తప్ప మరేమీకాదని అంటూ ‘నాహం పండితః’ అని వినయంగా చెప్పుకున్నారు. వీరు పొందిన అమ్మ అనుగ్రహాన్ని అందరూ పొందాలన్న వీరి ఆకాంక్షను సంపూర్ణం చేయడానికి ప్రతిఒక్కరూ ఈ పుస్తకరాజాన్ని చదివి తీరాలి. ద్రాక్షాపాకంతో చిన్నచిన్న పదాలతో ఏకబిగిన చదువాలన్న ఆకాంక్ష కలిగించే శైలితో, ఇంకా అమ్మ విభూతి ని తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగించే ఈపుస్తకం జిజ్ఞాసువులకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అమ్మ పై భక్తిని పెంచుకోవడానికి ఈ శ్రీచక్రసంచారిణి గురించి పూర్తి వైభవాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకం మార్గాన్ని చూపిస్తుంది. అమ్మ అనుగ్రహాన్నిపొందడానికి మానవశరీరంలో చైతన్యస్వరూపంగా ఉన్న అమ్మ శ్రీచక్రస్వరూపిణియై విరాజిల్లే అమ్మను దర్శించడానికి ఈ పుస్తకం ఒక ద్వారంగా కనిపిస్తుంది. ఈ ద్వారం (పుస్తకం ) తెరిస్తే చాలు అమ్మ దర్శనం అత్యంత సులభం అని ప్రతి చదువరి అభిప్రాయపడేవిధంగా ఈ రచన సాగింది.

- గాయత్రి