Others

ఇదేనా హీరోయిజం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరో అంటే ధర్మానికి, మంచితనానికి, హుందాతనానికి ప్రతినిధిగా ఉండేవారు. చెడు స్వభావానికి చిహ్నమైన విలన్‌ల ఆట కట్టించడానికి హీరోలు అనుక్షణం ధర్మయుద్ధం చేస్తూ చెడుపై మంచి జయించేలా వ్యవహరిచేవారు. నేడు అందుకు పూర్తి విరుద్ధంగా హీరో పాత్రలను మన దర్శక రచయితలు తీర్చిదిద్దుతున్నారు.
అమ్మాయిలకు రక్షణగా వుండి విలన్‌లను ఎదిరించిన హీరోలను, అమ్మాయిలను టీజిం గ్ చేస్తూ హింసిస్తూ అదే కామెడీ అని ప్రేక్షకులను భ్రమింపజేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో ఉంటూ కుటుంబ బాధ్యతలు మోసే హీరోలు ఇప్పుడు కుటుంబాన్ని గాలికొదిలేసి, తండ్రులమీద పంచ్‌లు వేయడం, దానిని తల్లి, చెల్లెలు సమర్థించడం, దానికి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వడం ఎంత దారుణం?
ఇక కాలేజీలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌లను బఫూన్‌లాగా మార్చి ఆడించడం మన హీరోలకే సాధ్యమయింది. చిన్న చిన్న పిల్లలచేత వయసుకి మించిన డైలాగులు పలికించడం కూడా మనకే సొంతం. హీరోలకు ఓ లక్ష్యమంటూ ఏదీ ఉండదు. హీరోయిన్‌ల వెంటపడి వేధించడం, తండ్రులను కామెంట్ చేయడం, గురువులపై కుళ్లు జోక్‌లు వేయడం, పనీ పాటా లేకుండా మందు త్రాగడం, లేదంటే ఐటెమ్ సాంగ్‌తో ఎంజాయ్ చేయడం ఇదేనా హీరోయిజం?
అన్ని సినిమాలను ఒకే గాటన కట్టలేము కాని కొన్ని సినిమాలలో జరుగుతున్నది ఇదే! మంచి కంటే చెడు త్వరగా వ్యాపిస్తుంది. ఇందుకు సినిమా ఏమీ మినహాయింపు కాదు. సినిమా చూసిన విద్యార్థులు తరగతి గదుల్లో టీచర్లపై పంచ్‌లేస్తూ తిట్లు తింటున్న వారెందరో వున్నారు. అన్ని తరాలవారికి నచ్చే అంశాలుంటేనే సినిమా విజయవంతమవుతుందనేది సరైనది కాదు. సందేశాత్మకతను ప్రబోధించే చిత్రాలు వందలాదిగా ఉన్నాయి. ఇపుడు అరుదుగా వస్తున్నాయి. పాత చిత్రాల్లో హీరోకు కథాపరంగా నెగెటివ్ ఛాయలుంటే, హీరోలు ద్విపాత్రాభినయం చేస్తూ మంచి చెడు పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందేవారు. ప్రస్తుతం విలనిజమే హీరోయిజంగా మారింది. అటువంటి చిత్రాలు అద్భుత రీతిలో విజయాలు పొందుతున్నాయి. ప్రేక్షకుల దృష్టి మారిందా? దర్శక నిర్మాతల ఆలోచన మారిందా అర్థం కావడంలేదు.
ఉత్తమ అభిరుచిగల సాంకేతిక నిపుణులకు మన దగ్గర కొదువలేదు. కానీ అలాంటి చిత్రాలకు జనాదరణ లేదు. ప్రేక్షకులు ఇలాంటివే ఆదరిస్తున్నారు. మేము అలా తీస్తున్నామని నిర్మాతలు, వారు తీస్తున్నారు కాబట్టి మేము తప్పనిసరై చూస్తున్నామని ప్రేక్షకులనుకునేంతకాలం మంచి సినిమాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చ. మన హీరోలని మహాత్ములుగా చూడాలంటే ఎంతో సమయం పట్టవచ్చు. బాలీవుడ్‌లో చక్కని సందేశాత్మక ప్రయోగాలకు పెట్టింది పేరు అమీర్‌ఖాన్ చిత్రాలు. ఒక లగాన్, దంగల్, తారే జమీన్‌పర్- తెలుగులో కూడా హీరోయిజాన్ని శక్తివంతంగా చిత్రీకరించిన సినిమాలు చాలానే ఉన్నాయి.
హీరో అంటే కుటుంబ బాధ్యతలు తెలిసిన కొడుకు. కాలేజీల్లో ఆకతాయిల మూకల బారినుండి అమ్మాయిలను కాపాడే రక్షకుడుగా, సమాజ సేవకై ముందుంటూ సంఘ విద్రోహ శక్తులను ఎదురించే సాహసవంతుడిగా, దేశభక్తిగల ఉత్తమ పౌరుడిగా, ప్రేక్షకులను తన సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్నిచ్చే బోధకుడిలా ఉంటే ఆ హీరోయిజాన్ని ఆదరించినా గర్వంగా ఉంటుంది. కమర్షియల్ అంశాల కారణంగా హీరోలు తమ పాత్ర చిత్రీకరణపట్ల దర్శక నిర్మాతలతో విభేదించకపోవచ్చు. వ్యాపార దృక్పథం పట్ల నష్టం రాకూడదనే నిర్మాతలు మనసు చంపుకుని హీరో పాత్ర స్వభావాన్ని మార్చవచ్చు. అంతిమంగా కోల్పోతుంది మాత్రం హీరోయిజం ప్రతిష్ట. ఏది ఏమైనా హీరోలకు మళ్లీ పాత రోజులు రావాలని ఆశిద్దాం.

-్భతి దుర్గయ్య