Others

శ్రీకృష్ణపాండవీయం(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో ఎన్‌ఎటి రామకృష్ణ కంబైన్స్‌పై ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘శ్రీకృష్ణపాండవీయం’. 1966 జనవరి సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ అద్భుత పౌరాణిక చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. కుంతీదేవి, తన కుమారులు పాండవులకు అన్ని వేళలా అండగా ఉండమని శ్రీకృష్ణుడిని కోరడంతో సినిమా మొదలయి, పాండవులు, కౌరవులమధ్య ఎత్తులు పైఎత్తులతో సాగుతుంది. పాండవుల మంచితనం, ప్రతిభను జీర్ణించుకోలేని సుయోధనుడు- పాండవుల విజయాలకు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్న సన్నివేశాలు పిల్లలు, పెద్దల్ని ఆకట్టుకునే విధంగా వుంటాయి. వారణాశిలో పాండవులున్న లక్కఇంటి దహనం, కృష్ణుడు సాయంతో భీముడు తన కు టుంబాన్ని రక్షించుకోవడం, భీముడు హిడింబాసురుణ్ణి చంపడం, హిడింబితో భీముడి ప్రేమ, వివాహం, సుయోధనుడు మయసభలో గర్వపడడం, పాండవుల మీద పగ పెరగడం, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమించి సుయోధనుడు గర్వభంగం చెందడం, కృష్ణుని నిందించిన శిశుపాలుని నూరు తప్పులకు శిక్షగా సుదర్శన చక్రంతో సంహరించడం.. చివరగా శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనంతో కథ ముగుస్తుంది. చిత్రం యా వత్తూ ఛాయాగ్రహకుడు రవికాంత్ నగాయిచ్ చేసిన ఇంద్రజాలంలా, ప్రతి సన్నివేశం కన్నుల పండువగా సాగుతుంది.
రారాజుగా సుయోధన పాత్రలో ఎన్టీఆర్ రాజసం, శ్రీకృష్ణుడిగా చెరగని చిరునవ్వు, మందగమనంతో ఇలా రెండు పాత్రలలో మెప్పిండం నభూతో నవిష్యత్. పరిహాసించిన ద్రౌపదిని ఉద్దేశించి పలికిన గంభీరమైన మాటలు, కిరీటం లేకుండా అటు ఇటు తిరుగుతూ అభిమానధనుడిగా ఎన్టీఆర్ పలికించిన హావభావాలు ఓహో అనిపిస్తాయి. సాత్వికాభినయంతో సాగే శ్రీకృష్ణుడి పాత్రను శాంత, అభయముద్రలతో చిరునగవులు చిందించే మాయా నాటక సూత్రధారిలా నటించి మెప్పించారు. సుయోధన, శ్రీకృష్ణ పాత్రలను ఎంత కఠోర దీక్షతో వైవిధ్యభరితంగా మెప్పించడం ఎన్టీఆర్‌కే చెల్లింది. అద్భుతమైన మయసభ, సుయోధనుడి సభ,లక్క ఇల్లు, హిడింబ నృత్యం సన్నివేశం సెట్, రుక్మిణీ మందిరం, బకాసురుని వద్ద ఎముకల గుట్టలు, పలు సభా భవనాలు, శిల్ప సుందరులు, నిజమని భ్రమించేలా పుష్పశిల్పంపై తుమ్మెదలు నాటి కళాదర్శకుల నైపుణ్యానికి సాక్షీభూతాలు. సముద్రాల సీనియర్ సందర్భోచిత మాటలు, కొసరాజు, సినారెల పాటలు, పద్యాలు, టివి రాజు సంగీతం అజరామరం. నేటికీ వినిపించే ‘మత్తు వదలరా..’ నిద్దుర మత్తు వదలరా, ‘చాంగురే బంగారు రాజా’, ‘ప్రియురాల సిగ్గేలనే’ పాటలు మధురాతి మధురాలే. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం ద్వారా తన నట, దర్శక విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్, ప్రేక్షక మనసులో శాశ్వతతత్వాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రం నాకు బాగా నచ్చిన చిత్రం. అందుకే నేనంటాను.. ఒక సూర్యుడు.. ఒక చంద్రుడు.. ఒక ఎన్టీఆర్!
-్ధరణికోట శివరాంప్రసాద్, హైదరాబాద్