Others

జగదానందకారకా..(. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2011 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో శ్రీ యలమంచిలి సాయిబాబు సాయిబాబా మూవీస్ పతాకంపై నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రం ఈ దశాబ్దకాలంలో విడుదలైన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఉత్తర రామాయణం ఆధారంగా లవకుశుల చరిత్రను శ్రీరామరాజ్యం పేరిట తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రారంభంలోవచ్చే జగదానందకారకా, జయ జానకి ప్రాణ నాయక అనే పాట అంటేనాకు ఎంతో ఇష్టం. ఈ పాటకు సాహిత్యం జొన్నవిత్తుల అందించగా, ఇళయరాజా స్వరకల్పనలో బాలు, శ్రేయోఘోశల్ అద్భుతంగా పాడారు. రావణ వధ తర్వాత పుష్ప విమానంలో లక్ష్మణ, ఆంజనేయ సీతా సమేతుడై తిరిగి వచ్చిన శ్రీరామచంద్ర ప్రభువుకు అయోధ్య ప్రజలు స్వాగతం పలికే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఇళయరాజాసంగీతం ఒక హైలెట్ అయితే, ఈ పాట బాపుగారి దర్శకత్వంలో చిత్రీకరించిన విధానం అపూర్వం, అసామాన్యం. సార్వభౌమునికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతుంటే, సుపరిపాలనతో ధర్మసంస్థాపన గావించమని స్వయంగా న్యాయదేవతే అర్థించడం, ధర్మనిష్టాగరిష్ఠుడు, పితృవాక్య పరిపాలకు అయిన శ్రీరామచంద్రుని గుణగణాలు, కీర్తి ప్రతిష్ఠలను నాలుగు వేదములు కీర్తించడం, రామ తారక మంత్రమే ముక్తి సంధాయకం అంటూ జొన్నవిత్తులవారి సాహిత్యం మనస్సులను రంజింపచేస్తుంది. బాలకృష్ణ, నయనతారలు బహు చక్కని నటనను కనబరిచి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసారు. ఈ పాట ఎప్పుడు విన్నా అటువంటి సత్పురుషుడు, సాక్షాత్తూ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రమూరిత అవతారమెత్తిన ఈ పుణ్యభూమిలో నాకు జన్మ లభించినందుకు ఆనందంతో, గర్వతో కళ్ళు వర్షిస్తాయి. శ్రీరాముడు నడయాడిన ఈ పుణ్యభూమపై ఆయన చూపిన బాటలో, మార్గదర్శకత్వంలో నడిచి జీవితం ధన్యం చేసుకోవాలనిపిస్తుంది. ఈ పాట చెప్పినట్లు రామనామము అమృతం కాగా, శ్రీరామ కీర్తనం సుకృతం, శ్రీరామచంద్రుడే లోక రక్ష! తరతరాలవరకు గుర్తుండిపోయే ఇంతటి అద్భుతమైన పాటను అందించిన రచయిత, సంగీత దర్శకుడు, గాయనీ గాయకులకు, బాపుగారికి తెలుగుజాతి యావత్తు రుణపడి వుంది.

-సి.ప్రతాప్