Others

పాటల పిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనో పాటల పిట్టనై
కిటికీ గుండెపై వాలి
ఈ ప్రపంచాన్ని నా రాగంతో వెలిగించనా..
గుండెల్లో బాధను పాడి
నిన్నో తడి నిండిన తనువుగా చేయనా..
పచ్చని చెట్టును ఆలపించి
నిన్ను ఆనందాల ఆభరణంగా మార్చనా..
పాలబుగ్గల నవ్వుల స్వరాలను చిలకరించి
నిన్నో స్నేహపు ఛాయగా మలచనా..
ఉలికులికి పడే లోకానికి
వాడిపోని ధైర్యపు కవచంగా చేయనా..
నేనో పాటల పిట్టనై
కిటికీ గుండెపై వాలి
ఈ ప్రపంచాన్ని కవిత్వంగా మార్చనా..

అమూల్యాచందు.కప్పగంత 9059824800