Others

సహజీవన సౌభాగ్యమంటే ఇదేనా?(వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పంది బురదమెచ్చు గాని, పన్నీరు మెచ్చునా?’ అంటే ఓకెగాని, కేవలం మెచ్చుకోవడానికేనా? బ్రతుకు? తిండి కావాలి బాబూ! అంచేత జైపూర్‌లో ఓ వరాహ రాజము - కోతితో నేస్తం కట్టింది- నేస్తం కూడా కాదు, బేరం పెట్టుకుంది.. జైపూర్ అంటే రాజస్థాన్‌లోని చారిత్రక నగరం - పింక్‌సిటీ అంటారు. జంతర్‌మంతర్ ‘సన్‌డయల్’, హవామహల్ లాంటి టూరిస్టు ఆకర్షణలున్నాయక్కడ- అది చూడవచ్చిన ఒక బ్రిటిష్ పర్యాటక జంట పౌలినా జావర్, జాన్కాక్స్‌లకి అక్కడ అన్నింటినీ మించిన ఆకర్షణ దొరికింది. నగరంలో ఒక అందాల ప్రాంతమున్నది. అక్కడ ‘మాకక్’ జాతి అంటే పొట్టి తోకల మర్కటములు మిక్కుటము. అల్లాగే, నల్లని మచ్చలున్న వరాహములు కూడా.. కుప్పలు. జనాలు ఈ కోతుల్ని హనుమాన్ సంతతిగా భావిస్తే- ఊర పంది మాత్రం విష్ణుమూర్తి దశావతారములలో ఒకటి కాదా? అంటారు కొందరు. అక్కడ ఓ కోతి- ఒక చిన్న పంది వీపుమీద స్వారీ చేస్తూ కనబడ్డది. కెమెరా పట్టుకుని జావర్ వెంటపడ్డాడు సరదాగా. కొన్ని వీధులు పర్యటించిన ఆ ‘పంకోద్వయం’ ఒక దగ్గర ఆగింది. కోతి చెంగున పంది వీపుమీదనుంచి దూకేసింది. పంది తోక ఊపుతూ ఒక పెద్ద చెత్త డబ్బా దగ్గర ఆగింది. కోతి ఆ డబ్బా మీదికి ఎగిరి లోపలికి దూకి- లోపలనుంచి కొంత తిండి ఇవతలికి పట్టుకొచ్చింది. ఈ రెండూ రోడ్డువార విడిసి ఊసులాడుకుంటూ విందారగించాయి. బ్రిటిష్ జంట తమ భోజనం మరచిపోయారు.
ఒకే జాతికి చెందకపోయినా ఈ దోస్తీ అక్కత నిత్యకృత్యమట! బొమ్మలు లండన్‌కి తీసుకుపోయి లండన్ మిర్రర్ పత్రికకి ఇచ్చారు. ఈ ‘స్టోరీ’ని మనం సదరు సౌజన్యంతో వాడుకుంటున్నాము. మన బండి ఎద్దులు కూడా కాకులకి స్వారీగా సేవ చేస్తాయి కానీ- కాకులు వాటిని పొడుచుకుతింటాయి. కోతి పిల్లలాగా తిండిపెట్టి, ఆ రూపంలో ఋణం తీర్చుకోవు- ఎద్దు పుండు కాకికి సలుపా? అన్నది సొంత సామెతయే గదా?

-వీరాజీ