Others

నా కవితాసుందరి(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత చక్కనిదే నా అందాల జిలుగు కవిత
అబ్బ ఎంతెంత చక్కనిదే నా సుగంధాల చరిత
తెలుగుబంధాల చెక్కుటద్దాలది
వెలుగు కావ్యాల పెక్కుటందాలది
సొగసరి చూపుల ప్రబంధ జాబిలి
తొలకరి వలపుల అక్షర నెచ్చెలి

తాను నా అమ్మనుడి సుమరాగ విరివాటిక
జాను తెలుగు జావళీల నవరాగ సిరిగీతిక
ఆమె శిశిర ఋతుశీతల పవన మందాకిని
వర ఆంధ్రనాట్య విలాసాల కవన శుభాంగిని

ఆమె అలంకారాల యింతి సమాసాల పూబంతి
తత్సమాల చెంగల్వ పూదొంతి - తత్భవాల చెంగావి చిరుయింతి
నాయింతి దేశియాల హేమంతి - వాసంతి మాండలీకాల చామంతి
ఆమె పద్యం తుంటరి మబ్బల్లె తొంగి చూస్తుంది
ఆమె గద్యం తెల్లారి వెలుగల్లె పొంగిపోతుంది
ఆ కన్య వేలగ్రంధాల సరస చూపులతో మత్తెక్కిస్తుంది
అనన్య హేల భావాల కవనఝరులతో ముంచేస్తుంది
తెలుగు కవితా సొగసు మల్లెకన్నా తెల్లాతెల్లానిది
తెలుగు కమ్మదనం తేటతేనియకన్నా తీయతీయానిది
నా కవితాంతరంగ తెలుగుకీర్తి

- రాఘవ మాస్టారు, 9743776920