AADIVAVRAM - Others

భావోద్వేగాలు పసిగట్టడంలో మనకన్నా శునకాలే బెటర్! (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి భావోద్వేగాలు ఎక్కువ. ఎదుటివారిని చూసి వారి మానసిక పరిస్థితిని అంచనావేయడంలో మానవులకు అపరిమితమైన శక్తి ఉంది. నిజానికి మానసిక శాస్త్రంలో అది ఒక ఆయుధం. మనిషి హావభావాలు, కదలికలు, శరీరభాషను బట్టి వారు ఏం ఆలోచిస్తున్నారో, ఏ స్థితిలో ఉన్నారో పసిగడతాం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ తాజా అధ్యయనాలలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మనకన్నా మనం పెంచుకుంటున్న శునకాలు మనలోని భావాలను బాగా గ్రహించగలవట. శునకాలను చూసి మనం వాటి మనసులోని విషయాలని, వాటి భావనలను పసిగట్టడంలోకన్నా మనను చూసి మన మనసులోని భావాలను అవి బాగా కనిపెట్టగల శక్తి వాటికి ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ఒకరకంగా మనకన్నా ఈ విషయాల్లో శునకాల మేధోశక్తి ఎక్కువ అన్నది ఈ అధ్యయనాల సారాంశం. లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. లండన్ విశ్వవిద్యాలయ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ సోఫీ స్కాట్ రాయల్ ఇనిస్టిట్యూట్ క్రిస్ట్‌మస్ ఉపన్యాసాలలో భాగంగా ఈ అధ్యయన ఫలితాలను వివరించనున్నారు. పెంచుకునే జంతువులను తక్కువ అంచనా వేయడం మనకు సహజంగా ఉండే అలవాటని, వాటిని చిన్నపిల్లల్లా చూస్తామని స్కాట్ అభిప్రాయపడ్డారు. కానీ శునకాలు యజమానిని అసలైన నాయకుడిగా భావిస్తాయని పేర్కొన్నారు. నిజానికి తోడేళ్ల గుంపునకు నాయకత్వం వహించే సమర్ధ నాయుకుడి (ఆల్ఫా మేల్)లా అవి తమ యజమానిని చూస్తాయని తన అధ్యయనంలో తేలిందిని స్కాట్ చెబుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన మరో అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలింగనం చేసుకోవడాన్ని శునకాలు ఇష్టపడవన్నది వారు కనిపెట్టిన అంశం. శునకాలను ఆలింగనం చేసుకుంటున్నప్పుడు తీసిన ఛాయాచిత్రాలను పరిశీలిస్తే వాటి మొహంలో కనిపించే అయిష్టతను గమనించవచ్చని స్కాట్ చెబుతున్నారు. యజమానులతో కలసి ఉండటానికి అవి ఇష్టపడతాయని, వారిని ఉద్వేగానికి గురి చేయాలని అసలు అనుకోవని కానీ స్వేచ్ఛగా తిరగాలన్న జంతువుల లక్షణం రీత్యా అవి కూడా అటూఇటూ తిరిగేస్తూంటాయని ఆమె వివరించారు. శునకాల హావభావాలను పసిగట్టే విషయంలో మానవులు పెద్దగా శ్రద్ధ చూపరని, అయితే అదే సమయంలో శునకాలు మాత్రం తమ యజమాని ముఖాన్ని, హావభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రవర్తిస్తుంటాయని ఆమె వివరించారు.

-ఎస్.కె.ఆర్.