AADIVAVRAM - Others

చాక్లెట్‌లే నైవేద్యం! ( లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం ఆచారాలకు, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను కూడా పూజిస్తారు. తాము ఆరాధించే దేవతలకు మనవారు రకరకాల నైవేద్యాలు పెడతారు. ఈ ఆచారాలు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకమని చెప్పాలి. తరచి చూస్తే ఇలాంటి ఆచారాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని దేవుళ్లు, దేవతలు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆ కోవకి చెందిన దేవతే కేరళలోని అలప్పుజ బాల మురుగన్. ఈ ఆలయంలో కొలువై ఉన్న బాల మురుగన్ పూలు, పళ్లు, కొబ్బరికాయలు కాకుండా భక్తుల నుండి చాక్లొలేట్ బార్లు స్వీకరిస్తారు. ముఖ్యంగా పిల్లలు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. వారంతా ఇక్కడి దేవుడికి చాక్లొలేట్లు భక్తిగా సమర్పించి వెళుతుంటారు. పరీక్షల సమయంలో అయితే ఈ ఆలయం అస్సలు ఖాళీ ఉండదు. స్టూడెంట్లు పరీక్షలు బాగా రాయాలని కోరుతూ స్వామికి చాక్లొలేట్లు సమర్పించడానికి బారులు తీరుతారు. అందుకే బాల మురుగన్‌ని మంచ్ మురుగన్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ స్వామికి తొలుత పూలదండలు, నిమ్మకాయలను భక్తులు పెద్ద ఎత్తున సమర్పిస్తుండేవారు. అయితే కొన్నాళ్ల క్రితం పరీక్షల సమయంలో ఒక చిన్న పిల్లవాడు ఈ స్వామికి తనకిష్టమైన చాకొలెట్ సమర్పించాడు. ఆ తర్వాత మరొక పిల్లవాడు కూడా అలాగే చేసాడు. అప్పటి నుండి ఈ స్వామికి చాక్లొలేట్లు, పూలదండలు సమర్పించడం ఆనవాయితీ అయిపోయినట్లు ఈ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే ఈ స్వామికి మంచ్ పారా అనే బియ్యంతో చేసిన నైవేద్యం కూడా కొందరు భక్తులు సమర్పిస్తుంటారు. కొందరు భక్తులు స్వామి నిలువెత్తు చాకొలేట్లు సమర్పించి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటుంటారు. దీనిని మంచ్ తులాభారం అంటారు. ఈ విధంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన బాలమురుగన్‌ని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాలే కాకుండా విదేశాల నుండి కూడా వచ్చే భక్తులు పెద్ద ఎత్తున కార్టన్లకు కార్టన్లు చాక్లొలేట్లు సమర్పిస్తుండడంతో అవన్నీ గుట్టలు గుట్టలుగా నిల్వ ఉండిపోవడం మొదలయింది. దాంతో ఆలయ నిర్వాహకులు అవే చాక్లొలేట్లను పుష్పాంజలి, ఆరతి వంటి భగవత్ సేవల సమయంలో భక్తులకు వాటిని ప్రసాదంగా ఇవ్వడం మొదలుపెట్టారు. కార్తికేయన్ లేదా సుబ్రమణ్యగా భక్తులు కొలుచుకునే ఈ స్వామి భక్తులు విరివిగా సమర్పించే మంచ్ బార్ల వల్ల మంచ్ మురుగన్‌గా ప్రసిద్ధి చెంది భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసాదిస్తున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్