AADIVAVRAM - Others

ఆ లఘు చిత్రాలు సామాజిక చైతన్యానికి ఘన ప్రతీకలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయనో విశ్రాంత ఉద్యోగి.. అయితే సామాజిక బాధ్యతలో అవిశ్రాంత యోధుడు! నలుగురిలా ఉద్యోగ విరమణ అనంతరం ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఆయనకిష్టం లేదు... తన వంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న సదాశయంతో రెండు ముఖ్యమైన సామాజిక అంశాలను లఘు చిత్రాలుగా రూపొందించారు. ఆయనే కాకినాడ నగరానికి చెందిన విశ్రాంత మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిక్కం రామచంద్రరావు. సమాజంలో అనాథల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని 2015లో ‘స్పందన’ అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అప్పటివరకు ఏ సామాజికవర్గానికి చెందని అనాథలను బీసీ-ఏ జాబితాలో చేరుస్తూ జీవో విడుదల చేసింది. తర్వాత మద్యం తాగి వాహనాలు సేవించేవారికి కనువిప్పు కలిగించాలన్న ఆశయంతో ‘డ్రంకన్ డ్రైవ్ ఆగాలంటే..? బండికి మందేస్తే!’ అనే పేరుతో మరో లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాల్లోను చక్కని సందేశాలను సమాజానికి అందించారు. స్పందన చిత్రాన్ని చూసి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనాథలకు రిజర్వేషన్లు కల్పించాలని రామచంద్రరావు విజ్ఞప్తిచేశారు. ఈ లఘు చిత్రాలను సామాజిక బాధ్యతతో నిర్మించానని చెప్పారు.
అనాథలను చూసి చలించి..
సమాజంలో అనాథలను చూసి చలించి స్పందన అనే లఘుచిత్రాన్ని నిర్మించినట్టు రామచంద్రరావు తెలిపారు. అనాథలు ఏ సామాజికవర్గానికి చెందకపోవడం, ఓటుబ్యాంకు కాకపోవడంతో ప్రభుత్వాలు వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని, వారు స్వంత కాళ్లపై ఆనందంగా బతకడానికి సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుందని ఆ చిత్రంలో చర్చించారు. ఏదోలా బతకడం కోసం గత్యంతరం లేని స్థితిలో, ఈ సమాజంపై ఉక్రోషంతో సంఘ వ్యతిరేక శక్తులతో అనాథలు చేతులు కలపకూడదన్న ఇతివృత్తంతో ‘స్పందన’ లఘు చిత్రాన్ని నిర్మించానన్నారు. ఈ లఘు చిత్రాన్ని ఆరు భాషల్లో నిర్మించి యూట్యూబ్‌లో ఉంచానని, దీనికి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అనాథలను బీసీ-ఏలో చేరుస్తూ జీవో ఎంఎస్ నెం.28 తేదీ 29/05/2015 విడుదల చేసిందన్నారు. అనాథలకు అదికూడా చాలదని, ఎస్సీ ఎస్టీలతో సమానంగా వారిని గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఇదే విధంగా రాష్ట్రంలోని అనాథలను ఆదుకోవాలనేది తన కోరికని పేర్కొన్నారు.
శాస్తవ్రేత్తలను ఆలోచింపజేసే చిత్రం...
రామచంద్రరావు రూపొందించిన మరో లఘుచిత్రం శాస్తవ్రేత్తలను ఆలోచింపజేస్తోంది. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలను శాశ్వతంగా నిరోధించేందుకు తనకు వచ్చిన ఓ టెక్నికల్ ఐడియాతో ‘డ్రంకెన్ డ్రైవ్ ఆగాలంటే... బండికి మందేస్తే..!’ అనే లఘుచిత్రాన్ని రూపొందించానన్నారు. ఈ చిత్రాన్ని అన్ని ప్రభుత్వ శాఖలకు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ముందుగా స్పందించి ఈ లఘు చిత్రాన్ని స్మార్ట్ ఇండియా పోటీకి ఎంపిక చేసిందని చెప్పారు. ఈ టెక్నికల్ ఐడియాను ప్రపంచంలోని అందరు ఆటోమొబైల్ తయారీదార్లకు చేరాలనేది తన ఆశయంగా పేర్కొన్నారు. సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది, అందులో మన దేశంలో 3 లక్షల మంది డ్రంకెన్ డ్రైవ్ కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ లఘు చిత్రాన్ని సైతం యూట్యూబ్‌లో చూడవచ్చని చెప్పారు. మద్యం సేవించి వాహనం నడిపేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ స్టీరింగ్‌ను తాకిన పక్షంలో ఆటోమాటిక్‌గా వాహనం అక్కడే నిలచిపోయేలా నానో టెక్నాలజీ సహాయంతో సరికొత్త వాహనాలను ప్రపంచానికి అందించాలన్నది ఈ లఘు చిత్రం ఇతివృత్తమని తెలియజేశారు. ఇటీవల ఈ లఘు చిత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేసినట్టు రామచంద్రరావు వివరించారు.
*

-డి.శ్రీనివాసకృష్ణ