Others

పాప పుణ్యాల ఫలితం అనుభవించక తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపకార్యాలు నిర్వర్తించి, ఎంత పుణ్యమార్జించినా పాత పాపభారాన్ని మోయాల్సిందే. నేను ఇంత పుణ్యాన్ని చేసాకదా మరి కాస్త పాపం చేస్తే ఏమి అంటే విధి ఊరుకోదు. కనిపించని విధి పుణ్యానికి ఏవిధంగా మంచి ఫలితాన్ని ఇస్తుందో పాపానికి కూడా శిక్ష వేయనే వేస్తుంది. ఆ పాపభారాన్ని బట్టి శిక్షలో ఎక్కువ తక్కువలుంటాయి. పశ్చాత్తాపం చెంది, మరలా ఆ పాపాన్ని చేయకుండా ఉంటూ భగవంతుని శరణు వేడిన వారికి ఏనుగంత పాపరాశి ఉంటే అది చీమై కదిలి వెళ్తుంది. కాని చేసిన పాపానికి శిక్షలేకుండా మాత్రం ఉండదేమో అని ఒక్కొక్కరి జీవిత చరిత్రలు చూస్తే అనిపించకమానవు.
‘తండ్రీ! నీవు చేసే కులవృత్తి వల్ల నాకు అవమానం జరుగుతోంది. నీవా వృత్తిని నిలిపేసి మర్యాదకరమైన, గొప్పదైన వృత్తిని అవలంబించు అప్పుడు కాని నాకీ దురవస్థ పోదు’ అని అంది ఓ కూతురు. మాంసాన్ని విక్రయించి సొమ్ములు సంపాదించి తన రోజులను గడుపుకొనే బోయవానితో. ఆ బోయవాడు విస్తుబోయాడు. ‘అమ్మా! వృత్తుల్లో మర్యాద అమర్యాద అనేవి ఏవీ ఉండవు. పరమాత్మ ఎవరికేది నిర్ణయించుతాడో దానిని మనం చేయవలసిందే. ఇదంతా భగవంతుడు ఆడించే జగ్గన్నాటకం. అందులో మనం నిమిత్తమాత్రులం తల్లీ’ అన్నాడు ఆ బోయవాడు.
‘తండ్రీ నీవు చెప్పే వేదాంతం వినడానికి బాగుంటుంది. కాని మా అత్తగారు నన్ను నీ వృత్తిని నెపం చేసి నన్ను అవమానించింది. కనుక నాకా ఇల్లు అక్కర్లేదని వచ్చేసాను’ అంటున్న కూతురితో బోయవాడు వృత్తుల వల్ల కులాల వల్ల మనిషి మంచివాడో కాదో నిర్ణయించడం బహు కష్టం అమ్మా. అతడి బుద్ధి, మనస్సు, ప్రవర్తన వీటిని బట్టి మంచి చెడు అనుకోవాల్సి వస్తుంది అని చెప్పినా వినని కూతురిని సముదాయించడానికి బోయవాడు ఎన్నో కథలు చెప్పాడు.
అసలు సంగతిని విని ఆ బోయవాడు తన కూతురిని వెంటబెట్టుకుని తన వియ్యపురాలింటికి వెళ్లి ‘అమ్మా! పెద్దవారు క్షమించండి. మా అమ్మాయిని మీ ఇంట దిగబెడుదామని వచ్చాను’ అంటూ వారింటికి వెళ్లాడు. కాసేపు ముచ్చట్లాడిన తరువాత బోయవానిని అతని వియ్యపురాలు భోజనానికి పిలిచింది. ‘అమ్మా! నేను మీ ఇంట భోజనం చేస్తాను కాని నాకు ముందుగా ఏమేమి దినుసులతో భోజనం తయారు చేస్తారో కాస్త చూపెట్టండి’ అని ఆ బోయవాడు అన్నాడు.
వెంటనే ఆ ఇంటి యజమానురాలు బియ్యం, పప్పుదినుసులు, గోధుమలు చేటలో తీసుకొని వచ్చి చూపెట్టింది. అందులో అక్కడక్కడ కొన్ని సన్నని పురుగులుండడం కనిపించింది.
అమ్మా ఈ పురుగులతో పాటు వండుదురా అని అడిగిన బోయవానికి ఆ యజమానురాలు ‘లేదు లేదు వీటిని చెరిగేసి, దులిపేసి లేక కడిగినపుడు అవి చనిపోతాయికదా ఆ తరువాత మేము ఈ పదార్థాలను తినదగిన వాటిగా వండుతాము’ అని చెప్పింది.
‘అమ్మా! నేను నా స్వధర్మాన్ని పాటిస్తూ ఒక మృగాన్ని చంపి దాని మాంసమును విక్రయించి దానివలన వచ్చే సొమ్ముతో నేను, నా కుటుంబం జీవనం గడుపుతాము. కాని మీరు ప్రతిరోజు ఇంత హింస చేసి భోజనం తింటున్నారు. మిమ్ములను ఏమని అనాలి’ అని అడిగాడా బోయవాడు. ఒక్కక్షణం నివ్వరపోయిన ఆ యజమానురాలికి పరధర్మాన్ని ఆశ్రయించి నాకు ఈ జన్మ వచ్చిందమ్మా. కనుక మరలా నన్ను స్వధర్మాన్ని ఆచరించవద్దని చెప్పే నా కూతురికి, మీకు విషయం తెలియాలని ఇలా చెప్పాను అంతే’ అన్నాడు ఆ బోయవాడు.
(ఇంకాఉంది)

- రాయసం లక్ష్మి