Others

తిరుప్పావై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుని తనయ ఆనాడు చేసిన తిరుప్పావై వ్రతాన్ని పురస్కరించుకుంటూ వైష్ణవాలయాలన్నీ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తాయి. భక్తులంతా తండోపతండాలుగా ప్రాతఃకాలంలో వెళ్లి ఆ గోదాదేవిని స్మరించుకుంటూ తాముకూడా ఆ తిరుప్పావై పాశురాలను అనుసంధానించుకుంటారు. ఆ తర్వాత శ్రీరంగాగోదాదేవులను పూజించుకొంటారు. ఇలా నెలరోజులూ వ్రతాన్ని ఆచరిస్తారు. నాడు గోదాదేవి తన్నుతాను గోపికగా భావించి చేసిన వ్రతాన్ని నేడు ప్రతి భక్తుడు లేక భక్తురాండ్రు తమను తాము గోదాదేవిగా రూపించుకొంటూ రంగనాథునికి కైంకర్యం చేస్తుంటారు. ఆనాడు గోదాదేవి పొందిన దివ్యఫలాన్ని తాముకూడా పొందాలని తమకు శాశ్వతమైన రంగనాథుని కృప లభ్యమవ్వాలని వీరు కోరుకుంటారు.