Others

కొత్త ఏడాదిలో భారీ చిత్రాల జాతర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి మరో ఏడాది గడిచిపోయింది.. గత ఏడాది తెలుగు చిత్రసీమలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్న ఏడాదిగా నిలిచిపోయింది. ఎప్పటికన్నా ఈ ఏడాది సక్సెస్ రేట్ పెరగడమే కాదు కొత్త విజయాలు.. కొత్త ఉత్సాహాలు దక్కాయి. ఈ విషయంలో మొదటగా చెప్పుకోవలసింది ‘బాహుబలి’. రాజవౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ పేరుతో వచ్చిన ఈ సినిమా దాన్ని మించిన విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌పై కొత్త విజయాన్ని నమోదు చేసింది. ఇంతవరకు ఏ సినిమా అందుకోని విధంగా ఏకంగా 1600కోట్ల వసూళ్లను కొల్లగొట్టి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఇక మిగతా సినిమాలు కూడా కొత్తదనంతో ఆకట్టుకున్నాయి. భిన్నమైన సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు. తెలుగులో కూడా ఈ ఏడాది 100 కోట్ల క్లబ్‌లను దాటి తెలుగు సినిమా ఏకంగా 150, 200 కోట్ల క్లబ్‌ల వరకు చేరుకున్నాయి. మరికొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయాన్ని చవిచూశాయి. ఇక కొంతమంది హీరోలకు ఈ ఏడాది నిరాశే మిగిల్చింది. ఇక బిజినెస్ పరంగా.. మార్కెట్ పరంగాతెలుగు సినిమా స్థాయి పెరిగింది. మరి కొత్త ఏడాదిలో ఎవరు ఎలా బరిలోకి దిగుతున్నారు.. ఏ ఏ సినిమాలు సిద్ధం అవుతున్నాయో ఓ లుక్ వేద్దాం..
కొత్త ఏడాది.. 2018 మాత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త సందడి ఇచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాదిలో ఎక్కువగా బడా సినిమాల జాతర కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు వారి అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడమే కాకుండా బిజినెస్ పరంగా సంచలనం రేపుతున్నాయి. ఈ ఏడాది ముందుగా రంగంలోకి దిగుతున్నాడు పవన్‌స్టార్. ‘అజ్ఞాతవాసి’గా అలరించేందుకు రెడీ అయ్యాడు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది?’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌తో పవన్‌కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా కావడంతో భారీ అంచనాలు తారాస్థాయికి చేరాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా సంచలనం క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇక ఆ తరువాత సీనియర్ హీరో నందమూరి బాలయ్య ‘జై సింహ’ అంటూ రంగంలోకి దిగుతున్నాడు. సంక్రాంతి హీరోగా ఇప్పటికే మంచి పేరుతెచ్చుకున్న బాలయ్య గత ఏడాది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో సూపర్‌హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఈ ఏడాదికి ‘జై సింహా’గా రాబోతున్నాడు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక సందడ్లో సడేమియా అంటూ తాను కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాడు కుర్ర హీరో రాజ్‌తరుణ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రంగులరాట్నం’ కూడా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా కూడా జనవరి 12న విడుదల కానుంది. వీరికి పోటీగా తమిళ హీరో సూర్య తన ‘గ్యాంగ్’ను వేసుకుని వస్తున్నాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో ఆసక్తి రేపిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోనే దిగేందుకు రెడీ అవుతోంది.
ఇక సంక్రాంతి సీజన్ తరువాత మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోలకు ధీటుగా బాక్సాఫీస్‌పై సత్తా చాటిన అనుష్క ‘్భగమతి’తో సిద్ధం అవుతోంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26న విడుదల చేస్తారట. దాంతోపాటు మాస్ మహారాజా రవితేజ కూడా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈమధ్య వరుస పరాజయాలతో టెన్షన్‌లో వున్న ఆయనకు రాజా ది గ్రేట్ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇపుడు అదే ఊపుతో ‘టచ్ చేసి చూడు’ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధానికి దిగుతున్నాడు. వీరందరితోపాటు ‘మహానటి’ కూడా వస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటిగా ఇమేజ్ తెచ్చుకున్న సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సావిత్రి నిజ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 28న మూడు భాషల్లో విడుదల కానుంది.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈసారి కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ‘్ధృవ’ వంటి హిట్ తరువాత రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మార్చి
30న విడుదల కానుంది. అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న సరికొత్త సంచలనంతో ఈ సినిమా విజయవంతం అవుతుందన్న నమ్మకం అందరికీ వుంది. తరువాత మహేష్‌బాబు ‘్భరత్ అను నేను’ అంటూ రాబోతున్నాడు. ‘శ్రీమంతుడు’ హిట్‌తో ఆకట్టుకున్న కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్‌బాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా నటిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. అల్లు అర్జున్ కూడా ఇదే నెలలో 27న ‘నా పేరు సూర్య’ అంటూ ప్రేక్షకులముందుకు రానుంది. ‘రేసుగుర్రం’, ‘టెంపర్’ వంటి చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. లగడపాటి శ్రీ్ధర్, బన్నీ వాసు రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా 27నే వస్తోంది. ఈ సినిమాలతోపాటు ప్రభాస్ ‘సాహో’ కూడా సిద్ధమవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన ‘శివ’ సినిమా కాంబినేషన్‌లో దాదాపు 28 ఏళ్ల తరువాత రూపొందుతున్న నాగార్జున సినిమా కూడా లైన్‌లోనే వుంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్