Others

ఓ తండ్రి తీర్పు(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ నటించి నిర్మించిన ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రం అంటే మాకెంతో ఇష్టం. మురళీమోహన్, జయసుధ జంటగా వచ్చిన ఈ చిత్రానికి మాగంటి రాజాచంద్ర దర్శకత్వం వహించారు. అల్లు రామలింగయ్య, ప్రభాకర్‌రెడ్డి, సాయిచంద్, బాలాజీ, కమలాకర్, ఈశ్వరరావు, కె.విజయ, సంయుక్త, రాజ్యలక్ష్మి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పిల్లలు పెద్దవారయ్యాక వారి ఆలనా పాలనా చూడకపోవడం, వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సినవారు వారిని ఇంటినుంచి వెళ్లగొట్టడం, చివరికి ఆ తండ్రి తన స్వశక్తితో ఉన్నత స్థాయికి ఎదగడం ఈ చిత్ర కథ ప్రధానాంశం. రామచంద్రయ్యగా మురళీమోహన్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. యువకుడిగా, మధ్యవయస్కుడిగా, వృద్ధుడిగా మురళీమోహన్ నటించిన తీరు ప్రశంసనీయం. సీతగా సహజ నటి జయసుధ మంచి నటనను ప్రదర్శించింది. చివరలో కొడుకులు ఇంటికి వచ్చినపుడు, భర్తతో కొడుకుల కోసం ఘర్షణపడే భార్యగా జయసుధ నటన అబ్బురమనిపిస్తుంది. రమేష్, సురేష్‌గా బాలాజీ, కమలాకర్‌ల నటన, వారి భార్యలుగా రాజ్యలక్ష్మి, సంయుక్తలు తమదైన నటనతో అలరించారు. ఖాసింభాయ్‌గా నటుడు ప్రభాకర్‌రెడ్డి నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. రాజా బహద్దూర్ చక్రధర్‌రావుగా సత్యనారాయణ విలనీ, హనుమంతుగా సాయిచంద్ ఈ చిత్రానికి ఆయువుపట్టు. తన మార్క్ నటనతో సాయిచంద్ మంచి ఈజ్‌తో నటించాడు. పాన్‌వాలాగా అల్లు రామలింగయ్య తనదైన శైలిలో నటించి మెప్పించాడు. చిత్రం చివరలో వృద్ధులకు బాసటగా, కొడుకుల చేత గెంటివేయబడ్డ అభాగ్యులకు ‘మన ఇల్లు’ సంస్థను మురళీమోహన్ స్థాపించటం చాలా బావుంది. కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరుగాంచిన మాగంటి రాజాచంద్ర ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అందంగా చిత్రీకరించి దర్శకుడిగా తన పేరును పదిలపర్చుకునేలా దర్శకత్వం వహించాడు. 1983లో విడుదలైన ఓ తండ్రి తీర్పు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొంది ఘనవిజయం సాధిచింది. ఆ సంవత్సరపు నంది అవార్డు ఉత్తమ చిత్రంగా ఎంపికై నంది అవార్డును గెలుచుకుంది. కుటుంబ కథా చిత్రంగా ఇప్పటికీ ఈ చిత్రం అంటే మాకెంతో ఇష్టం.
-జి.గౌరీ గాయత్రి, ఉప్పల్