Others

‘కన్నులైనా తెరవనీ..’(. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, శుభ ప్రధాన తారాగణంగా నిర్మాత డూండి నిర్మించిన సస్పెన్స్ చిత్రం ‘గూడుపుఠాణి’లో ఒక పసి బాలుడిని ఉద్దేశించి నేపథ్యంగాసాగే ఈ గీతంలో రచయిత ఆరుద్ర మేడిపండులాంటి ఈ సంఘంలోని మనుషుల స్వరూపాలను బాగా తెలియజేశారు. ‘కన్నులైనా తెరవనీ ఓ చిన్ని పాప స్వాగతం’ అంటూ ఆహ్వానిస్తూ ‘లోకమంతా శాంతి నెరిపిన గులాబి లేదులే’ అంటూ పిల్లలకు ప్రియమైన నాయకుడు నెహ్రూగారిని గుర్తుచేసి, ‘మానవతకై ప్రాణమిచ్చిన బోసి నవ్వు లేదులే’ అని మత ఘర్షణలు నిలువరించడానికి సత్యాగ్రహం చేసి తుపాకీ కాల్పుల్లో మరణించిన జాతిపిత మహాత్మాగాంధీగారిని స్మరించి, ‘పూల మాదిరి మెరిసిపోయే ముళ్ళబాటలు మిగిలెనే / నవ్వు చాటున మెరిసిపోయే నాగుపాములు మిగిలెనే / నేటి లోకం అసలు రూపం నీవు చూసేదెన్నడో, నీకు తెలిసెదెన్నడో’ అంటూ మాయమాటలతో, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను కుల, మత, వర్గ, భేదాలతో విడదీసి అధికారంకోసం అర్రులు చాస్తూ, అక్రమ సంపాదనలకోసం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించి, ధన సంపాదనే పరమావధిగా ధనం సంపాదించి దేశానికి అవినీతి కేన్సర్‌ను వ్యాప్తిచేసి నైతిక విలువలకు తిలోదకాలిస్తున్న నాయకులను నాగుపాములుగా అభివర్ణించడం హర్షదాయకం. ‘జాతి కోసం బలైపోయిన నేత నేడిక లేడులే’ అని సుభాష్ చంద్రబోసుగారిని గుర్తుంచడం, ‘జగతిలో మన కీర్తి పెంచిన విశ్వకవి లేడాయెనే’ అంటూ తన రచనలతో, జాతీయ గీతాలను అందించి ప్రజలలో సమైక్యభావాన్ని పెంపొందించిన రవీంద్రనాధ్ ఠాగూర్ లాంటి కవులు లేరని, ‘సొంత లాభం కొరకు దేశం గొంతు నులిమే ధీరులే / మంచి చేసినవారిని ముంచే మనుషులెందరో కలరులే /నేటి లోకం అసలు రూపం నీవు చూసేదెప్పుడో నీకు తెలిసేదెన్నడో’ అంటూ ఎందరో త్యాగధనులు పోరాడి సాధించిన ఈ దేశ స్వాతంత్య్ర ఫలాలను విదేశీ ద్రోహులతో చేతులు కలిపి దేశంలో హింసాకాండ, బాంబుల విధ్వంసం, ప్రజల మానాలతో చెలగాటం ఆడే స్వార్థపరుల సంఖ్య పెరిగిపోయిందని ఆవేదన వెలిబుచ్చిన ఈ గీతం ఆలోచనాత్మకం. ఎస్.పి.కోదండపాణి స్వరచనకు బాలుగారి అసాధారణ గాన రీతిలో జాలువారిన ఈ గీతం నేటికీ ప్రేక్షకులను అలరించడమే కాదు ఆలోచింపజేస్తున్నది.
-సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ, విశాఖపట్టణం