Others

అకటా! కటకటాల పాలైన రాకుమారులు! (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారినై.. చమురు కుబేరులైన సౌదీ రాకుమారులకు గడ్డుకాలం దాపురించింది. రాజుగారు సల్మా సల్మాన్ బిన్ అబ్దుల్ అల్ అల్సాద్‌గారు- రాకుమారులకు కూడా- ఉచితంగా కరెంట్ లేదు.. నీళ్ళు లేవూ- పెట్రోలు తాగండి కానీ వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు-కొత్తగా విధించిన వ్యాట్ సుంకాలు చచ్చినట్లు కట్టండి’’ అన్నాడు.
పోయిన గురువారం మొత్తం రాకుమారులు- వాళ్ళతో పాటు కొందరు మంత్రులు ఉద్యమంగా రోడ్డున పడ్డారు. రాజధాని రియాద్‌లోని చారిత్రాత్మకమైన పాలెస్ ముందు ప్రదర్శనలు చేస్తూ- ఎన్నడూ పట్టుపరుపులు దిగని విలాస పురుషులు అక్కడే రోడ్డుమీద బిఛనాలు వేసుకుని తొంగున్నారు. పన్నులు, బిల్లులు కట్టం- రాయితీలు కావాలి అని మందులేదు సరే, మంచినీళ్ళు కూడా లేకుండా అరుస్తూ వుంటే వాళ్ళని సెక్యూరిటీ బలం కారెక్కించి సిటీకి దక్షిణాన వున్న సంపన్న హేయర్ జైలుకి సాదరంగా దిగబెట్టేశారు. పోయినేడాది అక్రమ కార్యక్రమాలు అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ కొందరు ‘రా.కు’లను ఐదు నక్షత్రాల హోటల్స్‌లో పెట్టి విడుదలకు బేరసారాలు చేశారు. అదో సంస్కరణ కార్యం అంటూ దానికి యువరాజు మహమ్మద్బీన్ సల్మాన్ సారథ్యం వహించాడు. కానీ ఇపుడు సదుపాయాలు పరిహారాలు మినహాయింపులు భరణాలు గట్రా కొనసాగించాలంటూ యువరాజావారే రంగంలోకి దిగాడంటున్నారు. అరేబియా దేశాలలో ఇటువంటి ప్రదర్శనలు తిరుగుబాటు క్రిందకే వస్తాయి కనుక ఈ రాకుమారుల్ని గట్టిగా విచారిస్తారుట. రాజుగారికి దేశ విదేశీ అధికారిక అనధికారిక ఇలా, ‘హేరామ్’లో ఎందరు జనానా అంటే భార్యలు వుంటారో చెప్పడం కష్టం. ఇక వారి సంతాన జనాభా?.. ఉహుమ్ తెల్దు... పెట్రోలు ధరలు తగ్గించినది ఈ చమురు దేశం. అట్లా వచ్చే నష్టాన్ని పూడ్చుకోవాలని అన్నింటిమీదా వ్యాట్ తగిలించారు ఏలినవారు.. నో రాకుమారులు నై ‘అస్మదీయులు’ అంటున్నాడు రాజుగారు- రాకుమారులు కటకటాల వెనక్కి పోయి బ్రతగ్గలరా? బయట వుండి పన్నులు కట్టిచావగలరా? ఇరుగు‘బాట’ పట్టరు కదా? మాలుంనై!