Others

సాఫ్ట్‌వేర్ కాదు.. సమానత్వం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖండ భారతావనిలో మెజారిటీ జనం భూమిని నమ్ముకుని బతికేవాళ్లే. తరతరాల భూదోపిడీ నుండి తమను తాము కాపాడుకోవడానికి, భూస్వాముల గుండెల్లో పేలిన తుపాకీ తూటాయే నక్సలిజం. ఇది చరిత్ర కాదనలేని యదార్థం. ఈనెల 3వ తేదీన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల నరసింహం రాసిన వ్యాసం చదివి ఇది రాయవలసి వచ్చింది. ‘సాయుధ పోరు కాదు.. సాఫ్ట్‌వేర్ ముఖ్యం’ అనేది ఆయన వాదన. ఆ వ్యాసంయొక్క సారాంశం అది. గతంలో నక్సలిజంగా పిలువబడి ఆ తరువాత మావోయిజంగా ప్రస్తుతం పిలవబడుతున్న ఈ సిద్ధాంతానికి కాలం చెల్లిందని ఆయన అన్నారు. నాడయినా ఈనాడైనా ఏ సమస్యకైనా సరే క్షేత్రస్థాయి పరిశీలన ఎంతో అవసరం. ఒకడు ఉన్మాది అని పిలవబడితే ఆ ఉన్మాదానికి కారణం కూడా ఉండకపోదు. అలాగే మావోయిస్టులు కేవలం రక్తపిపాసులుగా అనుకుంటే పొరబాటేనని నా అభిప్రాయం. మావో సిద్ధాంతానికి మూలం మార్క్సిజం, లెనినిజం. పెట్టుబడిదారీ విధానంలో కష్టమొకడిది దాని ప్రతిఫలం ఒకడికే చెందుతున్న రోజుల్లో అసమానత్వం ఉండకపోతుందా? అలా అసమానత్వంలో కొన్ని యుగాలుగా దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తున్న అసంఖ్యాకులైన జనం తిరగబడరా! అదేకదా జరిగింది రష్యాలో, చైనాలో..
ఒకసారి మనదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్‌బరీ గ్రామంలో గ్రామ పెత్తందార్ల అక్రమాలను భరించలేక రైతాంగ పోరాటం సాయుధ పోరాటంగా మారిందనే విషయాన్ని మరువకూడదు. చారుమజుందార్, కామా సన్యాల్ నాయకత్వంలో ఆ ప్రతిఘటన జరిగింది. దేశంలో ఇంకా ఆకలిదప్పులతో ప్రజలు బాదపడుతున్నారంటే పాలకులే కారణం. రైతుల పరిస్థితి ఏమిటి? ప్రతి సమస్యకు భూమి మాత్రమే కారణంగా కనిపిస్తుంది. పచ్చని పంటలు పండే భూములను అభివృద్ధి, పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణం పేరుతో, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం మనం చూస్తున్న చరిత్రేనని మరువద్దు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మరచిపోదామా? మావోయిస్టుల ప్రధాన డిమాండ్ భూపంపిణీ, గిరిజనుల రక్షణ, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు. మరి మనదేశంలో ఎన్ని లక్షల ఎకరాల భూమి ఎంతమంది పెత్తందార్ల కింద ఉండిపోయిందో ఇప్పటికీ లెక్కలేదు. ఆ భూమి పేదలకు పంపిణీ చేస్తే ఉత్పాదకత పెరుగుతుంది. వారి కుటుంబాలు అభివృద్ది చెందుతాయి. ఇటీవలి కాలంలో విద్యాధికులైన యువకులు ఉద్యోగంకంటె వ్యవసాయమే మేలని భావిస్తున్నారు. వాణిజ్య పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భూపంపిణీ సక్రమంగా సాగితే మావోయిస్టులు తుపాకీలు వదలి జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉంది. మావోయిస్టుల ఎజెండాయే తమ ఎజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. అంటే మావోయిస్టులు డిమాండ్‌లో న్యాయం ఉందనేకదా అర్థం. దానిని వారు అమలుజరిపారా లేదా అనేది అప్రస్తుతం. ఇక ప్రధానమైనది మావోలు, సృష్టిస్తున్న హింస. హింసకు ప్రతి హింస ఎప్పటికీ సమాధానం కాదు. ఎన్‌కౌంటర్లపై సందేహాలు వ్యక్తమవుతూంటాయి. ఎవరు ముందు కాల్పులు జరిపారన్నది ముఖ్యం. ప్రపంచం ఇప్పుడు గ్లోబల్ విలేజ్‌గా మారింది. ఇప్పుడు కూడా మనుషుల్లో తారతమ్యాలు, వర్గ వైరుధ్యాలు, కులమత ఘర్షణలు ఉన్నాయి. డెబ్బయి ఏళ్ల ప్రజాస్వామ్యంలో కూడా ఇంకా ఇలాగే ఉన్నాం. మావోలే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఏమీ చేయలేదు. ప్రజాప్రతిఘటనలు ఎదురవడం వింత కాబోదు.

-జాన్ తిమోతి