AADIVAVRAM - Others

‘మార్పు’నకు సంకేతం.. సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమ్యక్ క్రాంతి.. సంక్రాంతి. అంటే పవిత్రమైన మార్పు. కాలమానం ప్రకారం సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తూ ప్రకృతిలో అందం, ఆనందంతో కూడిన మార్పును తీసుకొనివస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ‘మకర సంక్రాంతి’ అంటారు. సంక్రమం అంటే ఒక సంవత్సర కాలంలో సూర్యుడు ఒక్కొక్కొ నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రీతిగా ప్రవేశించిన దినమే సంక్రమణం. ఒక సంవత్సర కాలంలో పనె్నండు సంక్రమణాలుంటాయి. చైత్రమాసం నుండి వరుసగా 12 మాసములలో సూర్యుడు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. వీటిలో మకర-తుల-మేష-కర్కాటక సంక్రమణాలు ప్రధానమైనవి. అతి విశిష్టమైనది మకర సంక్రమణం. ఈరోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాభిముఖంగా పయనిస్తాడు.
ఉత్తరాయణం ఆధ్యాత్మికాభివృద్ధికీ, స్వాధ్యాయమునకూ, తీర్థయాత్రలకూ - వేదనిహిత సంస్కారములకు అనుకూలమైన కాలం. దక్షిణాయనం పితృసంబంధమైనది. పర్వదినములు కలిమానవులు తమ జీవనయానమును శ్రేయోమార్గంలో పయనించడానికి మార్గదర్శకములై అలరారుచున్నాయి. కొన్ని పండుగలు లోకకల్యాణం కోసం అవతరించిన అవతారమూర్తుల జన్మదినములు. ఆధ్యాత్మిక సత్యములను ప్రకటించునవిగా విశిష్టతను సంతరించుకుంటున్నాయి. భారతీయ సంస్కృతిలోని సామరస్యమును సమైక్యతను తెలిపి మానవులను సంస్కార మార్గమునకు మళ్లించేవిగా ఉంటాయి. యుయుగాలలో పర్వదినముల విశిష్టత ఎంతో ప్రాచుర్యము పొందింది. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించే దృష్టిని అలవరచునవి ఈ పర్వదినములు.
పుణ్యకాలం విషయానికి వస్తే ధర్మశాస్త్రానుసారం సంక్రమణ వేళకు ప్రొద్దు రెండు ఘడియలకంటె తక్కువగా ఉన్నచో మిథునం- కన్య- ధనుస్సు- మీనం-మకరానికీ ముందు ఘడియలే పుణ్యకాలమని తెలుపుతుంది. గ్రహాలకూ సంక్రమణాలుంటాయని కాల నిర్ణయ గ్రంథం వలన తెలుస్తుంది. పుణ్యకాలాల వివరణ ఉంది. గ్రహ, సంక్రమణాలు ఎలావున్నా కాలక్రమంలో ‘రవి సంక్రాంతి’కే ప్రాధాన్యం ఇవ్వడబడింది. ఈ సంక్రాంతి పండుగను దుర్గాదేవి పర్వంగా దేవీపురాణం వర్ణించింది.
సంక్రాంతి భేదాలు
వృషభ-సింహ-వృశ్ఛిక-కుంభ రాశులందు వచ్చే సంక్రాంతిని ‘విష్ణుపదం’ అంటారు. మిథున-కన్య-్ధనుస్సు-మీన సంక్రాంతులను ‘షడశీతి’ అంటారు. మేష-తుల సంక్రాంతులను ‘అయనముల’నీ అంటారు. వీటిలో చివరివి రెండూ పుణ్యప్రదములైనవని శాస్త్రప్రవచనం.
మకర సంక్రమణం-ఆచరణ
ఈ సంక్రాంతి మూడురోజులు నిర్వహిస్తారు. మొదటి దినమును భోగి పండువగా, రెండవరోజు మకర సంక్రాంతియనీ, మూడవ రోజు కనుమ పండుగనీ వరుసగా జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన మహాపర్వాన్ని మాత్రం సౌరమానం ప్రకారం ‘మకరసంక్రాంతిగా’ పాటిస్తారు. ఇది ఒక అపూర్వ పర్వదినం. ఈ పండుగకు ఎన్నో సాంస్కృతిక వైవిధ్యాలున్నాయి. భక్తీ-్భవావేశం-సమధికోత్సాహం విరిసే ఈ అపూర్వ పర్వదినంనాడు లక్షలాది జనులు నదీస్నానమాచరించి, సూర్యునికి అర్ఘ్యప్రదానం ఆచరించి పునీతులౌతారు. భక్తితో సూర్యుని పూజించి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి రోజుననే ‘సూర్యుడు’ ఉత్తరాభిముఖుడై భూమిపైన ఉత్తరార్థ గోళంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమతుంది. విశ్వసృష్టిక్రమానికి ఆదిపురుషుడు-అధిష్ఠానదేవత సూర్యభగవానుడే.
సంక్రాంతిలో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. దేవతలకు ఇది ఉత్తమకాలం. ఉత్తరాయణంలో మరణం సంభవిస్తే మోక్షప్రాప్తి అని పురాణ వచనం. కనుకే మహాభారతంలో భీష్ముడు అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి వున్నాడు. సంక్రాంతి అంటే మార్పు అని, అంటే మారడం-చేరడం అనే అర్థాలున్నాయి.
సంక్రాంతి పెద్దపండుగ అయ్యింది. ముఖ్యంగా సస్యముల విషయానికి సంబంధించి తొలకరిలో మొలకెత్తిన పంటలు అన్నీ కూడా మార్గశిర మాసానికి కాపునకు వస్తాయి. చేమంతులు, బంతిపూలు అందాన్ని ఆకర్షణలనూ వెదజల్లుతూ వుంటాయి. ఈ పుణ్యకాలంలో జనులు వేకువనే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు ఆచరించి సూర్యోదయంకోసం వేచి సూర్యోదయం కాగానే సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి. గాయత్రీమంత్రం జపిస్తూ ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించమని వేడుకోవాలి. తదుపరి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. సంక్రాంతిరోజున ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికానందంకోసం భగవంతుని ప్రార్థించాలి. నైవేద్యాలుగా నువ్వుపప్పుబెల్లం కలపి లడ్డూలను చేసి దేవునికి నివేదించి, బంధుమిత్రులకు పంచిపెట్టాలి. పొంగలితో మధ్యాహ్నం భోజనం చేయాలి. పాత్రులైనవారికి ప్రేమతో కలిగిన దాంట్లో కొంతైనా దానం ఇవ్వాలి. పొంగలికి కొత్తబియ్యం - కొత్త బెల్లం-శనగపప్పులను ఉడికించి పాలుపోసి చేయాలి. మంచి గుమ్మడికాయను దానంగా ఇస్తే అది తుష్టినీ, పుష్టినీ అందిస్తుంది.
సంక్రాంతికి పదిహేను రోజుల ముందుగా గృహిణులు వేకువజామునే లేచి ఇంటిముందు పేడ కలిపిన నీళ్లుజల్లి, బియ్యపు పిండితో రంగవల్లికలు దిద్ది- ముగ్గుల మధ్య గొబ్బెమ్మలుపెట్టి వాటిపైన గమ్ముడి, తంగేడు పూలు అమరుస్తారు. పేడక్రిమి సంహారిణి. పిండిని క్రిమికీటకాదులు తింటాయిగాన ఇది ఒక విధంగా భూతయజ్ఞనవౌతుంది. పాడిపంటలకాధారమైన పర్వదినం సంక్రాంతి. ఈ పర్వదినాలలో భాగవతులైన హరిదాసులు సకీర్తనలతో అన్ని వీధులలో తిరుగుతారు. గ్రామీణ ప్రాంతాలలో ఆటపాటలతో గ్రామీణులను ఆకర్షిస్తారు. కళారూపమైన గంగిరెద్దులను త్రిప్పుతారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ల పండుగగా అభివర్ణిస్తారు. ఈ పండుగ మూడురోజులూ బాలబాలికలు బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి ఇరుగుపొరుగువారిని పేరంటానికి పిలిచి సంబరాలు చేసుకుంటారు. భోగి రోజు భోగి మంటలు వేస్తారు. చిన్న పిల్లలను ముస్తాబు చేసి, తలపై భోగి పండ్లుగా రేగిపండ్లు పోసి ఆనందిస్తారు. ఇది చిన్నారులకు చక్కటి వేడుక.
సంక్రాంతి సందేశం
ప్రకృతి మాతకు - సూర్యునికీ - గోవులకు - సస్య లక్ష్మికి - ధాన్య లక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుకనే ఈ పర్వదినం ప్రాముఖ్యం. సకలైశ్వర్య స్వరూపుడైన ఈశ్వరుని కృతజ్ఞతతో అందరూ స్మరించే పర్వదినమిది. ధర్మము- జ్ఞానము- ప్రేమ-మోక్షప్రాప్తి ఇవన్నీ మానవులకు ఐశ్వర్యముగానుండి భౌతికంగా -నైతికముగా-ఆర్థికంగా-ఆధ్యాత్మికంగా సుఖశాంతులనిచ్చే పర్వదినం సంక్రాంతి. కనుక భగవంతుని అందరూ ప్రార్థించి దైవానుగ్రహం పొందాలి అని సందేశం. పవిత్ర పర్వదిమని అందరూ గుర్తెరగాలి. ఉత్తమమైన ఫలితాల కోసం ఉత్తరాయణ ప్రవేశకాలం గాన ఈ రోజున పఠించవలసిన శ్లోకం...
‘రవి సంక్రమణేప్రాప్తే - నస్నాయాద్యాస్తు మానవః
సప్తజన్మసురోగస్యాత్-నిర్థనశ్ఛైవ జాయతే’ అంటూ దేవతా పూజలు-స్తోత్ర పారాయణలు చేస్తు పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని శాస్త్రం.
‘యయాస్సన్నిహితానాజ్యః
తాస్తాః పుణ్యతమాః స్మృతాః’ అని ధర్మశాస్త్రం.

-పి.వి.సీతారామమూర్తి