AADIVAVRAM - Others

సంక్రాంతి విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*సంక్రాంతి అని పిలిచినా ఇది నాలుగు రోజుల పండుగ. అందుకే దీనిని పెద్దపండుగ అంటారు. నిజానికి మిగతా పండుగలతో పోలిస్తే కుటుంబాలన్నీ ఒకసారి తప్పనిసరిగా కలుస్తూండటం ఈ పండుక ప్రత్యేకత. మొదటి రోజు భోగి ఆధ్యాత్మికతతో కూడినదైతే సంక్రాంతి వేడుకతో కూడినది. మూడోరోజు పశువుల పండుగ. నాలుగోరోజు విందులుతో గడుపుతారు.

*మనదేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో సంక్రాంతిని పాటిస్తారు. అయితే విధివిధానాలు, పద్ధతులు, పేర్లు కాస్త మారుతాయి. నేపాల్, భూటాన్, చివరకు మయన్మార్‌లోనూ సంక్రాంతి జరుపుకోవడం అలవాటే.
ఖపాతసామాన్లను తొలగించి మంటల్లో పడేయడం ద్వారా ఇళ్లను శుభ్రపరుచుకోవడం భోగిలో సంప్రదాయం. గ్రామసీమల్లో అంతా కలసి పిండివంటలు చేసుకోవడం ద్వారా ఐక్యతకు కారణమయ్యేది సంక్రాంతి. పాడిపంటలకు కారణమయ్యే పశువులను కొలిచేది కనుమ.

*హరిదాసులు నెత్తిన పెట్టుకునే అక్షయపాత్ర భూగోళానికి సంకేతం. హరిదాసు సాక్షాత్తు విష్ణుమూర్తికి సంకేతం. ఈ భూమిని తానే ఉద్ధరిస్తున్నానడానికి, విష్ణునామ సంకీర్తనే మోక్షానికి మార్గమని చాటిచెప్పడం హరిదాసు ఆచారంలోని అంతరార్థం.

*మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. కానీ సంక్రాంతి సౌరమానం ప్రకారం ఆచరిస్తున్నాం. అందుకే గ్రెగరియన్ కాలెండర్ ప్రకారం సంక్రాంతి ఎప్పుడూ ఒకే తేదీలలో వస్తూంటుంది.

*గంగిరెద్దులు శివునికి సంకేతం. వాటి మూపురం శివలింగానికి సంకేతం. సంక్రాంతి వేడుకలు ప్రమదులతో సహా శివుడు వచ్చాడని మన ఇళ్లముందు గంగిరెద్దులు ఆడినప్పుడు అంతరార్థంగా భావిస్తాం.

*గొబ్బెమ్మలు గోపికలకు సంకేతం. సంక్రాంతి వేళల్లో మన ఇళ్లముందు పెట్టే పెద్దగొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. దాని చుట్టూ ఉండే చిన్న గొబ్బెమ్మలు ఆమె చెలికత్తెలయిన గోపికలన్నమాట.

*ముగ్గులన్నీ మహాలక్ష్మిని ఆహ్వానం పలికేందుకన్నమాట. ధనుర్మాసం నెల్లాళ్లూ విభిన్నమైన ముగ్గులతో వాకిళ్లు కళకళలాడుతుంటాయి. ఒకవీధిలోని వారంతా సంక్రాంతినాటికి కలసి రథం ముగ్గువేస్తారు. అంటే అందరి ఇళ్లముందునుంచి రథాన్ని లాగే తాడులా ముగ్గు కలుపుతూ రథం ముగ్గు వేస్తారన్నమాట. ఇది కలివిడితనానికి, ఐక్యతకు, ఆధ్యాత్మికతకు చిహ్నం.

*సంక్రాంతి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. భీష్మాచార్యుడు మాఘశుద్ధ సప్తమి నుంచి ఒక్కో ప్రాణం విడిచిపెడుతూ మాఘశుద్ధ ఏకాదశినాడు ఐదవ ప్రాణాన్ని విడిచిపెడతాడు.

*ఆదిశంకరాచార్యులు ఈరోజునే సన్యాసం స్వీకరించారు.