AADIVAVRAM - Others

గాలిపటం... ఉత్సాహ కెరటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగురవెయ్యడంలోని ఆనందం ఆనిర్వచనీయం. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ఏటా జనవరి నెల ఆరంభంతోటే సర్వత్రా గాలిపటాల కోలాహలం మిన్నంటుతుంది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల్లోనూ ఇప్పటికీ పతంగుల పోటీలు నిర్వహిస్తున్నారు. పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. ఆకాశమే హద్దుగా ఎగిరే పతంగులు తెలియని అనుభూతిని కల్గిస్తాయి. విభిన్నమైన రంగులలో, భిన్నమైన ఆకృతులతో ఉన్న పతంగులు ఆకర్షిస్తున్నాయి. యువతీ యువకులు పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలు, శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఇతర పక్షులు, ప్రకృతి సోయగాలు, కార్టూన్ బొమ్మలతో రెడీ చేసిన కైట్‌లు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి అంటేనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి సందడిగా చేసుకునే పండుగ. ముఖ్యంగా గాలిపటాల పండుగ. మహిళలు ముగ్గులతో, రైతులు వ్యవసాయ పనుల్లో, పిల్లలు గాలి పటాలతో సంతోషంగా తమ సమయాన్ని గడుపుతుంటారు.
పతంగుల పండుగ పగలు మాత్రమే జరుపుకుంటా రనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రాత్రుళ్లు కూడా గాలి పటాలు ఎగురవేస్తారు. వెలుగులు నింపుకున్న పతంగులు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి. వాటిని చూసి పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నారుల్లా చప్పట్లు చరిచి ఆనందించాల్సిందే. ఢిల్లీ దర్వాజా కూడా పతంగుల మార్కెట్‌కు పేరు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులు, రాజులు పతంగుల క్రీడను బాగా ప్రోత్సహించేవారట.
పతంగుల సంస్కృతి పూర్వకాలం నుంచే ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీ.పూ.206లో చైనాలో హేస్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. హేస్ చక్రవర్తికి వచ్చిన ఉపాయమే తొలి గాలిపటం. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం అమెరికాలోని టరెంటం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌కే తొలిసారి పతంగిని ఆవిష్కరించినట్టు చరిత్ర చెప్తోంది. జపాన్‌లో 5 నుంచి 8 అడుగుల పతంగులను ఎగురవేస్తారట! నార్వేలో పతంగుల దినం పేరిట పండుగ జరుపుకోవడం సాధారణం. ఆసియా దేశాల్లో పతంగిని ఎగురవేయడం కొన్ని చోట్ల ఒక మతాచారంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో జపాన్‌లో పతంగుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. పావురాళ్లు, కంచర గాడిదలు మొదలైన వాటి ద్వారానే కాకుండా పతంగుల ద్వారానూ తపాలా సేవలు కొనసాగినట్టు తపాలా చరిత్ర చెబుతోంది. 1754లో బెంజిమన్ ఫ్రాంక్లిన్ అనే శాస్తజ్ఞ్రుడు ఆకాశంలోని విద్యుత్ గురించి తెలుసుకునేందుకు పతంగులను వాడాడట. 1870లో లారెన్స్ హర్‌గ్రీవ్స్ అనే శాస్తజ్ఞ్రుడు ఒక బాక్స్ కైట్‌ను సిద్ధం చేసి అందులో వైజ్ఞానిక పరికరాలను అమర్చి, తద్వారా ఎన్నో ఘనకార్యాల్ని సాధించినట్టు తెలుస్తోంది. 19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జతచేసి ఎంతో ఎత్తుకు ఎగురవేసి, పై నుంచి భూమి ఫొటోలు తీయడం జరిగింది.
థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నించి అవతలికి వెళ్లే అవకాశం ఉండటంతో భారీ పతంగులను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరుచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు. ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి వారం ఒక కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. జపాన్‌లో కొన్ని పతంగుల బరువు 200 కిలోల దాకా ఉంటాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనైతే సంక్రాంతి రోజున ఏకంగా అంతర్జాతీయ పతంగుల పండుగే జరుగుతుంది. దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది ‘ఉత్తరాయన్’గా పిలిచే ఈ వేడుకలో పాల్గొంటారు. అహ్మదాబాద్ నడిబొడ్డున ఉండే ‘పతంగ్ బజార్’ పండుగకు వారం రోజుల ముందు నుంచీ గాలిపటాలు కొనేవాళ్లూ అమ్మేవాళ్లతో కిటకిటలాడిపోతుంది. అంతేకాదు, చాలామంది ఇళ్లలోనే రంగురంగుల గాలిపటాలను తయారుచేసి వాటిని ఇంటి ముందే పెట్టి విక్రయిస్తారట. 1989 నుంచీ అక్కడ ఏటా ఈ వేడుక జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని పల్డి ప్రాంతంలో పతంగుల మ్యూజియం కూడా ఉంది. మనం సంక్రాంతి పండుగకు గాలి పటాలు ఎగరేస్తాం. కానీ జమ్మూ కాశ్మీర్‌లో రాఖీ పౌర్ణమికి గాలిపటాలు ఎగరేస్తుంటారు.
గాలిపటాలకు వాడే నైలాన్ దారం పక్షుల ప్రాణాలను హరిస్తున్న సంఘటనలు కోకొల్లలు. వీటిని ఎగరేసే సమయంలో చిన్నారులు గాయాల బారిన పడుతున్నారు. ప్రాణాంతకంగా మారుతున్న చైనా పతంగులను నిషేధించాలంటున్నారు పర్యావరణవేత్తలు. చెట్ల కొమ్మలు, కరెంట్ స్తంభాలకు చిక్కుకున్న గాలిపటాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మాంజా, దారాలు పక్షుల కాళ్లకు చుట్టుకుని చనిపోతున్నాయి. మిద్దెలపై పతంగులు ఎగురవేసే వారు ప్రమాదవశాత్తూ కింద పడిపోతున్నారు. తెగిపోయిన గాలి పటాలను పట్టుకునే యత్నంలో ఎందరో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి పతంగులు తెగి విద్యుత్ తీగలకు తగులుకుంటుంటాయి. వాటిని తీసుకునేందుకు చిన్నారులు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారిన తగులుకుంటుంటాయి. వాటిని తీసుకునేందుకు చిన్నారులు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేనిచోటా, ఉంటే వీటికి తగలకుండా పతంగులు ఎగురవేయాలి. విద్యుత్ తీగల మీద పడిన గాలిపటాలను తీసేందుకు భవనాల మీద నుంచి, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు.

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి