Others

పార్వతీ తనయ నమోస్తుతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీ తనయ నమోస్తుతే
ప్రథమ పూజలందు పార్వతి తనయుండు
విఘ్నములను బాపి విద్య నొసగ
వక్రతుండ రూప వరసిద్ధి గణపతీ
చేరికొలుతు నిన్ను శివకుమార

శతకపద్య విద్య సంప్రాప్త మందగ
రచన జేసినాడ రమ్యమొప్ప
భక్తి సుమములిడుతు బ్రహ్మపురంధ్రికి
నాదు కవిత క్రియ నవ్యదీప్తి

పాలసంద్రమందు పవళింప విష్ణువు
శేషపాన్పు పైని సేవ సల్పు
క్షీరసాగర సుత శ్రీమహాలక్ష్మికి
ప్రణతులిడగ జన్మ పావనంబు

రచన: కవిశ్రీ మోహన్ ప్రసాద్
బాలాజీ నగర్ వీరభద్రపురం వేల్పూర్

చరవాణి: 9347993020