Others

కోరితే కాదనేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం పాపకర్మవల్లనే జననమరణచక్రంలో బంధీలు అవుతామని అనుకోనక్కర్లేదు. కోరిక అనేది ఉంటే చాలు మళ్లీ జన్మ తప్పకవస్తుంది. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా ఆ పుణ్యఫలాన్ని అందుకోవడానికి కూడా జన్మలు వస్తూనే ఉంటాయి. ఇక కోరికలు ఉంటే అవి తీరేదాకా జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అట్లాంటి కథే ధ్రువుని కథ. సునీతి ఉత్తానపాదుల ముద్దుల కుమారుడు ధ్రువుడు. ఉత్తానపాదులకు సురుచి అను మరో భార్యకూడా ఉండేది. ఇద్దరు భార్యలతో ఉత్తానపాదుడు ఆనందంగా కాలం గడుపుతుండేవాడు. కాల క్రమంలో సునీతి దూరమై సురుచి రాజుగారికి దగ్గరైంది. రాజుగారికి సురుచి మాటే వేదంగా ఉండేది. ఆమె ఏం చేసినా అతడు మారు మాట్లాడేవాడు కాదు. దానితో సురుచిలో అహంకారం పెరిగింది. ఆ అహంకారంతో తన కొడుకైన ఉత్తముడు మాత్రమే తండ్రి ప్రేమానురాగాలను పొందాలని అనుకొనేది. ఒకరోజు ఉత్తముడు తన తండ్రి అంకంపై కూర్చుని ఉండడం చూసి తాను కూడా అట్లా కూర్చోవాలనే కోరికతో ధ్రువుడు ఉత్తానపాదుని దగ్గరకు వచ్చాడు. తన కోరికను తండ్రితో చెప్పాడు. ఆ విషయం సురుచికి తెలిసింది. వెంటనే ఆమె కోపావేశంతో వచ్చి ధ్రువుని దూరంగా నెట్టివేసి‘తండ్రి అంకపీఠంపై కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి. దానికి ఎంతో అదృష్టం ఉండాలని దూరంగా తొలిగిపో ఇంకెప్పుడు ఇంతటి సాహసాన్ని చేయకు. నీవు దురదృష్టవంతునివి కనుకనే ఈ సునీతి కడుపున పుట్టావు’అని తిట్టింది. జరిగినదానికి ఎంతో బాధపడుతూ తన తల్లి దగ్గరకు ధ్రువుడు వెళ్లాడు. సునీతి ధ్రువుని బాధ తెలుసుకొంది. మీ పినతల్లి చెప్పిన విషయం నిజమే కనుక నీవు ఏమీ బాధపడకు. మన దుఃఖానికి ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు. పూర్వజన్మల పాపమే ఈ జన్మలో దుఃఖహేతువు అవుతుంది. కనుక నీవు మీ తాతగారిలాగా శ్రీమన్నారాయణుని సేవ చేయుము. ఆయనే అన్నింటికీ సర్వాధికారి. ఆ మహావిష్ణువు అనుగ్రహం దొరికితే శాశ్వతమైన శ్రీవారి సాయుజ్యమే మనదౌవుతుంది. నీవు ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే స్వామిని వేడుకో అని అంది. అమ్మమాట ప్రకారం అడవి బాట పట్టాడు. మనస్సంతా ఆవేదనతోను, ఆక్రోశంతోను నిండి పోయింది. ఎట్లాగైనా ఆ శ్రీమన్నారాయణుని చూడాలి. ఆయనే్న నా ఈ స్థితిని మెరుగుపర్చుమని అడగాలి అనుకొంటూ ముందుకుపోతున్నాడు.
నారదుడు ఈ బాలుడిని చూశాడు. ‘అయ్యోపసివాడని మొగ్గలాంటి వాడు ఈ బాలుడు. పౌరుషవంతుల వంశంలో పుట్టినవాడు. ఆ వాసన వల్లనే నేడీ పినతల్లి దుర్వాక్కులను విని సహించలేక వెళ్తున్నట్టు ఉన్నాడు. ఇతనికి నేను సహాయం చేయాలి’ అని మనసున అనుకొన్నాడు. త్రిలోకసంచారి అయిన నారదుడు ధ్రువుని ఎదుట నిల్చాడు.

- డా. రాయసం లక్ష్మి