Others

తిమోతిది తిరోగమన ఆలోచన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 3న నేను రాసిన వ్యాసానికి స్పందనగా జాన్ తిమోతి జనవరి 13న ‘‘సాఫ్ట్‌వేర్ కాదు.. సమానత్వం ముఖ్యం’’ అని రాసిన సమాచారం చదివాను. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అయితే ఆ అభిప్రాయాలు, ఆలోచనలు ఏ మేరకు ప్రాసంగికమైనవన్నదే ప్రధానం. సమకాలీన సమాజానికి ఉపయుక్తంకాని అభిప్రాయాలు, ఆలోచనలకు ‘కరెన్సీ’ ఉండదు. కానీ ఉంటుందని ఊహించుకునేవారి అభిమతానికి ఎవరెందుకు అడ్డు చెబుతారు? కాలమేవారి శంకలకు సమాధానం చెబుతుంది!
‘‘్భ పంపిణీ సక్రమంగా సాగితే మావోయిస్టులు తుపాకీలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉంది.’’ అని జాన్ తిమోతి అన్నారు. అదొక ఊహ మాత్రమే! వాస్తవం మాత్రం కాదు. మావోయిస్టులు పోరాడుతున్నది రాజ్యాధికారం కోసం తప్ప, భూమికోసం, భూపంపిణీ కోసం, గిట్టుబాటు ధరలు రైతులకు దక్కాలన్న డిమాండ్ కోసం కాదు. ఈ ప్రాథమిక అవగాహన ఉన్నట్టయితే అనేక అస్పష్టమైన అంశాలపై స్పష్టత ఏర్పడుతుంది. ఈ కీలకమైన అంశాన్ని విస్మరించడం కారణంగా చాలామంది, అయోమయానికి గురవుతున్నారు. మావోయిస్టులు చెబుతున్న ‘నూతన ప్రజాస్వామిక వివప్లవం’ వర్తమానంలో సాధ్యమా?.. అన్నదానిపైనే దృష్టి నిలిపితే మరెన్నో అనుమానాలు మంచులా విచ్చుకుపోతాయి.
వర్తమానం డిజిటల్ మయం. కృత్రిమ మేధతో సమస్త రంగాలు ప్రభావితమవుతున్నాయి. చివరకు వ్యవసాయం కూడా. రానున్న రోజుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతం కానున్నది. ఈ పరిజ్ఞానం వెనుక కనిపించే ‘సాఫ్ట్‌వేర్’, సాయుధ పోరుకాదు. మరలాంటప్పుడు ఏది ముఖ్యమో ఎవరికి వారే నిశ్చయించుకోవాలి. ఇంటి దగ్గర ఉండి రైతు పొలం వద్ద నీళ్ల పంపు మోటారు ‘ఆఫ్’ చేస్తున్నాడు. దీనివెనుక సాంకేతికత ఉందిగాని, సాయుధ పోరాట భావనలు లేవు. మరమనుషులు (రోబోలు) వ్యవసాయం చేస్తున్న విషయం గమనించాలి. ఇప్పటికే పెద్దఎత్తున యంత్రాలు వ్యవసాయ రంగంలోకి వచ్చాయి. మానవశ్రణ ఉత్పత్తి రంగంలో గణనీయంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో దీని విశ్వరూపం కనిపించనున్నది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చెబుతున్న సాయుధపోరు రైతులకు ఉపకరిస్తుందనుకోవడం సమంజసమేనా?.. అని ఎవరికి వారే ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకోవాలి.
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరి ప్రాంతపు రైతులు - కూలీలు వారి వారసులు అంతే దోపిడీకి గురవుతున్నారు. జోతేదారులు (్భస్వాములు) గతంలో మాదిరిగానే దోపిడీ చేస్తున్నారని విశే్లషించుకోవడం వాస్తవాల్ని చూసేందుకు నిరాకరించడమే అవుతుంది. నక్సల్‌బరి తిరుగుబాటు అనంతరం రెండు-మూడు కొత్త తరాలొచ్చాయి. వారి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆకాంక్షలు పట్టించుకోకుండా వారి పూర్వీకులు మాదిరే వీరూ జీవిస్తున్నారని భావించడం సబబు కాదు. కానీ అవే పడికట్టు పదాలతో ప్రపంచాన్ని చూసేందుకు ఇష్టపడితే నష్టపోయేది, కష్టపడేది ప్రజలే! శ్రామికవర్గమే! కాలంతోపాటు వస్తున్న మార్పులను అందుకునేలా చూసేవాడే నిజమైన విప్లవకారుడవుతాడు తప్ప అర్ధ శతాబ్దం క్రితం నాటి భావజాలం, అభిప్రాయాలు, ఆలోచనలు వ్యాప్తి చేసేవారుకాదు!
గ్రామాల్లోనూ ‘డిజిటల్ లిటరసీ’ భారీఎత్తున పెరుగుతున్న తరుణంలో, ఇంటర్నెట్ ఇంటింటికీ చేరుతున్న కాలంలో, స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన సందర్భంలో, రైతులు - కూలీలు డిజిటల్ చెల్లింపులు జరుపుతున్న వేళ, అనేక ‘యాప్’లు ద్వారా సమాచారం అందుకుంటూ ప్రయోజనం పొందుతున్న క్షణాన ‘సాఫ్ట్‌వేర్’ కీలకంగాకపోతే సాయుధపోరు కీలకం ఎలా అవుతుంది?
జాన్ తిమోతిగాని మరొకరు గాని సమానత్వం అన్న మాట తెలిసి వాడుతారో, తెలియక వాడుతారో గానీ సమాతన్వం అన్న పదం మానవాళికి అన్వయమవదు. సాధికారత అనే పదం సమంజసమైనది. మన కుటుంబంలో, కార్యాలయంలో, నివసించే ప్రాంతంలో, మరోచోట ఎక్కడైనా సమానత్వం ఇప్పుడుగాని, గతంలో ఉన్నదా? లేదు! భవిష్యత్‌లోనూ సమానత్వం కనిపించదు. మానవుడి డిఎన్‌ఏలో అది లేదు. అలాంటప్పుడు మావోయిస్టులు... నక్సలైట్లు, సమానత్వం కోసం పోరాడుతున్నారని చెప్పడం, సమానత్వం సాధ్యమని చెప్పడం మభ్యపెట్టడమే అవుతుంది తప్ప మేల్కొల్పడం అవదు. గతంలో కూరుకుపోయినంత కాలం భవిష్యత్‌ను దర్శించలేం! అణగారిన వర్గాలను ఉన్నత స్థితిలో చూడాలంటే ఆధునిక జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, దాని అవగాహన వారికి అందాలి. అందుకనేలా ప్రోత్సహించాలి. అటువైపు నడిచేలా ఉత్తేజ పరచాలి! అంతేగాని తిట్లు, శాపనార్థాలు పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు.
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్‌డేటా విశే్లషణ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్.. యాప్స్, సరికొత్త యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. వీటిని ఎంతోకొంత జీర్ణం చేసుకుంటేనే బడుగులకు భవిష్యత్. భూస్వామ్యం, దోపిడీ, సామ్రాజ్యవాదం.. లాంటి పదాలకు కాలం చెల్లుతోంది. కాలం చెల్లే పదజాలంతో మమేకమవడం ముఖ్యమా? భవిష్యత్ దృశ్యాన్ని చూపుతున్న సాఫ్ట్‌వేర్ ముఖ్యమా?.. అన్నది జాన్ తిమోతి నిర్ణయించుకోవలసిందే!

-వుప్పల నరసింహం.. 9985781799