Others

ఆవు నెయ్యితో ఆరు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలో పేరుకుపోతున్న చెడు కొవ్వును నివారించుకోవాలంటే ఆవు నెయ్యి వాడటం ఉత్తమమైన మార్గం అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఆవు నెయ్యి కేవలం మన పూజకు, దీపాలకు మాత్రమే ఉపయోగిస్తుంటాం. కాని గేదె నెయ్యి కన్నా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆవు నెయ్యి అలవాటు చేయమని సలహా ఇస్తున్నారు. జలుబు, దగ్గు దరిచేరనీయకుండా కాపాడుతుంది. అంతేకాదు శరీరం మృదువుగా ఉండాలంటే కూడా ఆవు నెయ్యి తినమని చెబుతున్నారు. ఆవు నెయ్యి వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
1. వంటలో ఆవు నెయ్యిని వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆవు నెయ్యి శరీరంలోని వేడి తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి పెసరుపప్పు కిచిడీలో వేసుకుని తింటే చాలు శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళతాయి. మలబద్దకం నివారించబడాలంటే అన్ని వయసుల వారూ ఆవు నెయ్యి తించే చాలు జీర్ణక్రియ సాఫీగా జరిగిపోతుంది.
2. ఆవు నెయ్యి తినటం వల్ల కొవ్వును కరిగించే ఆమ్లం తయారవుతుంది. దీనివల్ల కొవ్వు కరిగి బరువు సులువుగా తగ్గిపోతారు.
3. శరీరంలో ఉండే వేడి వల్ల కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా కొన్ని రకాల జబ్బుల బారిన పడవచ్చు. కాబట్టి శరీరంరోని వేడి తగ్గాలంటే ఆవు నెయ్యి ఎంతో మంచిది.
4. హార్మోన్లు సమతుల్యంగా ఉండేటట్లు తోడ్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ కె2,ఎ,డి,ఇలు పెరగటానికి ఆవు నెయ్యి ఉపకరిస్తుంది.
5. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముక పుష్టి కూడా కలుగుతుంది. శరరంలో క్యాన్సర్ కణాలు వృద్ధిచెందకుండా కాపాడుతుంది.
6. ఆవు నెయ్యి తినటం వల్ల విటమిన్ కె2 వృద్ధిచెంది రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.