Others

కౌన్సిలింగ్ ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కౌన్సిలింగ్’- ఆధునిక కాలంలో ఈ మాట విననివారు ఉండరు. కానె్వంట్ సీటు దగ్గర నుంచి ఆసుపత్రిలోని రోగుల వరకూ అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించటం పరిపాటైంది. విలాసవంతమైన జీవితాన్ని గడపటమే సంతోషానికి ఆనవాళ్లు అన్నట్లు ఎగిసిపడుతున్న ఈ కాలంలో పసిప్రాయం నుంచే స్వయం నియంత్రణ అలవర్చుకునేలా నేర్పించటం ఎంతో అవసరం. ఆకర్షణల మయమైన ఈ సమాజంలో ఉద్వేగాలు, ఉద్రేకాలు విశ్వరూపం దాలుస్తాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచే కష్టాలు, కన్నీళ్లు తెలియకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటు చేయటం వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించటం లేదు. పిల్లలకు తొలి గురువు తల్లిదండ్రులే. చిన్నతనంలో పిల్లలు తాము నేర్చుకునే ప్రక్రియలో ప్రతి విషయం వారికి వింతగానే ఉంటుంది. వారు నెమ్మదిగా తెలుసుకుంటూ నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని ఆచితూచి దానికి మనం స్పందించాలి. ఈ స్పందన మోతాదు తగ్గినా, హెచ్చినా పిల్లల్లో అవగాహన శక్తి క్షీణిస్తుంది.
పిల్లలు బడికి వెళ్లనని మారం చేస్తే వాళ్లని బడికి పంపేందుకు డబ్బులు ఎరజూపి పంపిస్తాం. ఆ ఎర వేయటం వల్ల ఆ పిల్లాడు క్రమం తప్పకుండా బడికి వెళ్లటం జరుగుతుంది. కాని చదువు మీద శ్రద్ధ చూపడు కదా!అదే చదువుకోవాలనే ఆసక్తి అతనిలో కలిగిస్తే బడికి వెళ్లటానికి ఇక ప్రతిరోజూ డబ్బును ఆశించడు కదా! పిల్లల్లో అవగాహన శక్తి పెంచి ఆలోచింపజేసేదే నిజమైన కౌన్సిలింగ్. అంతేకాని వికసించే ఆ చిన్నారుల మనసుల్లో గొంతెమ్మ కోరికలు పుట్టించేలా ఉండకూడదు.
అపుడే హైస్కూల్ చదువు ముగించుకుని కాలేజీలోకి అడుగుపెడుతున్న ఓ అమ్మాయి తన తండ్రి గురించి ఇలా చెబుతుంది. ‘మా నాన్నకు నా మీద అసలు ప్రేమే లేదు. నాతోటి పిల్లలందరూ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. నాకు మాత్రం స్మార్ట్ ఫోన్ కొనిపెట్టడం లేదు’ అని ఫిర్యాదు చేసింది. చదువుకునే ఈ అమ్మాయికి అసలు స్మార్ట్ఫోన్ అవసరమే లేదు. కాని తన గొంతెమ్మ కోరిక తీర్చలేదు కాబట్టి అలా మాట్లాడుతుంది. అందుకే విచక్షణలేని వాళ్లు మనసులో కలిగిన అన్ని కోరికలు తీర్చుకోవాలని తాపత్రయపడతారు. ఆ సమయంలోనే ఈ ‘కౌన్సిలింగ్’ వారిలోని విచక్షణాజ్ఞానాన్ని మేల్కొలిపేదిగా ఉండాలి. అంతేకాని నిద్రపుచ్చేదిగా ఉండకూడదు. వడివడిగా అడుగులు వేస్తున్న ఈ జీవన విధానంలో దురదృష్టంకొద్దీ మనకు వీధికొకటి చొప్పున కౌన్సిలింగ్ సెంటర్ ప్రత్యక్షమవుతోంది. ఆ కౌన్సిలింగ్ సెంటర్‌లలో ఆ పసిమనసుల్లో తలెత్తే సందేహాలకు సరైన సమాధానాలే కరువైపోయాయి.
చరిత్రలో గొప్ప శాస్తవ్రేత్తలను చూస్తే పసివయసులో అక్షరాలు నేర్చుకోవటానికి తడబడినవారే. ఐన్‌స్టీన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు గొప్ప శాస్తవ్రేత్తను కావాలని ఊహించి ఉండడు. కాని ఆయనలో ఉన్న తపన, అభ్యాసం, ఆయనను గొప్పవాణ్ణి చేసింది. ఈ కింది చిన్ని కథలోని సారాంశం చూస్తే మనకు ఎంతో విలువైన కౌన్సిలింగ్ దొరుకుతుంది. ఈ కథను రామకృష్ణ పరమహంస తన భక్తులకు ఉపదేశించినదే. అదేమిటో తెలుసుకుందాం.
అది జూన్ నెల. తొలకరి చినుకులతో నేలంతా పచ్చగా ఉంది. ఒక మేకపిల్ల తన తల్లితో ఆడుకుంటూ పక్కనే ఉన్న తంగేడు పొదలను చూస్తోంది. తంగేడు పూలు అంటే మేకలకు ఎంతో ఇష్టం. తంగేడు పూలు నవంబరు నెలలో కానీ మొగ్గలు తొడగవు. కాని ఈ మేకపిల్ల తంగేడు పూలు తినాలని ఆశ పడుతుంది. మారాం చేస్తుంది. అపుడు ఆ తల్లి మేక ఇలా చెబుతుంది. ‘నువ్వు తంగేడు పూలు తినాలంటే ఎన్నో అపాయాలను, గండాలు గట్టెక్కిపోవాలి. వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నెలలు అంత మంచివి కావు. దుర్గాదేవికి బలి ఇవ్వటానికి నిన్ను ఎవరో ఒకరు తీసుకుపోవచ్చు. ఆ తరువాత కాళీపూజ పండుగ వస్తుంది. ఆ పూజకు మనజాతిలోని మగ జంతువులన్నీ బలవుతాయి. కాబట్టి ఆ గండాలన్నీ గట్టెక్కి పెరిగి పెద్దయితే నవంబరు నెలలో నువ్వు తంగేడు పూలను తినగలవు’ అని ఆ మేకపిల్లలోని విచక్షణా జ్ఞానాన్ని మేల్కొల్పింది. ఇలాంటి విచక్షణా జ్ఞానానే్న మేల్కొలిపినపుడు వారిలో ఉండే గొంతెమ్మ కోరికలు సైతం నిగ్రహం కోల్పోకుండా, పురి విప్పకుండా ఉంటాయి. ఇదే పిల్లలకు ఇవ్వాల్సిన నిజమైన కౌన్సిలింగ్. పిల్లల్లో ఇలాంటి కోరికలు తలెత్తినపుడు మనకు ఎదురయ్యే ఇబ్బందుల మధ్య సరైన అవగాహన నేర్పితే మానవ సంబంధాలు సైతం బాగుంటాయి. అంతేకాని అతి గారాబం చేస్తే వారిలో సున్నితమైన మనస్తత్వం ఏర్పడి చిన్నపాటి ఆటుపోట్లకే అధైర్యపడతారు.

-హరిచందన