AADIVAVRAM - Others

హైదరాబాద్‌లో పుస్తకాల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రియులను అలరిస్తోంది. గత ఏడాది నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు పది లక్షలమంది హాజరైనారు. ఈసారి మరింత పెద్దసంఖ్యలో పుస్తక ప్రియులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 స్టాల్స్‌కు అవకాశం కల్పించారు. జనవరి 18నుంచి 28 వరకూ కొనసాగే ఈ పుస్తక ప్రదర్శనకు ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు ప్రవేశం కల్పిస్తున్నారు. సెలవురోజులు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9వరకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు, పాత్రికేయులకు ఎప్పటిలాగానే ప్రవేశం ఉచితం. గణతంత్ర దినోత్సవం నాడు ప్రాంగణంలో విద్యార్థులు, చిన్నపిల్లలకు చిత్రలేఖనం, సంగీత, నృత్య, సాంస్కతిక పోటీలు నిర్వహిస్తారు. తొలిసారిగా ఈ ప్రదర్శన ప్రాంగణానికి తెలంగాణ దళిత మేధావి భాగ్యరెడ్డి వర్మ పేరు పెట్టారు. వేదికకు ప్రఖ్యాత కవి సినారె పేరును, పుస్తకావిష్కరణ వేదికకు సామల సదాశివ పేరును పెట్టారు. ప్రధాన ద్వారానికి తొలి తెలుగు కథారచయిత అచ్చమాంబ పేరు, రెండు గడపలకు ప్రఖ్యాత జర్నలిస్టు, కవి అరుణ్‌సాగర్, అనిశెట్టి ప్రభాకర్‌ల పేర్లు పెట్టారు. విద్యార్థినీ, విద్యార్థులను పెద్దఎత్తున హాజరయ్యేలా ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు తీసుకుంది. రెండువారాలుగా వివిధ పాఠశాలలు, సంఘాలతో సమావేశమైన బీసీ కమిషన్ సభ్యులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా పనిచేస్తున్నారు. గత ఏడాది జరిగిన బుక్‌ఫెయిర్, హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పుస్తక ప్రదర్శనకు చక్కటి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఈసారి మరింత ఆదరణ లభిస్తుందని అంచనావేస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో గత ఏడాది తొలిసారిగా వికీపీడియా బృందం స్టాల్‌ను ఏర్పాటు చేయడం హైలెట్‌గా నిలిచింది.