Others

అగ్నిపర్వతం(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైజయంతీ మూవీస్ పతాకంపై చలసాని అశ్వనీదత్ నిర్మాతగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా, సూపర్‌స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ చిత్రం అగ్నిపర్వతం అంటే నాకెంతో ఇష్టం. జమదగ్నిగా, ఇన్స్‌పెక్టర్ చంద్రంగా సూపర్‌స్టార్ కృష్ణ అభినయం చూసి తీరాల్సిందే. అగ్ని- జమదగ్ని అంటూ కృష్ణ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో విజృంభించి నటించారు. తల్లి శారదను మోసం చేశాడని తండ్రి జగ్గయ్యపై ద్వేషం పెంచుకున్న కొడుకుగా జమదగ్ని పాత్రను దర్శకుడు రాఘవేంద్రరావు శక్తివంతంగా తీర్చిదిద్దాడు. విజయగా విజయశాంతి, రాధగా రాధ, రుద్రరాజుగా ప్రభాకర్‌రెడ్డి, ఫణిభూషణరావుగా రావుగోపాలరావు, డాక్టర్‌గా నూతన్‌ప్రసాద్, జానకమ్మగా అన్నపూర్ణ, పార్వతమ్మగా శారద, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, పరచూరి గోపాలకృష్ణలు తమ పరిధుల మేరకు నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు రాసిన ఈ చిత్రంలో మాటలు చాలా బాగుంటాయి. ‘నేను ఏకాంతాన్ని ప్రేమిస్తాను కానీ ఏ కాంతను ప్రేమించలేదు’, ‘విబితే చెబుతా, చెబితే విబుతా’ లాంటి మాటలు పేలాయి. స్వర చక్రవర్తి స్వరపరచిన పాటలన్నీ ఆణిముత్యాలే. ఈ గాలిలో, వయ్యారాలు, సింగారాలు, మంచిముత్యాలు, ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం, రావే ఇంగ్లీషు రంభ, వన్ వన్ వన్ నెంబర్‌వన్, గోడదూకి వచ్చావా చందమామ- ముఖ్యంగా ‘ఈ గాలిలో ఎక్కడో అలజడి’ పాటను దర్శకేంద్రుడు అత్యద్భుతంగా చిత్రీకరించి ఈ పాటకోసమే మళ్లీ మళ్లీ చూసేలా తీశారు. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అల్లు రామలింగయ్య దెబ్బ తగిలి ఆసుపత్రికి వెళితే అక్కడ రక్తం ఎక్కించాల్సి రావడం, కాంపౌండర్ సారధి కుక్క రక్తం తీసుకురావడం, చిడతల అప్పారావు వైద్యం చేయడం, రావు గోపాలరావుతో అల్లు రామలింగయ్య వాడు పార్వతమ్మ కొడుకు, వీడు జానకమ్మ కొడుకు అని చెప్పడం బావుంది. 1985లో వచ్చిన ఈ అగ్నిపర్వతం చిత్రం కమర్షియల్‌గా విజయవంతమై అన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని ఘనవిజయం సాధించి వైజయంతీ మూవీస్ సంస్థకు తలమానికంగా నిలిచింది.
-జి.గౌరీ గాయత్రి ఉప్పల్, హైదరాబాద్